Vitamin ’C‘ : విటమిన్ C ఎక్కువగా తీసుకుంటే..పీరియడ్స్ పై ప్రభావం చూపుతుందా..?

విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పుతాయా? దీని గురించి నిపుణులు ఏం చెబుతున్నారంటే..

10TV Telugu News

Can too much Vitamin C to early or delayed periods? : మహిళలు తమ పీరియడ్ టైమ్ ఎప్పుడో చెప్పేయగలరు. ఫలానా తేదీ అని గుర్తు పెట్టుకుంటారు. ఈ నెల ఏ తేదీన వస్తే.. వచ్చే నెల కూడా ఒక రోజు అటూ.. లేదంటే ఇటూ తేడాతో అదే సమయానికి వచ్చేస్తూ ఉంటుంది. ఇది రెగ్యూలర్ పీరియడ్స్ వచ్చే వారికి వర్తిస్తుంది. కొంతమందికి బాగా లేట్ అవుతుంటుంది. లేదా త్వరగా వచ్చేస్తుంటుంది.అలా జరిగితే నిపుణులను సంప్రదించాలి.వారి సూచనల మేరకు సూచనలు పాటించాలి. కాగా..రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వారికి కూడా అప్పుడప్పుడు.. క్రమం తప్పుతూ ఉంటాయి. కొందరిలో రావాల్సిన తేదీ కన్నా ముందే వచ్చేస్తుంది. మరికొందరిలో ఆలస్యంగా వచ్చేస్తుంది. మూడు నాలుగు రోజుల తేడాలు జరుగుతుంటాయి.

Read more : Reject Zomato : ‘హిందీ వస్తేనే డబ్బులు తిరిగి ఇస్తాం’..కస్టమర్‎కు షాకిచ్చిన జోమాటో
అలా పీరియడ్స్ క్రమం తప్పడానికి మనం వాడే కొన్ని మందులు, మానసిక ఒత్తిడి, యాంటీబయాటిక్స్ , విటమిన్ వినియోగం ఇలా కారణం ఏదైనా మీ పీరియడ్స్ ఆలస్యం కావచ్చు లేదా అవి త్వరగా వచ్చేలా చేస్తాయి. అయితే.. విటమిన్ సీ ఎక్కువగా తీసుకోవడం వల్ల పీరియడ్స్ క్రమం తప్పుతాయట. రోగ నిరోధక శక్తిని పెంచుకోవటానికి ‘విటమిన్-సి’ ఎంతగానే ఉపయోగపడుతుందనే విషయం తెలిసిందే. మన రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది, మన హృదయ ఆరోగ్యాన్ని కాపాడుతుంది, మన కంటి చూపును ఆరోగ్యంగా ఉంచుతుంది ,చర్మం కాంతివంతంగా ఉండేలా చేస్తుంది. కరోనా మహమ్మారి సమస్య వచ్చినప్పటినుంచి ప్రస్తుతం జనాలు రోగనిరోధక శక్తిని పెంచడానికి ప్రతిరోజూ విటమిన్ సి తీసుకోవడం అలవాటు చేసుకున్నారు. కానీ రోగ నిరోధక శక్తిని పెంచే విటమిన్ సి క్రమం తప్పకుండా తీసుకుంటే మహిళల రుతు చక్రాన్ని ప్రభావితం చేస్తుందట.

Read more : Photography Awards: లక్ష మాటల్లో చెప్పలేనిది ఒక్క ఫొటోతో చెప్పొచ్చు.. మనిషి చేస్తున్న తప్పులేంటో..

మహిళలకు ప్రతి నెలా పీరడియ్స్ వస్తూనే ఉంటాయి. పీరియడ్స్ కారణంగా.. రక్తం తీవ్రంగా కోల్పోతుంటారు. దాని వల్ల శరీరంలో ఐరన్ తగ్గిపోతుంది. ఐరన్ తగ్గడం వల్ల శరీరంలో రక్త హీనత ఏర్పడుతుంది. ఇది స్త్రీ సంతానోత్పత్తిపై కూడా ప్రభావం చూపుతుంది.విటమిన్ సి తీసుకోవడం వల్ల ఐరన్ ని శరీరానికి అందించగలుగుతాం. అధ్యయనాల ప్రకారం..ఐరన్ లోపం ఉన్నవారికి విటమిన్ సి కూడా లోపిస్తుంది.విటమిన్ సి పీరియడ్స్‌లో ముఖ్యమైన పాత్ర పోషించే హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. విటమిన్ సి ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది, అదే సమయంలో ప్రొజెస్టెరాన్ స్థాయిలను తగ్గిస్తుంది. ఈ హార్మోన్ల మార్పులు గర్భాశయ సంకోచాలకు దారితీస్తాయి . గర్భాశయం లైనింగ్ విచ్ఛిన్నం కావచ్చు. రుతుస్రావానికి దారితీస్తుంది. కానీ ఇప్పటికీ, విటమిన్ సి రుతు చక్రాన్ని ప్రభావితం చేస్తుందని పీరియడ్స్ త్వరగా రావడానికి కారణమవుతుందనడంలో నిజం లేదు. ఈ మేరకు శాస్త్రీయంగా ఎక్కడా నిరూపితం కాలేదు.

Read more : Crazy Job News : మంచంపై హాయిగా పడుకుంటే చాలు..రూ.25 లక్షల జీతం..!

మీ రుతు చక్రం అనేక కారణాల వల్ల మారవచ్చు. ఒక సాధారణ కారణం ఒక నెలలో రోజుల సంఖ్య, ఇది మారుతూ ఉంటుంది. ఇది, కాలక్రమేణా, మీ పీరియడ్స్‌ను ఒక వారం వరకు తగ్గించవచ్చు. బరువు పెరగడం కూడా మీ పీరియడ్స్‌పై ప్రభావం చూపుతుంది. గణనీయమైన బరువు తగ్గడం కూడా మీ పీరియడ్స్‌కు అంతరాయం కలిగిస్తుంది.హార్మోన్ల అసమతుల్యత, జనన నియంత్రణ మాత్రలు, ఇన్ఫెక్షన్లు కూడా ఆలస్యమయ్యే కాలాలకు దారితీస్తాయి. అధిక ఒత్తిడి, ఆందోళన మందులు కూడా మీ రుతుక్రమంలో ఆలస్యానికి కారణమవుతాయి.

×