గెలిచిన తర్వాత ర్యాలీలు చేస్తే కేసులు- విశాఖ ఆర్వో వార్నింగ్
హింసను ఉపేక్షించబోమన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు.

Election Counting : విశాఖలో కౌంటింగ్ కు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి మల్లికార్జున్ తెలిపారు. మొత్తం 21 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. కౌంటింగ్ ఏజెంట్ 6 గంటలకు రావాలని, ఒకసారి లోపలికి వచ్చాక పూర్తయ్యాకే మళ్లీ వెళ్లాలని స్పష్టం చేశారు. హింసను ఉపేక్షించబోమన్నారు. కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు. జిల్లాలో 144 సెక్షన్ అమల్లో ఉందని, గెలిచిన తర్వాత వియోత్సవ ర్యాలీలు చేస్తే కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు.
‘విశాఖ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లు అన్నీ పూర్తయ్యాయి. 21 హాల్స్ ఏర్పాటు చేశాం. 140 కెమెరాలతో నిఘా ఉంచాం. స్ట్రాంగ్ రూమ్ లో ఉన్న ఈవీఎంలను.. అబ్జర్వర్, ఆర్వో, ఏఆర్వో, రాజకీయ పక్షాలు, సెంట్రల్ ఆర్డ్మ్ పోలీస్ ఫోర్స్ ఆధీనంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేస్తూ సీల్ చేసిన లాక్స్ ను ఓపెన్ చేయడం జరుగుతుంది’ అని విశాఖ రిట్నరింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ తెలిపారు.
Also Read : ఫలితాలపై తీవ్ర ఉత్కంఠ.. గెలుపుపై వైసీపీ ధీమాకు కారణమేంటి? విజయంపై కూటమి కాన్ఫిడెన్స్ ఏంటి?