మహా చండీని పూజిస్తే ధైర్యం, విజయం.. అమ్మవారి విగ్రహం ముందు చండీ, దుర్గా సప్తశతి చదివారా?
మహా చండీ అమ్మవారిని ఎరుపురంగు చీరలో అలంకరించి పసుపు రంగు పూలతో పూజిస్తారు.

Maha Chandi Devi
Devi Navaratrulu 2025: నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిలో ఐదవ రోజు శ్రీ మహా చండీ దేవిగా అమ్మవారు దర్శనం ఇస్తారు. చండీ దేవి ఒక్కోసారి శాంతంగా, ఒక్కోసారి రౌద్రంగా దర్శనం ఇస్తారు.
దయగల రూపంలో ఉండే చండీ దేవిని గౌరి, పార్వతి, శాకంభరి దేవీ, జగన్మాత, హైమవతి, శతాక్షి, భవాని అని పిలుస్తారు. రౌద్రంగా ఉన్న సమయంలో అమ్మవారిని దుర్గ, కాళి, శ్యామ, చండీ, చండిక, భైరవి అంటారు. (Devi Navaratrulu 2025)
మహా చండీ అమ్మవారిని ఎరుపురంగు చీరలో అలంకరించి పసుపు రంగు పూలతో పూజిస్తారు. చండీ, దుర్గా సప్తశతి చదవాలి. పులిహోరను నైవేద్యంగా పెట్టాలి. మహా చండీని పూజిస్తే ధైర్యం, విజయం వస్తుంది.
హరిద్వార్‌లోనూ చండీ దేవీ ఆలయం ఉంటుంది. రాక్షస సంహారం తర్వాత అమ్మవారు ఇక్కడ స్థిరపడ్డారు. ఈ విగ్రహాన్ని ఆది శంకరాచార్యుల వారు ప్రతిష్ఠించారని భక్తుల నమ్మకం. అమ్మవారికి నవరాత్రుల్లో అష్టమి, నవమిలో ప్రత్యేక పూజలు చేస్తారు. నవరాత్రుల సమయంలో శ్రీ మహా చండీ దేవిని దర్శించుకుంటే కోరికలు తీరతాయి.