రెండు రోజుల్లో మ్యానిఫెస్టో ప్రకటన.. అంతేకాదు..: వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

YV Subba Reddy: జనసేన అధినేత పవన్ కల్యాణ్ 24 సీట్లతో సరిపెట్టుకున్నారని చెప్పారు.

రెండు రోజుల్లో మ్యానిఫెస్టో ప్రకటన.. అంతేకాదు..: వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి

YV Subbareddy

Updated On : February 24, 2024 / 2:53 PM IST

వైఎస్సార్సీపీ రెండు రోజుల్లో మ్యానిఫెస్టో ప్రకటిస్తుందని రాజ్యసభ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి అన్నారు. అంతేగాక, సిద్ధం సభలు ముగిసిన వెంటనే అభ్యర్థుల అందరి పేర్లను ప్రకటిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు ఉన్నవారు పార్టీ సమన్వయ కర్తలేనని, ఫైనల్ లిస్ట్‌లో ఎవరు ఉంటే వారే అభ్యర్థులని అన్నారు.

రాజ్యసభలో విజయమే అన్ని చట్టసభల్లో రిపీట్ అవుతుందని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. వైసీపీ 175 సీట్లనూ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సిద్ధం సభలు విజయవంతంగా జరిగాయని అన్నారు. టీడీపీకి అభ్యర్థులు దొరకడం లేదని చెప్పారు. వారికి 30 నియోజకవర్గాల్లో పోటీ చేయడానికి అభ్యర్థుల లేరని అన్నారు. 24 సీట్లతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ సరిపెట్టుకున్నారని చెప్పారు.

తమ అభ్యర్థుల మార్పు గెలుపు కోసమేనని తెలిపారు. కాంగ్రెస్‌కు మనుగడ లేదని అన్నారు. అసంతృప్తులు పార్టీలోకి వస్తే ఆ నియోజక వర్గాలు పరిస్థితులను బట్టి ఆలోచిస్తామని తెలిపారు. రాజ్యసభ సభ్యుడుగా విశాఖ వచ్చిన తనకు స్వాగతం పలికిన అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానన్నారు.

జనసేనకు 24అసెంబ్లీ సీట్లు.. పవన్ పై అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు..