Dhanatrayodashi: అక్టోబర్ 18 ధనత్రయోదశి సందర్భంగా ఎలాంటి విధివిధానాలు పాటించాలి, తద్వారా కలిగే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ఆశ్వీజ మాసంలో బహుళపక్షంలో వచ్చే త్రయోదశి తిథిని ధనత్రయోదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ ధనత్రయోదశికి చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది ధనత్రయోదశి రోజున ఇంటి గుమ్మం ముందు బలిదీపాన్ని వెలిగించాలి. ఆ బలిదీపం ఇంటికి, ఇంట్లో ఉన్న సభ్యులందరికీ సమస్త దోషాలను పోగొడుతుంది. కచ్చితంగా ధనత్రయోదశి రోజున ప్రతి ఇంటి యజమాని ఇంటి గుమ్మం బయట సాయంత్రం పూట ఈ బలిదీపాన్ని వెలిగించాలి.
* గోధుమ పిండి ప్రమిద తయారు చేసుకోవాలి. గోధుమ పండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ప్రమిద తయారు చేసుకోవాలి. దీన్ని గోధుమ పిండి ప్రమిద అంటారు. ఈ ప్రమిదను ఇంటి గుమ్మం బయట పెట్టాలి. అందులో నువ్వుల నూనె పోసి ఒత్తులు వేసి దీపాన్ని వెలిగించాలి.
* ఆ దీపం దగ్గర ఒక చిన్న ఆకు ఏదైనా ఉంచి, ఆ ఆకులో బియ్యం పోసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి. బలిదీపం దగ్గర ఒక తమలపాకు ఉంచి అందులో కాస్త బియ్యం, బెల్లం ముక్క ఉంచి.. బలిదీపానికి నైవేద్యంగా పెట్టాలి.
* అలాగే బలిదీపం దగ్గర ఒక రాగి నాణెం, ఒక గవ్వ ఉంచాలి. రాగి నాణెం ఆధునిక కాలంలో తొలగట్లేదు. శాస్త్రాల్లో అయితే రాగి నాణెం అని చెప్పారు. రాగి నాణెం దొరకదు కాబట్టి దాన్ని ప్రత్యామ్నాయంగా రూపాయి నాణెం ఏర్పాటు చేసుకోండి. ఒక గవ్వ (లక్ష్మి గవ్వ) ఇతర ఏ గవ్వ అయినా ఉంచండి. అలా ఏర్పాటు చేసి బలి దీపం రాత్రి చీకటి పడే వరకు వెలిగేలా చూసుకోవాలి.
మర్నాడు కొండెక్కిన మణిదీపాన్ని ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయాలి.
అలాగే బియ్యం, బెల్లం కూడా ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి. లేదా పారే నీళ్లలో వదలాలి.
ఇలా బలిదీపం పెడితే ధనత్రయోదశి రోజు ఇంటి గుమ్మం ముందు సాయంకాలం పూట ఇంటి యజమాని బలిదీపం వల్ల సంవత్సర మొత్తం ఇంట్లో ఉన్న కుటంబసభ్యులు అందరికీ ఎలాంటి ప్రమాదాలు రాకుండా కాపాడుతుంది. అపమృత్యు దోషాలు, గండాలు రాకుండా కాపాడుతుంది. ఆరోగ్య సమస్యలు లేకుండా కాపాడుతుంది.
ధనత్రయోదశి రోజున తప్పనిసరిగా ఇంట్లో ప్రతి ఒక్కరు కనీసం నాలుగు దీపాలు వెలిగించి.. ఆ దీపాలను దానం ఇవ్వాలి. సహజంగా అందరూ కార్తీక మాసంలో దీపదానం చేస్తారు. కానీ ధర్మ శాస్త్ర గ్రంథాలు ధన త్రయోదశి రోజున కూడా దీపాలు దానం ఇవ్వమని చెప్పాయి. ధనత్రయోదశి రోజు ఇంట్లో ప్రతీ ఒక్కరు కనీసం నాలుగు దీపాలు వెలిగించి ఆ దీపాలు దక్షిణతో పాటు బ్రాహ్మణుడికి దానం ఇస్తే వాటిని యమ దీప దానాలు పేరుతో పిలుస్తారు. దాని వల్ల కూడా ఏడాది మొత్తం ప్రమాదాలు, గండాలు, అపమృత్యు దోషాలు, అనారోగ్య సమస్యలు ఉండవు.
ధనత్రయోదశి రోజు ఇంట్లో బంగారం కానీ వెండి కానీ ఉంటే వాటిని ఆవు పాలతో శుద్ధి చేసి తర్వాత మంచి నీళ్లతో కడుకున్ని వాటిని పూజా మందిరంలో పెట్టుకోవాలి. పూజ చేసిన తర్వాత మళ్లీ ఆ ఆభరణాలను బీరువాలో దాచుకోవాలి. దీని వల్ల ఏడాది మొత్తం లక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావొచ్చు..
Also Read: కార్తీక మాసంలో స్నానం ఇలా చేస్తే.. రాజయోగమే..!