Today Horoscope: నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారు బంధుమిత్రులతో సహనంగా ఉండాలి..!

ఈ రోజు (ఆదివారం, అక్టోబర్ 27, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

Today Horoscope: నేటి రాశిఫ‌లాలు.. ఈ రాశివారు బంధుమిత్రులతో సహనంగా ఉండాలి..!

Updated On : October 26, 2024 / 6:10 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస బహుళ ఏకాదశి పూర్తిగా మఘ: మ: 12:24 ఆదివారము ద్వాదశ రాశుల ఫలితములు..

1. మేష రాశి: అనుకున్న పనులలో విజయం. ప్రతివిషయంలో విజయం సాధించడం, మంచి సలహాలు తీసుకుంటారు, ఉద్యోగ, వ్యాపారములలో లాభములు, విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం. ప్రయాణములు చేయడం, తీర్థయాత్రలు చేయడం, కనకధార స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభఫలి తములు కలుగుతాయి.

2. వృషభ రాశి: అధికవ్యయం, ఆర్థిక పరంగా జాగ్రత్త అవసరము, అధిక ప్రయూణములు, అనవసరపు రాద్ధాంతములు, కోర్టు సమస్యలు, బంధుమిత్రులతో సహనంగా ఉండాలి, జాగ్రత్తలు అవసరం, అనవసరపు విషయముల మీద ఏకాగ్రత ఉండకూడదు. సుందరకాండ పారాయణం చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

3. మిధున రాశి: ధనవ్యయం, కోపము, ఆవేశము పెరగడం, తొందరపాటు నిర్ణయములు, బంధు మిత్రులతో అనుబంధం పెరగడం, ప్రయాణములలో నష్టము, సంతానము ద్వారా శుభవార్తలు, ఆదాయం పెరగడం, నూతన వస్త్రములు కొనడం. ఇష్టదైవ ఆరాధన చేయడం వల్ల శుభం కలుగును.

4. కర్కాటక రాశి: అన్నింటా విజయం, విద్యార్థులకు అనుకూలము, ధనలాభము, ప్రమాదములు, గొడవలు రాకుండా కాపాడుకోవాలి, విలువైన ఆభరణములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు అనుకూలము, గృహ ఉపకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

5. సింహ రాశి: అనుకోని ప్రయాణములు, ధననష్టము, వృథా భ్రమణం, ఉద్యోగ ప్రయత్నములు సఫలీకృతం కావడం, నూతన ఉద్యోగములు, నూతన వ్యాపారములు, మంచి ఆలోచనలు. గణపతి ఆరాధన చేయడం వల్ల శుభం కలుగుతుంది.

6. కన్యా రాశి: ప్రతిపనిలో విజయం, మానసిక ఆందోళనలు కలగకుండా చూసుకోవాలి. శారీరక సుఖం, కార్యసిద్ధి, శుభకార్యక్రమములో పాల్గొనుట. వ్యాపారాభివృద్ధి, సుఖం, స్థిరాస్తులలో లాభం, ధనాదాయం, గౌరవ మర్యాదలు, కుటుంబంలో శుభకార్యములు. “ఓం నమో నారాయణాయ నమః” అష్టాక్షరి మంత్రము చదివినచో శుభం కలుగును.

7. తులా రాశి: పుణ్యములు చేయడం, గౌరవసన్మానములు, గృహములో శుభకార్యక్రమములు చేయడం, యువతకు సంబంధములు కుదరడం, వృత్తి, ఉద్యోగములలో లాభములు, కార్య సానుకూలత, ధన సమృద్ధి, విద్యార్థులకు అనుకూలం, ఉన్నతమైన అభిప్రాయములు పెరగడం. అమ్మవారి ఆరాధన చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.

8. వృశ్చిక రాశి: ధన విషయంలో జాగ్రత్త అవసరము. వాత సంబంధ వ్యాధులు, భయము, బలహీనత, అనారోగ్యము, శుభకార్యక్రమములు చేయడం, సరైన నిర్ణయములు తీసుకోవడం, వ్యాపారంలో చికాకులు, ఉద్యోగంలో అధికారుల ఆగ్రహములకు గురి కావడం, గణపతి ఆరాధన చేయడం వల్ల శుభఫలితములు కలుగుతాయి.

9. ధనస్సు రాశి: ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం, అభివృద్ధి, ధనలాభము, వృత్తి వ్యాపార రంగములలో రుణబాధలు తగ్గడం, మంచి ఆలోచనలు కలగడం, నూతన వ్యాపారములు ప్రయుణముల వలన లాభములు, శుభకార్య నిర్వాహణ, అనుకోని ప్రయాణములు, స్త్రీలతో గొడవలు, కొద్ది వివాదములు. గకార అష్టోత్తరముతో గణపతి ఆరాధన చేసినచో శుభఫలితములు కలుగుతాయి.

10. మకర రాశి: అనవసరపు విషయములలో జోక్యం పనికిరాదు. ఆవేశం తగ్గించుకోవాలి, ప్రతివిషయంలో రాజీ అవసరము, గృహ నిర్మాణము, గృహ మరమ్మత్తులు, శుభకార్యాలు, ఆర్థిక లాభములు, ప్రయాణములలో జాగ్రత్త అవసరము. వృత్తి వ్యాపారములలో
చికాకులు, బంధుమిత్రులతో సహనంగా ఉండాలి, ఇష్టదైవ ఆరాధన చేసినచో ఫలితములు కలుగుతాయి.

11. కుంభ రాశి: మనః శాంతి కలగడం, అధిక ప్రయాణములు, తీర్థ యాత్రలు, అకస్మిక ధనలాభము, ఆకస్మిక ప్రయాణములు, ఉదర సంబంధ వ్యాధులు, ఉద్యోగ భద్రత అవసరము, శ్రమకు గుర్తింపు, అనేక మార్గములలో ఆదాయం, పెండింగ్ పనులు అన్నీ వేగంగా పూర్తి అవుతాయి. నూతన ఆభరణములు కొనుగోలు చేయడం, రాజకీయవ్యవహారములో జయము. శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఫలితములు కలుగుతాయి.

12. మీనం: ధననష్టం, వృథా ప్రయాణములు, చికాకులు, అలసట, వస్తువుల కొనుగోలు. స్త్రీలకు నూతన అవకాశములు, స్థిరాస్తి పెరగడం, ధనధాన్య సమృద్ధి కలగడం, విద్యార్థులకు అనుకూలము. దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు పొందుతారు.

 

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956