Astro Remedies : మీ ఇంట్లో ఈ 5 వస్తువులు ఉంటే.. లక్ష్మిదేవీ రమ్మన్నా రాదు.. చేతిలో పైసా మిగలదు.. నీళ్లలా ఖర్చు అవుతుంది!
Astro Remedies : మీ జీవితంలో సంపదను కోరుకుంటే వాస్తు దోషానికి కారణమయ్యే కొన్ని వస్తువులను ఇంట్లో నుంచి పారేయాలి. లేదంటే వ్యాపారం, ఉద్యోగంలో పురోగతికి ఆటంకం కలుగుతుంది. ఆ వస్తువులు ఏంటో తెలుసుకుందాం.

Astro Remedies
Astro Remedies : ప్రతి వ్యక్తి తన జీవితంలో లక్ష్మీదేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటాడు. కానీ, కొన్నిసార్లు ఎంతగా కష్టపడి పనిచేసినప్పటికీ, ఆ వ్యక్తి జీవితంలో డబ్బు కొరత ఉంటుంది. ఇది మీకు కూడా జరిగితే.. వాస్తు శాస్త్రం ప్రకారం మీ జీవితంలో అలాంటి పాజిటివ్ ఎనర్జీ అవసరం. తద్వారా మీరు పురోగతి సాధించగలరు.
ఆర్థిక లాభాల మార్గాలు తెరుచుకుంటూనే ఉంటాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఆర్థిక పరిస్థితికి అడ్డంకిగా భావించే కొన్ని వస్తువులు ఉన్నాయి. ఈ వస్తువులను సకాలంలో ఇంటి నుంచి బయట పడేయాలి. ఇంతకీ ఆ వస్తువులు ఏంటో వివరంగా తెలుసుకుందాం.
Read Also : Tech Tips : ఎక్కడ చూసినా ఫోన్ కాల్ రికార్డింగ్సే.. మీ కాల్ రికార్డ్ కాకుండా ఉండాలంటే ఇలా చేయండి..!
ఆగిపోయిన గడియారాలు :
ఆధునిక జీవితంలో ఫ్యాషన్ వేగంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో చాలా మందికి గడియారాలు అంటే చాలా ఇష్టం. కొత్త గడియారాలపై మోజుతో తరచుగా పాత గడియారాలను వార్డ్‌రోబ్‌లో లేదా డ్రాయర్‌లో ఉంచి మరచిపోతారు. గోడ గడియారాల విషయంలో కూడా ఇలాంటిదే జరుగుతుంది.
ఇలాంటి పరిస్థితిలో, కాలక్రమేణా ఈ గడియారాల బ్యాటరీ లైఫ్ అయిపోతుంది. అవి పనిచేయడం మానేస్తాయి. వాస్తు శాస్త్రం ప్రకారం.. మీ ఇంట్లో ఆగిపోయిన గడియారాలను ఉంచకూడదు. మీ పురోగతికి ఆటంకం కలిగిస్తుంది. డబ్బు సంపాదించడంలో సమస్యలను కూడా సృష్టిస్తుంది.
తుప్పు పట్టిన ఇనుము :
జ్యోతిషశాస్త్రంలో ఇనుము శని గ్రహంతో పోలుస్తారు. ఇనుము తుప్పు పడుతుంటే మీరు ఆ ఇనుమును ఇంట్లో ఉంచకూడదు. దీనివల్ల మానసిక కల్లోలం ఏర్పడుతుంది. ఆ వ్యక్తి తన కెరీర్‌పై పూర్తిగా దృష్టి పెట్టలేడు. ఉద్యోగ, వ్యాపారాలలో అడ్డంకులు ఎదురవుతాయి. డబ్బు సంపాదించే మార్గాలు మూసుకుపోతాయి.
ఇంటి పైకప్పుపై పడి ఉన్న చెత్త :
ప్రతిఒక్కరూ తమ ఇంటిని శుభ్రంగా ఉంచుకుంటారు. ఇంట్లో చెత్తను ఏ రోజుకు ఆ రోజున శుభ్రం చేసి బయట పారేస్తారు. కానీ, శుభ్రం చేసిన తర్వాత సేకరించిన చెత్తను పైకప్పుపైనే పడేస్తారు. కలప, ఇనుము, ఉక్కు, కాగితం, పాలిథిన్, బస్తాలు మొదలైన వస్తువులు చాలా సంవత్సరాలు ఇంటి పైకప్పుపై ఉంటాయి. వాస్తు లోపానికి ప్రధాన కారణంగా కూడా చెప్పవచ్చు. అలాగే, ఇంటి పైకప్పుపై పడి ఉన్న చెత్త కూడా డబ్బు రాకుండా అడ్డంకిగా మారుతుందని నమ్ముతారు.
మరణించిన బంధువుల బట్టలు :
వాస్తు దోషాలకు ఇదొక ప్రధాన కారణం. మరణించిన బంధువు వస్తువులు, బట్టలు, దిండ్లు, దుప్పట్లలు మొదలైన వాటిని ఇంట్లో ఉంచకూడదు. జ్యోతిష్యం ప్రకారం.. మరణించిన వ్యక్తులకు సంబంధించిన వస్తువులు ఏవి ఉండకూడదు. ముఖ్యంగా వారి దుస్తులను పేద లేదా అవసరంలో ఉన్న వ్యక్తికి దానం చేయాలి. ఇంట్లో పాత బట్టలు ఉంచడం వల్ల కూడా ఆర్థిక నష్టం కలుగుతుంది.
Read Also : Tech Tips : మీ ఫోన్ ఛార్జ్ చేసేటప్పుడు ఈ 5 మిస్టేక్స్ అసలు చేయొద్దు.. ఫుల్ డిటెయిల్స్ మీకోసం..!
ఇంట్లో ట్యాప్ నుంచి నీళ్లు కారడం :
కొన్నిసార్లు ఇంట్లోని ట్యాప్ నుంచి నీళ్లు కారుతూనే ఉంటాయి. చాలా మంది దీన్ని పెద్దగా పట్టించుకోరు. కానీ వాస్తు శాస్త్రం ప్రకారం.. ఇంట్లో ఏర్పాటు చేసిన ట్యాప్ వాటర్ కట్టేసినప్పటికీ కూడా అందులో నుంచి నీళ్ల దార కారుతుంటే అది సంపదతో సూచికగా భావించాలి. అంటే.. ఇంట్లో ఇలాంటి ట్యాప్ లీకేజీ ఉండటం వల్ల, డబ్బు నష్టం ఎక్కువగా ఉంటుందని అర్థం. నీళ్లు ఎలా వృథా అవుతున్నాయో మీ ఆదాయం కూడా రోజురోజుకీ అలానే తగ్గుతూనే ఉంటుంది.