Devi Navaratrulu 2025: ముల్లోకాలకు అందాన్ని, శ్రేయస్సును అందించిన శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి.. అమ్మవారిని పూజిస్తే..
శ్రీ చక్రానికి కుంకుమార్చన, లలితా అష్టోత్తరము పారాయణ చేయాలి. 'ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః' మంత్రాన్ని 108 సార్లు పఠించాలి.

Lalita Tripura Sundari Devi
Devi Navaratrulu 2025: నవరాత్రుల్లో ఇంద్రకీలాద్రిలో ఏడో రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవిగా దర్శనం ఇస్తారు. మహాశక్తి స్వరూపాలలో లలితా త్రిపుర సుందరీ దేవి ఒకరు. ముల్లోకాలకు అందాన్ని, శ్రేయస్సును అందించిన అమ్మవారు కావడంతో ఈమెను ‘త్రిపుర సుందరి’ అంటారు. శ్రీచక్రానికి అధిష్టాన దేవతగా ఉంటారు.
శ్రీ చక్రానికి కుంకుమార్చన, లలితా అష్టోత్తరము పారాయణ చేయాలి. ‘ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః’ మంత్రాన్ని 108 సార్లు పఠించాలి. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవికి కుంకుమతో ప్రతిరోజు పూజలు చేసే సువాసినులకు అమ్మవారు మాంగళ్య సౌభాగ్యాన్ని ప్రసాదిస్తారు. (Devi Navaratrulu 2025)
లలితా త్రిపుర సుందరీ దేవిని ఆరాధిస్తే విజయం, శ్రేయస్సు వస్తాయి. చెడు నుంచి రక్షణ వస్తుందని నమ్ముతారు. అమ్మవారి చేతుల్లో పాశం, అంకుశం, చెరకు విల్లు, పూల బాణాలు ఉంటాయి. అమ్మవారు దేవీ ఉపాసకులకు ముఖ్య దేవత. పంచదశాక్షరీ మహా మంత్రానికి అధిష్టాన దేవతగా అమ్మవారిని ఆరాధిస్తారు.
శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి పసిడి రంగు చీరలో దర్శనం ఇస్తారు. ఎర్రటి కలువపూలతో అమ్మవారికి భక్తులు పూజలు చేస్తారు. నైవేద్యంగా దద్ధోజనం, పరమాన్నం పెడతారు. సహస్రనామ పుస్తకాలు దానం చేయాలి.
లలితా త్రిపుర సుందరీ దేవిని పూజిస్తే కీర్తి, ప్రతిష్ఠలు వస్తాయి. తొమ్మిది రోజులు అమ్మవారిని పూజించడం వీలు పడని వారు మొదటి మూడు రోజులు లేదా తర్వాత మూడు రోజులు లేదా చివరి మూడు రోజులు పూజిస్తారు.