Dhanteras 2025
Dhanteras 2025 : హిందూ మతంలో ఏడాది పొడవునా అనేక పండుగలు వస్తుంటాయి. ఈ పండుగల్లో ఒకటైన ధన్ తేరస్ ఐదు రోజుల దీపావళి పండుగ ప్రారంభాన్ని సూచిస్తుంది. దీనిని ధన త్రయోదశి అని కూడా పిలుస్తారు.
హిందూ క్యాలెండర్ ప్రకారం.. ధన్ తేరస్ త్రయోదశి తిథి నాడు జరుపుకుంటారు. ఈ సంవత్సరం త్రయోదశి తిథి అక్టోబరు 18వ తేదీ శనివారం మధ్యాహ్నం 12.18 గంటలకు ప్రారంభమై అక్టోబర్ 19వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 1.51 గంటలకు ముగుస్తుంది. మన ఆచారంలో సూర్యోదయ తేదీ అయిన ఉదయ తిథికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. అందువల్ల ధన్ తేరస్ అక్టోబర్ 18వ తేదీన శనివారం జరుపుకుంటారు.
ఈనెల 18వ తేదీన రాబోయే ధన్ తేరస్ నుంచి నవంబర్ 2వ తేదీ వరకు కొన్ని రాశుల వారికి గ్రహ సంచారం ధన సంపాదనకు బాగా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా మేషం, వృషభం, కర్కాటకం, తుల, వృశ్చికం, ధనస్సు రాశుల వారికి ఆర్థికాభివృద్ధికి ఎటువంటి ప్రయత్నం చేసినా అందులో విజయం సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
గురు, శుక్ర, బుధ, కుజ గ్రహాలు బాగా అనుకూలంగా ఉండటంతో ఆయా రాశుల వారు ఊహించని స్థాయిలో ధన యోగాలను పొందే అవకాశం ఉంది. చంద్రుడు ధన త్రయోదశి రోజున పుబ్బా నక్షత్రంలో సంచారం చేయడం వల్ల మనసులోని కోరికలు చాలా వరకు నెరవేరడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలు, ఆస్తి ఒప్పందాలు ఆయా రాశుల వారికి సానుకూలంగా పూర్తి అవుతాయి.
వృశ్చికం : వృశ్చిక రాశివారికి దశమ స్థానంలో చంద్రుడి ప్రవేశం కారణంగా ఉద్యోగంలో పదోన్నతి, జీతభత్యాలు ఇలా అనేక శుభపరిణామాలు చోటు చేసుకుంటాయి. వృత్తి, వ్యాపారాల్లోనూ డిమాండ్ పెరుగుతుంది. వృత్తి, ఉద్యోగాలరిత్యా విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఆదాయం పెరగడంతోపాటు.. కుటుంబంతో విహార యాత్రలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉంటాయి.
ధనస్సు : ధన త్రయోదశి రోజున ఈ రాశికి భాగ్య స్థానంలో చంద్రుడి సంచారం వల్ల అనేక రకాలుగా మంచి జరుగుతుంది. ఆదాయం పెరుగుతుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి అవకాశాలు మెరుగవుతాయి. తండ్రి జోక్యంతో ఆస్తి వివాదం ఒకటి సానుకూలంగా పరిష్కారమై విలువైన ఆస్తి చేతికి అందుతుంది. ఈ రాశిలోని వారికి రావాల్సిన డబ్బు కొద్ది ప్రయత్నంలో అందుతుంది. మొండి బాకీలుసైతం వసూలు అవుతాయి.
తుల : తుల రాశ్యధిపతి శుక్రుడికి చెందిన పుబ్బా నక్షత్రంలో చంద్రుడి సంచారం వల్ల అనేక మార్గాల్లో ఆదాయం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల పరంగానే కాకుండా ఉద్యోగంలో జీతభత్యాల పరంగా కూడా ఆదాయం బాగా పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతులు లభిస్తాయి. ఏ పనిచేసినా అందులో విజయవంతం అయ్యే చాన్స్ ఎక్కువ. ఆకస్మిక ధన లాభం కూడా కలిగే అవకాశం ఉంది. ఆర్థికంగా బలోపేతం అవుతారు.
కర్కాటక : ధన్ తేరస్ రోజున చంద్రుడు శుక్రుడికి చెందిన పుబ్బా నక్షత్రంలో ప్రవేశించడం వల్ల కర్కాటక రాశివారి పరిస్థితి నక్క తోకను తొక్కి వచ్చినట్టుగా ఉంటుంది. ఎటువంటి ప్రయత్నం తలపెట్టినా అందులో విజయం సాధించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. బంధు, మిత్రుల నుంచి రావాల్సిన డబ్బు రావడంతోపాటు.. మొండి బాకీలుసైతం వసూళ్లవుతాయి. ప్రేమ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. దాంపత్య జీవితం అన్యోన్యంగా సాగుతుంది. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ, వాహన యోగాలకు అవకాశం ఉంది.
వృషభ : ధన తేరస్ నుంచి వృషభ రాశి వారి దశ తిరిగే అవకాశం ఉంది. గృహ, వాహన ప్రయత్నాలకు అనుకూలంగా ఉంది. ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి. ఉద్యోగం, పెళ్లి ప్రయత్నాల్లో శుభవార్తలు వింటారు. వృత్తి, ఉద్యోగం, వ్యాపారాల ద్వారా వచ్చే ఆదాయం అంచనాలకు మించి వృద్ధి చెందుతుంది. ఆశలు వదిలేసుకున్న సొమ్ము కూడా కొద్ది ప్రయత్నంలో మీ చేతికి వస్తుంది.
మేషం : చుతుర్ధాదిపతి అయిన చంద్రుడు పూర్తిగా మేష రాశివారికి అనుకూలంగా మారుతున్నందువల్ల ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి సాధిస్తారు. మనసులోని కోరికలు నెరవేరే అవకాశం ఉంది. అప్రయత్న ధన లాభ సూచనలు కూడా ఉన్నాయి. ఆర్థిక సమస్యలుగానీ, ఒత్తిళ్లు గానీ ఉండకపోవచ్చు. గృహ, వాహన యోగాలకు, స్థలం కొనుగోళ్లకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహించడానికి, విహార యాత్రలు చేయడానికి ప్లాన్ చేసుకునే అవకాశం ఉంది.