Diwali 2025: దీపావళి వేళ లక్ష్మీ పూజకు ముహూర్తం ఎప్పుడు? ఇలా చేస్తే కనకవర్షం..
లక్ష్మీ పూజ చేయడంతో పాటు పితృదేవతలకు దివిటీ చూపించాలి.

Diwali 2025: హిందూ ప్రధాన పండుగల్లో ఒకటైన దీపావళిని దేశమంతటా ప్రజలు ఇవాళ ఆనందంగా, ఘనంగా జరుపుకుంటున్నారు. ఇవాళ సాయంత్రం ఇళ్లను దీపాల అలంకరణతో నింపేస్తారు.
అమావాస్య తిథి నేటి మధ్యాహ్నం 3.42 గంటలకు ప్రారంభమై, రేపు సాయంత్రం 5 గంటలకు ముగుస్తుంది. సూర్యాస్తమయానికి అమావాస్య అక్టోబర్ 20నే ఉంటుంది కాబట్టి దీపావళిని ఇవాళే జరుపుకుంటున్నారు. (Diwali 2025 calendar)
లక్ష్మీ పూజ చేయడంతో పాటు పితృదేవతలకు దివిటీ చూపించాలి. ఈ రోజున దీపదానం చేస్తే మంచిది. దృక్‌సిద్ధాంత గణితం ప్రకారం ప్రదోష కాలానికి సాయంత్రం, రాత్రి సమయాలకు అమావాస్య తిథి ఉంటుందో ఆ రోజే దీపావళి జరుపుకోవాలి.
లక్ష్మీపూజకు ఇవాళ రాత్రి 7 గంటల నుంచి రాత్రి 8.30 గంటల మధ్య కాలం మంచింది. ప్రదోష కాల సమయం సాయంత్రం 5.45- రాత్రి 8.15 గంటల మధ్య ఉంటుంది. ఆ సమయాల్లో పూజలు చేస్తే శుభం కలుగుతుంది.
దీపావళి ఎందుకు జరుపుకుంటారు?
ఈ ప్రశ్నకు సమాధానంగా పలు పురాణ కథలు ఉన్నాయి.
- బలి చక్రవర్తిని వామనావతారంలో విష్ణువు పాతాళ లోకానికి అణగ దొక్కి, సుతల రాజ్యాధిపతిని చేసినందుకు
- రావణుడిని రాముడు సంహరించి సీతను అయోధ్యకు తీసుకొచ్చి, పట్టాభిషిక్తుడైనందుకు
- సత్యభామతో కలిసి శ్రీ కృష్ణుడు నరకాసురుడిని వధించినందుకు