Karthika Masam Snanam: కార్తీక మాసంలో స్నానం ఇలా చేస్తే.. రాజయోగమే..!

మామూలుగా అయితే నదిలో స్నానం చేయాలి. లేదా చెరువులో చేయాలి. లేదా బావి దగ్గర నీళ్లు తోడుకుని చేయాలి. ఇవన్నీ చేయలేని వారు ఇంట్లో

Karthika Masam Snanam: కార్తీక మాసంలో స్నానం ఇలా చేస్తే.. రాజయోగమే..!

Updated On : October 17, 2025 / 12:14 AM IST

Karthika Masam Snanam: కార్తీక మాసంలో స్నానం ఎలా చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి. కార్తీకంలో స్నానం చేసేటప్పుడు పాటించాల్సి నియమాలు ఏంటి? పండితులు ఏం చెబుతున్నారు? ఇప్పుడు తెలుసుకుందాం.

కార్తీక స్నానం అంటే కార్తీక మాసంలో ఏ రోజైనా సరే సూర్యోదయానికి అరగంట ముందు చేసే స్నానం అని అర్థం. సూర్యోదయం అయిన తర్వాత స్నానం చేస్తే దాన్ని కార్తీక స్నానం అని అనరు. సూర్యోదయానికి అరగంట ముందే స్నానం చేయాలి. చల్ల నీళ్లతో స్నానం చేయాలి. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు గోరు వెచ్చని నీళ్లతో చేయొచ్చు.

మామూలుగా అయితే నదిలో స్నానం చేయాలి. లేదా చెరువులో చేయాలి. లేదా బావి దగ్గర నీళ్లు తోడుకుని చేయాలి. ఇవన్నీ చేయలేని వారు ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఎక్కడ స్నానం చేస్తున్నా సరే కార్తీక దామోదర ప్రీతర్థ్యం అనుకోవాలి. అలాగే స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపు, చిటికెడు కుంకుమ స్నానం చేసే నీళ్లలో కలుపుకుని ఆ నీళ్లతో స్నానం చేస్తూ గోవిందా, గోవిందా, గోవిందా.. పుండరీకాక్ష అని మూడుసార్లు అనుకోవాలి. అప్పుడు అది సంపూర్ణంగా కార్తీక స్నానం ఫలితం ఇస్తుంది.

ఎవరైనా నది దగ్గర స్నానం చేస్తుంటే.. తప్పకుండా వస్త్రం ధరించి స్నానం చేయాలి. మగవాళ్లైతే పైపంచ వేసుకుని స్నానం చేయాలి. ఆడవాళ్లు అయితే చీర కట్టుకుని స్నానం చేయాలి. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత మగవాళ్లు పైపంచ చివరి భాగంలో బొటన వేలు, చూపుడు వేలు.. ఈ రెండు వేళ్లు నొక్కుతూ ఆ నీళ్లు కింద పడేలా చూడాలి. ఆడవాళ్లైతే చీర చెంగు చివర భాగంలో బొటన వేలు, చూపుడు వేలు(కుడి చెయ్యి).. ఈ రెండు వేళ్లతో వస్త్రాన్ని నొక్కుతూ ఆ నీళ్లు ఒడ్డున పడేలా చూడాలి. దీన్ని జల నిష్పీడనం అనే పేరుతో పిలుస్తారు.

సమస్త ప్రాణులకు శుభం కలగడానికి ఇలా చేయాలి. ఆ తర్వాత తడి వస్త్రాలను పిండేసి, పొడి వస్త్రాలను ధరించి ఇంటికి వెళ్లాలి. కార్తీక మాసంలో నదిలో స్నానం చేశాక తడి వస్త్రాలతో ఇంటికి రాకూడదు. అది దోషం. పొడి వస్త్రాలతోనే ఇంటికి రావాలి. కార్తీక మాసంలో తెల్లటి వస్త్రాలు ధరించాలి. సాధ్యమైనంత వరకు ఎరుపు వస్త్రాలు, గంజి పెట్టిన వస్త్రాలు ధరించి కార్తీక మాసంలో పూజలు చేయకూడదు.

ఈ నియమం కూడా తప్పకుండా పాటించాలి. ఈ నియమాలు పాటిస్తూ స్నానం చేయాలి. అలాగే సాయంకాలం సూర్యాస్తమయం అయ్యేలోపు కార్తీక మాసంలో స్నానం చేయాలి. సూర్యాస్తమయం తర్వాత కార్తీక మాసంలో సాయంకాలం పూటి స్నానం చేయకూడదు. ఈ నియమాలతో కార్తీక స్నానాన్ని చేస్తే సమస్త శుభాలు కలుగుతాయి.