Reject Zomato : ‘హిందీ వస్తేనే డబ్బులు తిరిగి ఇస్తాం’..కస్టమర్‎కు షాకిచ్చిన జోమాటో

‘హిందీ వస్తేనే డబ్బులు తిరిగి ఇస్తాం’.. అంటూ ఓ కస్టమర్‎కు జోమాటో షాకిచ్చింది. దీంతో సదరు కష్టమర్ దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో ‘రిజక్ట్ జొమాటో’ వైరల్ గా మారింది.

Reject Zomato : ‘హిందీ వస్తేనే డబ్బులు తిరిగి ఇస్తాం’..కస్టమర్‎కు షాకిచ్చిన జోమాటో

Reject Zomato

Reject Zomato : ఆన్‎లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‎ఫామ్ జోమాటో ట్విట్టర్‎లో తీవ్ర విమర్శలు ఎదుర్కొంది. ఓ వ్యక్తి జోమాటాలో ఫుడ్ అర్డర్ చేశాడు. కానీ అతనికి వచ్చిన ఫుడ్‎లో ఒక ఐటమ్ మిస్ అయింది. దీంతో అతను జోమాటో కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‎ను సంప్రదించాడు. అయితే ఎగ్జిక్యూటివ్‎ హిందీ వస్తే డబ్బులు తిరిగి వస్తాయని చెప్పారు…

ఆన్‎లైన్ ఫుడ్ డెలివరీలతో ఇప్పుడంతా హలో అంటూ పొలోమంటూ వాలిపోతున్నాయి ఆహార పదార్దాలు. ఆకలేస్తోంది.వండుకునే సమయంలో లేదు. ఓపికా లేదు. వెంటనే ఫోన్ చేతిలోకి తీసుకోవటం..ఒక్క క్లిక్ తో తినాల్సింది తెప్పించేసుకోవటం. దానికి ఠక్కుమని గుర్తుకొచ్చేవి జొమాటో. స్విగ్గీ ఇలా ఎన్నో ఉన్నా..జొమాటోనే ఫాలో అయిపోతున్నారు జనాలు ఎక్కువగా. అటువంటి జొమాటో కష్టమర్ కు షాకిచ్చింది. ‘హిందీ వస్తేనే డబ్బులు రిఫండ్ చేస్తాం’అంటూ చెప్పటంతో విమర్శలు ఎదుక్కొంటోంది.ఎందుకలా అంటే..

Read more : Swiggy Zomato : జీఎస్టీ పరిధిలోకి స్విగ్గీ, జొమాటో.. ఇక అవి కూడా రెస్టారెంట్లే

తమిళనాడుకు చెందిన వికాష్ అనే వ్యక్తి జోమాటో ఫుడ్ అర్డర్ చేశాడు. తన ఆర్డర్‌లో ఒక వస్తువు మిస్ అయినట్లు గుర్తించాడు. తరువాత అతను జోమాటో కస్టమర్ సర్వీస్‌ని సంప్రదించాడు. కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ ఇచ్చిన షాక్ కు సదరు కష్టమర్ కు షాక్ తగిలింది. అదేంటీ ఆర్డర్ చేసిందాంట్లో ఒక వస్తువు మిస్ అవ్వటానికి హిందీ భాషకు సంబంధమేంటో అతనికి అర్థం కాలేదు. ఇంతకూ కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ సదరు కస్టమర్ కు ఏం చెప్పాడంటే.. ‘హిందీ తెలియదు’ కాబట్టి డబ్బులు తిరిగి చెల్లించలేమని చెప్పాడు.

దాంతో వికాష్ కు ఒళ్లు మండిపోయింది. దీని కోసం నేను హిందీ నేర్చుకోవాలా? అంటూ మండిపడ్డాడు. దానికి సంబంధించిన చాట్ స్క్రీన్‌షాట్‌ను వికాష్ ట్విట్టర్‎లో షేర్ చేశాడు. “జోమాటో తమిళనాడులో అందుబాటులో ఉంటే, వారు భాషను అర్థం చేసుకున్న వ్యక్తులను నియమించుకోవాలి” అని వికాష్‌ చాట్ చేశాడు. ” అప్పుడు ఎగ్జిక్యూటివ్ ” సమాచారం కోసం, హిందీ మన జాతీయ భాష. కాబట్టి ప్రతి ఒక్కరూ హిందీని కొద్దిగా తెలుసుకోవడం సర్వసాధారణం.” ఈ ప్రతిస్పందన వికాష్‌కి కోపం తెప్పించింది, ‘భారతీయుడిగా నేను హిందీ నేర్చుకోవాలి’ అని ట్యాగ్ చేశారు. ప్రతిస్పందనగా, జొమాటో ఈ సంఘటన ‘ఆమోదయోగ్యం కాదు’ అని చెప్పింది.

దానికి జొమాటో ఈ సంఘటన ‘ఆమోదయోగ్యం కాదు’ అని చెప్పింది. సమస్యను పరిష్కరించడానికి వికాశ్ వివరాలను అడిగింది. వికాశ్ దానికి ఏమాత్రం సంతృప్తిపడలేదు. సదరు సర్వీస్ ఎగ్జిక్యూటివ్ నుండి ‘బహిరంగ క్షమాపణ’ కోరాడు.
దీంతో జోమాటోపై ట్విట్టర్‎లో తీవ్ర విమర్శలొచ్చాయి. ‎కస్టమర్ పోస్ట్ వైరల్ అయిన తర్వాత ‘రిజెక్ట్ జోమాటో’ ట్విట్టర్‌లో ట్రెండింగ్‎లోకి వచ్చింది.