Devi Navaratrulu 2025: నవరాత్రులలో ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అలంకరణలు.. ఏయే అవతారాల్లో పూజిస్తారో తెలుసా?

ఈ నెల 22 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి.

Devi navaratrulu 2025

Devi navaratrulu 2025: ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ప్రతి ఏడాది నవరాత్రి వేడుకలు ఎంతో వైభవంగా జరుగుతాయి. ఇంద్రకీలాద్రిలోని దుర్గమ్మకు ప్రతిరోజు ప్రత్యేక అలంకరణలు చేస్తారు. సెప్టెంబరు 22 నుంచి శరన్నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి.

ఒక్కోరోజు ఒక్కో అవతారం ఎత్తి మహిషాసురుడు అనే రాక్షసుడిని దుర్గామాత సంహరించింది. చెడుపై మంచి సాధించిన విజయానికి సంకేతంగా దసరా పండుగను జరుపుకుంటారు. (Devi navaratrulu 2025)

Also Read: గొప్ప తేజస్సు ఉన్న అమ్మవారు ఏకవీరా దేవి.. తమలపాకు, వక్కలను నూరి ప్రసాదంగా..

అమ్మవారు వెలిసిన ప్రాంతాన్ని బట్టి అమ్మవారిని పలు అవతారాల్లో పూజిస్తారు. నవరాత్రులు అంటే తొమ్మిది రోజుల పండుగ. శ్రీ బాలా త్రిపురసుందరీ అవతారంతో అమ్మవారు మొదటిరోజు పూజలు అందుకోనున్నారు.

  • నవరాత్రులలో దుర్గమ్మ అలంకరణలు

    • మొదటి రోజు – బాలాత్రిపుర సుందరీ దేవి
    • రెండో రోజు – గాయత్రీ దేవి
    • మూడో రోజు – అన్నపూర్ణ మాత
    • నాలుగో రోజు – లలితా త్రిపుర సుందరీ దేవి
    • ఐదో రోజు – చండీ దేవి
    • ఆరో రోజు – మహాలక్ష్మి దేవి
    • ఏడో రోజు – సరస్వతీ దేవి
    • ఎనిమిదో రోజు – దుర్గాదేవి
    • తొమ్మిదో రోజు – మహిషాసుర మర్ధిని

విజయదశమి రోజన (అక్టోబరు 2) రాజరాజేశ్వరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దసరా జరుపుకుంటారు. అమ్మవారికి ఎరుపు, ఆకుపచ్చ రంగు వస్త్రాలను సమర్పిస్తారు. నైవేద్యంగా లడ్డూలు, రవ్వ కేసరి, చింతపండు పులిహోర పెడతారు.