Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారు విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు..!

ఈ రోజు (బుధవారం, అక్టోబర్ 23, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస శుద్ధ బహుళ సప్తమి రా:తె 1:18 పునర్వసు పూర్తిగా బుధవారం ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు. 

మేష రాశి: బంధుమిత్రులతో సహనంగా ప్రవర్తించాలి, అధిక వ్యయం తగ్గించుకోవాలి, మానసిక ఆందోళనలు తగ్గించుకోవాలి, అనవసరపు విషయముల మీద జాగ్రత్త వహించాలి, విలువైన వస్తువులు కొనుగోలు చేయడం, ఇండ్లు కొనుగోలు సమయంలో జాగ్రత్త అవసరం: శ్రీ ఆంజనేయస్వామి ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

వృషభ రాశి: ధనలాభం, ప్రతి పనిలో విజయం సాధించడం, శుభకార్య నిర్వహణ, వృత్తి, ఉద్యోగాలలో లాభం కలగడం, విజయం లభించడం శుభవార్తలు, అభివృద్ది కలగడం, స్త్రీలకు విజయం, నూతన వ్యాపారంలలో విజయం: సుందరకాండ పారాయణం చేయడం వలన శుభ ఫలితములు కలుగుతాయి.

మిథున రాశి: విదేశాలకు వెళ్లే అవకాశాలు కనపడటం, దూరపు ప్రయాణములు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం, గృహ ఉపకరణ వస్తువులు కొనడం, మంచి ఆలోచనలకు పదును పెట్టడం, గృహములో శుభకార్యక్రమములు నిర్వహించడం: ‘ఓం నమః శివాయ’ పంచాక్షరి చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

కర్కాటక రాశి: పనిలో ఆలస్యం, అధిక ఖర్చులు, కార్యరంగంలో ప్రతికూలత, శత్రు వృద్ధి, బంధుమిత్రులతో విరోధము, ప్రయాణంలో ప్రమాదములు జరగకుండా జాగ్రత్త పడాలి, అనారోగ్యము, వాయిదాలు పడుతాయి, మానసిక ఆందోళనలు తగ్గించుకోవాలి, భయము పెరుగుతుంది: శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేయవలెను శుభం కలుగుతుంది.

సింహ రాశి: అనవసర కార్యములకు ధనవ్యయం, అపకీర్తి, స్దానచలనము, శరీరంలో వాతము, సోమరితనము, స్త్రీ మూలంగా గొడవలు, మనఃశాంతి లోపించును, మనో వేదనల వలన ఏ నిర్ణయము తొందరగా తీసుకోలేరు, వ్యాపారంలో నష్టము: శివ ఆరాధన చేసినచో అపాయములు తోలుగుతాయి.

కన్యా రాశి: ధనము కలసి రావడం, ప్రేమ పెళ్లిళ్లు, ఇరుగుపొరుగు వారితో అనుకూలత కలుగును, బంధు వర్గంలో గౌరవము, ఆధిక్యతలు కలుగును, సంతోషముగా కాలము గడుపుతారు, విందు వినోదములు, శుభకార్యనిర్వాహణ, రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన చేయవలెను శుభములు కలుగుతాయి.

తులా రాశి: భయము, ఉద్యోగంలో అనుకూలం, అకాల భోజనములు కలుగును, నమ్మినవారిచే మోసపోవడం, స్త్రీ మూలకంగా చికాకులు, వ్యాపారంలో ఇబ్బందులు, రహస్యములు దాచటం, ప్రయాణములలో ఆటంకములు: దేవి స్తోత్ర పారాయణం చేసినచో ఉత్తమైమన ఫలితములు కలుగుతాయి.

వృశ్చిక రాశి: బంధుమిత్రులతో విందు, వినోదాలు, విలువైన వస్త్రములు కొనుగోలు చేయడం, ధన వృత్తి విషయంలో అభివృద్ధి కలగడం, ఆనందముగా కాలం గడుపుతారు, వ్యాపారంలో మంచిలాభములు, మానసిక వేదనలు: శ్రీ సుబ్రహ్మణేశ్వర స్వామి వారి ఆరాధనం వల్ల శుభం కలుగుతుంది.

ధనస్సు రాశి: ప్రయాణంలో ప్రమాదాలు కలుగును, వివాహాది శుభకార్యక్రమములకు ఆటంకములు, పై అధికారుల మాటలు పడవలసి వచ్చిను, బంధు, పుత్ర, మిత్రులతో మాటామాట పట్టింపులు కలుగును, ఇబ్బందికరమైన సంఘటనలు కలుగును: శ్రీ దత్తాత్రేయ కవచం పారాయణం చేయవలెను శుభం జరుగును.

మకర రాశి: విందు వినోదములు, లాభాదాయకమైన ప్రయాణములు, సహాయ సహకారములు, వృత్తి ఉద్యోగములయందు ఊహించని లాభములు, అనుభవజ్ఞులతో సలహ సంప్రదింపులు చేస్తారు – శివారాధన వలన మేలు జరుగుతుంది .

కుంభ రాశి: అజీర్ణ బాధలు, సంతానముతో విరోధము, ధనలాభము, వ్యాపారంలో లాభము, ప్రయాణముల వలన ధనము రావడం, భయము, స్థానచలనము, స్త్రీ సుఖము, శరీర సౌఖ్యము, ధనలాభం, కుటుంబములో భార్యబిడ్డల మూలకంగా సుఖ శాంతులు కలుగును, అన్ని పనులు విజయవంతం కావడం, వ్యాపార లాభములు: శ్రీ వేంకటేశ్వర స్వామి వారి ఆరాధన వలన అంత మంచే జరుగును.

మీనా రాశి: అకాల భోజనం, అనారోగ్యం, మోకాళ్ళ నొప్పులు, అజీర్ణ బాధలు, ఆకాల వైరములు, నిద్రలేని, ఆటంకములు, ఉద్యోగ వ్యాపారంలో ఒత్తిడి, ప్రయాణములో ధన నష్టం, వృదా ప్రయూణము: సూర్యనమస్కారములు చేయడం వల్ల శుభం జరుగుతుంది. 

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956