ఆగస్టు నెలలో కొత్త వాహనం కొనేందుకు సిద్ధమవుతున్నారా.. శుభ ముహూర్తాలు ఇవే.. తేదీ, సమయం.. ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ తెలుసుకోండి..
2025 ఆగస్టు నెలలో మీరు నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి సిద్ధమైతే.. అనేక శుభ ముహూర్తాలు ఉన్నాయి. దృక్ పంచాంగం ప్రకారం.. ఆ నెలలో 16 మంచి రోజులు ఉన్నాయి.

new vehicle
Auspicious times to buy vehicle: హిందూ సంప్రదాయాల్లో ఏదైనా నూతన పనిని ప్రారంభించే సమయంలో, విలువైన వస్తువులు కొనుగోలు చేసేటప్పుడు మంచి ముహూర్తం చూసుకుంటాం. మంచి రోజు, శుభ సమయం తెలుసుకొని ఆ సమయాల్లో పనులు ప్రారంభిస్తాం. మోటార్ సైకిళ్లు, కార్లు, ఇతర వాహనాలు కొనుగోలు చేసే సమయంలోనూ శుభ ముహూర్తం చూసుకొని కొనుగోలు చేస్తుంటారు. ఎందుకంటే.. శుభ ముహూర్తంలో చేసిన పనుల వల్ల ఇబ్బందులు ఎదురవ్వకుండా మంచి జరుగుతుందని నమ్ముతారు.
2025 ఆగస్టు నెలలో మీరు నూతన వాహనాలు కొనుగోలు చేయడానికి సిద్ధమైతే.. అనేక శుభ ముహూర్తాలు ఉన్నాయి. దృక్ పంచాంగం ప్రకారం.. ఆ నెలలో 16 మంచి రోజులు ఉన్నాయి. అందుకు సంబంధించిన వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.
♦ ఆగస్టు 01 (శుక్రవారం) : వాహన కొనుగోలుకు శుభ ముహూర్తం ఉదయం 5:43 నుండి ఆగస్టు 2వ తేదీ ఉదయం 03:40 వరకు.
♦ ఆగస్టు 03 (ఆదివారం) : ఉదయం 9.42 గంటల నుంచి 4వ తేదీ ఉదయం 5.44 గంటల వరకు.
♦ ఆగస్టు 04 (సోమవారం) : ఉదయం 5.44 గంటల నుంచి ఉదయం 9.12గంటల వరకు.
♦ ఆగస్టు 08 (శుక్రవారం) : మధ్యాహ్నం 2.28 గంటల నుంచి ఆగస్టు 9వ తేదీ ఉదయం 5.47గంటల వరకు.
♦ ఆగస్టు 10 (ఆదివారం) : ఉదయం 5.48 గంటల నుంచి మధ్యాహ్నం 12.09గంటల వరకు.
♦ ఆగస్టు 11 (సోమవారం) : ఉదయం 10.33 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు.
♦ ఆగస్టు 13 (బుధవారం) : ఉదయం 10.32 గంటల నుంచి 14వ తేదీ ఉదయం 4.23గంటల వరకు.
♦ ఆగస్టు 14 (గురువారం) : ఉదయం 5.50 గంటల నుంచి ఉదయం 9.06 గంటల వరకు.
♦ ఆగస్టు 17 (ఆదివారం): రాత్రి 7.24గంటల నుంచి 18వ తేదీ ఉదయం 5.52గంటల వరకు.
♦ ఆగస్టు 18 (సోమవారం) : ఉదయం 5.52 గంటల నుంచి 19వ తేదీ ఉదయం 2.06గంటల వరకు.
♦ ఆగస్టు 20 (బుధవారం): మధ్యాహ్నం 1.58 గంటల నుంచి 21వ తేదీ ఉదయం 5.53 గంటల వరకు.
♦ ఆగస్టు 21 (గురువారం) : ఉదయం 5.53 గంటల నుంచి మధ్యాహ్నం 12.44 గంటల వరకు.
♦ ఆగస్టు 27 (బుధవారం) : మధ్యాహ్నం 3.44 గంటల నుంచి 28వ తేదీ ఉదయం 5.57గంటల వరకు.
♦ ఆగస్టు 28 (గురువారం): ఉదయం 5.57గంటల నుంచి 29వ తేదీ ఉదయం 5.58గంటల వరకు.
♦ ఆగస్టు 29 (శుక్రవారం) : ఉదయం 5.58గంటల నుంచి ఉదయం 11.38 గంటల వరకు.
♦ ఆగస్టు 31 (ఆదివారం): ఉదయం 5.59గంటల నుంచి సాయంత్రం 5.27గంటల వరకు.