Today Horoscope: నేటి రాశి ఫలాలు.. దసరా రోజున ఈ రాశి వారికి ప్రతి విషయంలో అనుకూలమే..!

ఈ రోజు (శనివారం, అక్టోబర్ 12, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాలు వివరాలు...

Today Horoscope: నేటి రాశి ఫలాలు.. దసరా రోజున ఈ రాశి వారికి ప్రతి విషయంలో అనుకూలమే..!

Updated On : October 11, 2024 / 5:47 PM IST

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస శుద్ధ నవమి:ఉ 10:58, శ్రవణం: రాతె 4 27 శనివారం ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు

మేష రాశి:  బంధు మిత్రులతో స్నేహపూర్వక వాతావరణం, వ్యాపారంలో అధిక లాభాలు, గొప్ప వ్యక్తుల పరిచయములు, ఆశించిన ఫలితములు ఉద్యో గంలో రావడం, విద్యార్థులకు పోటీపరీక్షలలో అనుకూలముగా ఉండును, గృహపకరణ వస్తువులు కొనుగోలు చేయడం: ఇష్టదైవ ఆరాధన వలన అన్ని ఇబ్బందులు తొలగిపోతాయి

వృషభ రాశి: ఎలాంటి వివాదాలకు తావివ్వకండి, ఉద్యోగ భద్రత అవసరం, వ్యాపార భాగస్వామ్యం విషయంలో జాగ్రత్త అవసరము, వృధా ప్రయాణములు చేయకూడదు, అనవసరపు ఆలోచనలు చేయకూడదు, స్త్రీలు భర్తకు తోడుగా ఉంటారు: గణపతి ఉపాసన చేయవలెను శుభం కలగుతుంది.

మిథున రాశి: శుభ కార్యక్రమాలలో పాల్గొనడం, విరోధములు, తగవులు తగ్గించుకోవాలి, కోర్టు సమస్యల వలన ఇబ్బందులు, అలసట, ఉద్యోగ అధికారులతో వివాదములు, చిన్నచిన్న విషయములు పెద్దవిగా చేసుకోవటం, పనులలో ఆలస్యములు, వ్యాపారాలో తగాధలు, అనారోగ్యము: శ్రీలక్ష్మీ నరసింహ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

కర్కాటక రాశి: కుటుంబంలో ఆనందం, ఆకస్మిక ధనలాభం, ఆరోగ్యం కుదుటపడటం, సరియైన సమయంలో సరియైన నిర్ణయాలు తీసుకోవడం, కీర్తిప్రతిష్టలు, సరియైన ఆలోచనలు, కోపము తగ్గుతుంది, మంచి ఆలోచనలు, వృత్తి, ఉద్యోగములలో లాభములు, విదేశాలకు వెళ్లడం, దూర ప్రయాణములవలన లాభములు: గణపతి గాయత్రీ మంత్రము చదవడం ద్వార మంచి ఫలితములు వస్తాయి.

సింహ రాశి: విజయ ప్రాప్తి, వృత్తి ఉద్యోగములలో లాభములు, తీర్థ యాత్రలు చేయడం, శత్రువులు మిత్రులుగా మారుతారు, గౌరవ సన్మానములు, సమిష్టి కార్యక్రమములు, ధన ధాన్య లాభములు, కుటుంబంలోని వారు ఆరోగ్యంగా ఉంటారు, అధికారుల అభిమానము, విద్యావంతులకు గౌరవ సన్మాములు పొందటం: దుర్గ,గణపతి ఆరాధనలు చేయడం వలన ఉత్తమ ఫలితములు వస్తాయి.

కన్యా రాశి: అనారోగ్యం, అజీర్ణ సమస్యలు, భయము, మనస్తాపము, మానసిక ప్రశాంతత లేకపోవడం, స్థానచలనము, శరీరపీడ, స్త్రీతో సంగమం, అత్యాశ పెరగడం, కష్టములు రావడం, బుద్ధి చాంచల్యము, అనవసర కార్యములకు ధనవ్యయం, బుణ బాధలు, శత్రువులు పెరగడం: కాలభైరవాష్టకం చదవడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

తులా రాశి: ప్రతి పనులలో ఆటంకములు, వాహన సౌఖ్యములు ఉండవు, స్థానచలనము, కలహములు, అపకీర్తి, ఋణబాధలు, కార్యభంగము, శరీరపీడ, మోసపోవడం, వృథాప్రయాణములు, ప్రయాణంలో ఇబ్బందులు: కార్తికేయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల శుభం జరుగుతుంది. 

వృశ్చిక రాశి: ఆకస్మిక ధన లాభములు, బంధు వర్గములో గౌరవము, ఇరుగుపొరుగువారితో అనుకూలము, కుటుంబంలో వారికి ఆనందము, ప్రతి విషయములో అనుకూలము, వృత్తి ఉద్యోగ వృత్తులలో లాభములు, బంధువర్గములలో గౌరవమర్యాద పెరగటం: గణపతి పంచరత్న స్తోత్రం పారాయణం చేయటం వల్ల మంచి జరుగును. 

ధనస్సు రాశి: ధన విషయంలో చికాకులు, నమ్మిన వారి వలన మోసపోవడం, స్త్రీ మూలకంగా ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు, ఆకస్మిక స్థానచలనము, దూర ప్రయాణాలతో వస్తునష్టం, అకాల భోజనములు, గొడవలకు, తగాదలకు దూరంగా ఉండాలి, ఆపదలు, అపాయములు, అవరోధములు పెరగడం: సుందర కాండ పారాయణం చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి.

మకర రాశి: ఆకస్మిక విజయం, ఋణబాధా విముక్తి, దేవతా కార్యక్రమం, న్యాయ వ్యవహారాలలో విజయము, వృత్తి, వ్యాపారములలో అభివృద్ధి కార్యసిద్ధి, కోపంతో సమస్యలు, సుఖసంతోషములు, శుభకార్యక్రమములు: శివాలయంలో దీపారాధన చేయడం వలన ఉత్తమ ఫలితాలను పొందుతారు.

కుంభ రాశి: ఆకస్మిక ధన నష్టం, పై అధికారులతో మాటలు పడవలసి వచ్చును, మనస్సుకు ఇబ్బందికరమైన సంఘటనలు జరుగుతాయి, ప్రయాణములో అలసట కలుగును, బద్దకం పెరుగుతుంది, ఊహించని విషయములలో దెబ్బతింటారు, వ్యాపారంలలో గొడవలు జరుగుతాయి: దత్తాత్రేయ కవచం చదవడం వలన మంచి జరుగును.

మీనా రాశి: శుభవార్తలు, ధన ధాన్య లాభములు, లాభములు, వృత్తి, ఉద్యోగములయందు ఊహించని లాభములు కలుగును, కుటుంబములోవారికి ఆనందము కలుగును, లాభదాయకమైన ప్రయాణములు చేయడం, ప్రభుత్వ సహాయం లభించడం, ఉద్యోగంలో మార్పులు, నూతన వ్యాపారంలో మంచి లాభములు: కనకధార స్తోత్ర పారాయణం చేయడం వల్ల అధిక లాభములు కలుగుతాయి. 

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956