Swiggy Zomato : జీఎస్టీ పరిధిలోకి స్విగ్గీ, జొమాటో.. ఇక అవి కూడా రెస్టారెంట్లే

శుక్రవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్ధిక మంత్రుల జీఎస్టీ కౌన్సిల్ 45 సమావేశం లక్నో వేదికగా జరిగింది.

Swiggy Zomato :  జీఎస్టీ పరిధిలోకి స్విగ్గీ, జొమాటో.. ఇక అవి కూడా రెస్టారెంట్లే

Swiggy Zomato

Swiggy Zomato :  శుక్రవారం కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్ధిక మంత్రుల జీఎస్టీ కౌన్సిల్ 45 సమావేశం లక్నో వేదికగా జరిగింది. ఈ భేటీలో అనేక కీలక అంశాలపై చర్చించారు. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే అంశంపై ఇప్పుడేమీ చర్చించేది లేదన్న ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.

Read More : Pushpa SriVani: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రికి అస్వస్ధత

జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను అటు కేంద్రం ఇటు రాష్ట్రాలపై ప్రతికూల ప్రభావం పడుతుందన్న అభిప్రాయమే దీనికి కారణం. ప్రస్తుతం విధిస్తున్న ఎక్సైజ్‌ సుంకం, వ్యాట్‌ సుంకాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు భారీగా ఆర్జిస్తున్నాయి. జీఎస్టీ పరిధిలోకి తీసుకొస్తే ఆదాయం తగ్గే అవకాశం ఉంటుంది. అందుకే దీనిపై ఎటువంటి నిర్ణయం తీసుకోకుండా వాయిదా వేసింది కౌన్సిల్

Read More : Virat Kohli: కోహ్లీ రిటైర్మెంట్ వెనుక కారణమిదేనంటోన్న మాజీ సెలక్టర్

ఇక ఇదే సమయంలో ఆన్లైన్ జొమాటో, స్విగ్గీ వంటి ఆహార డెలివరీ యాప్‌లను రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5% జీఎస్‌టీ పన్ను విధించింది. ఇంతకాలం జీఎస్టీ లేకుండానే కార్యకలాపాలు నిర్వహించాయి జొమాటో, స్విగ్గీ. అయితే ఈ భారం వినియోగదారులపై పడదని జీఎస్టీ కౌన్సిల్ తెలిపింది.