Gajkesari Yoga 2025
Gajkesari Yoga 2025 : ఫిబ్రవరి 28 (శుక్రవారం) అధిపతి శుక్ర గ్రహం. ఈరోజు లక్ష్మీ దేవికి ఇష్టమైన రోజుగా చెబుతారు. శుక్రుడు, బుధుడు సంయోగం కారణంగా లక్ష్మీ నారాయణ యోగం కూడా ఏర్పడుతోంది. దాంతో పాటు, శుక్రుడు తన ఉచ్ఛ రాశిలో ఉండి మాలవ్య రాజ్యయోగాన్ని కూడా ఏర్పరుస్తున్నాడు.
అలాగే, గజకేసరి, సిద్ధ, సాధ్య వంటి అనేక శుభ యోగాలు ఏర్పడుతున్నాయి. కుంభ రాశిలో చంద్రుడు కూడా మిథున, కన్య, తుల, ధనుస్సు, మీన రాశి వారికి అనేక ప్రయోజనాలను కలిగించనున్నాడు. ఈ రాశుల వారు ఏయే విషయాలలో ప్రయోజనం పొందుతారు? ఎలాంటి పరిహారాలు చేస్తే శుభాలు కలుగుతాయి? రేపటి అదృష్ట జాతకాన్ని వివరంగా తెలుసుకుందాం.
Read Also : iPhone 16e Sale : ఈ నెల 28 నుంచే ఆపిల్ ఐఫోన్ 16e సేల్.. ఈ కొత్త ఐఫోన్ కొనాలా? వద్దా..? ఛాయిస్ మీదే..!
మిథున రాశి వారికి ఎలా ఉంటుంది? :
మిథున రాశి వారికి ఉపశమనం, మానసిక ప్రశాంతత కలిగించే రోజుగా చెప్పవచ్చు. చింతలు, సమస్యలు అన్ని పరిష్కారవుతాయి. అన్ని పనులు చక్కపడతాయి. మీ పని సజావుగా సాగుతుంది. వ్యాపార పరంగా కూడా మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది.
ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు. మీ భవిష్యత్తు కోసం డబ్బును కూడా పెట్టుబడి పెట్టవచ్చు. పిల్లల విద్య, వృత్తికి సంబంధించిన విషయాలలో కూడా మీకు అదృష్టం లభిస్తుంది. పెద్దలతో సమన్వయం ద్వారా అనేక ప్రయోజనాలు పొందుతారు. మతపరమైన, సామాజిక పనులలో కూడా పురోగతి ఉంటుంది.
మిథున రాశి వారికి పరిహారాలు : కర్పూరం, నెయ్యి దీపం వెలిగించి, లక్ష్మీ దేవి ముందు శ్రీ సూక్త పారాయణం చేయాలి. మీరు ఏదైనా శుభకార్యం కోసం వెళ్లే ముందు మీ మనసులో మీకు ఇష్టమైన దైవాన్ని ధ్యానించండి.
కన్యా రాశి వారికి ఎలా ఉంటుంది? :
కన్యా రాశి వారికి అంతా విజయమే. మీ లక్ష్యంపై దృష్టి సారిస్తూనే పని చేస్తారు. మీ ప్రయత్నాలు విజయవంతమవుతాయి. ఒక స్నేహితుడు లేదా పరిచయస్తుడి నుంచి కూడా ప్రయోజనం పొందవచ్చు. మీ పని పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొంతమంది శత్రువులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తారు. కానీ, ఏమి చేయలేరు.
మీ వ్యాపారాన్ని విస్తరించడానికి మీకు రుణం అందుతుంది. కోర్టు సంబంధిత పనులు కూడా విజయవంతమవుతాయి. మీరు ఏదైనా పోటీలో ఉంటే తప్పక విజయం సాధించే అవకాశాలు ఉంటాయి. మీరు దూరపు బంధువుల నుంచి సాయం పొందుతారు.
కన్య రాశి వారి పరిహారాలు : లక్ష్మీ దేవికి తేనె కలిపిన తమలపాకును సమర్పించాలి. మీరు ఏదైనా శుభకార్యం కోసం వెళ్ళే ముందు బెల్లం తినండి. అంతా విజయమే కలుగుతుంది.
తులా రాశి వారికి ఎలా ఉంటుంది? :
తుల రాశి వారికి అన్నింటా విజయాలే. మీ ఆఫీసులోని అధికారుల నుంచి ప్రోత్సాహం, మద్దతు లభిస్తుంది. షేర్ మార్కెటింగ్‌లో మరింత బిజీగా ఉంటారు. వారి కృషికి అనుకూలమైన ఫలితాలను వస్తాయి. మీరు డబ్బు ఆదా చేయడంపై దృష్టిపెడతారు. మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఏదైనా సమస్య ఉన్నా విజయం సాధిస్తారు.
మీ వ్యాపారాన్ని కూడా మరింత విస్తరించవచ్చు. మీ కుటుంబ జీవితంలో ప్రేమ, ఆనందం వెల్లువిరుస్తాయి. మతపరమైన కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతారు. మీ పిల్లలకు సంబంధించిన ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కారం అవుతుంది.
తుల రాశి వారి పరిహారాలు : ఈ రోజును శుభప్రదంగా మార్చుకోవాలంటే మీరు ఖీర్ తయారు చేసి లక్ష్మీ దేవికి సమర్పించాలి. ప్రయాణం సమయంలో మీ తల్లి ఆశీర్వాదం తీసుకోండి.
ధనుస్సు రాశి వారికి ఎలా ఉంటుంది? :
ధనుస్సు రాశివారు సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారంలో పెద్ద విజయం సాధిస్తారు. ఆస్తి సంబంధిత రంగాలలో పనిచేసే వారి ఆదాయం పెరుగుతుంది. మీలో దాగి ఉన్న ప్రతిభ నుంచి ప్రయోజనం పొందుతారు. మీ దగ్గరి బంధువుల మద్దతు పెరుగుతుంది. కుటుంబ సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఎక్కడి నుండైనా మీకు ఆర్థిక లాభం కలిగే అవకాశం ఉంది. మీరు వెళ్లే పనిలో విజయం వరిస్తుంది.
ధనుస్సు రాశివారికి పరిహారాలు : మీ జీవిత భాగస్వామితో ప్రేమతో ఉండండి. లక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి. మీరు ఏదైనా శుభకార్యం కోసం వెళ్తుంటే మీ జేబులో వెండి నాణెం ఉంచుకోండి.
మీన రాశి వారికి ఎలా ఉంటుంది? :
మీన రాశి వారికి అద్భుతమైన రోజు. అంతా అదృష్టం కలుగుతుంది. ఆర్థిక సమస్యలు దరిచేరవు. వ్యాపారంలో సంపాదన పెరుగుతుంది. చాలా కాలంగా నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందవచ్చు. చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది.
ఆర్థిక విషయాలలో అకస్మాత్తుగా ప్రయోజనాలను పొందవచ్చు. రాజకీయ పరిచయాల నుంచి కూడా ప్రయోజనం పొందుతారు. ప్రభుత్వ రంగ పనిలో విజయం సాధిస్తారు. మీ మాట, ప్రవర్తన, వ్యాపారంలో అన్నింటా కలిసివస్తుంది. మీ వైవాహిక జీవితం కూడా చాలా సంతోషంగా ఉంటుంది.
మీన రాశి వారికి పరిహారాలు : చిన్న పిల్లలకు పండ్లు, స్వీట్లు దానం చేయాలి. ఏదైనా శుభకార్యం నిమిత్తం వెళ్ళే ముందు దుర్గాదేవి 32 నామ స్తోత్రాన్ని పఠించండి.