Horoscope Today: ఈ రాశుల వారు జాగ్రత్త..! వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు, వృత్తిపరంగా చికాకులు..!

రుణదాతల నుంచి ఒత్తిళ్లు తప్పవు. అన్నదమ్ములతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అనవసరమైన చర్చల్లో తలదూర్చకండి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి.

Horoscope Today: ఈ రాశుల వారు జాగ్రత్త..! వ్యాపార లావాదేవీల్లో ఇబ్బందులు, వృత్తిపరంగా చికాకులు..!

Horoscope Today

Updated On : April 16, 2025 / 12:53 AM IST

Horoscope Today: వృశ్చికంలోకి ప్రవేశించిన చంద్రుడు రెండు రోజులపాటు మిగతా గ్రహాల ఫలితాలనూ ప్రభావితం చేస్తున్నాడు. దేవుడు వరమిచ్చినా.. పూజారి కనికరించనట్టు… గ్రహాలు అనుగ్రహించినా… చంద్రుడు అడ్డుపడతాడు. ఫలితంగా వృషభం, కర్కాటకం, మకర రాశుల వారికి చికాకులు ఏర్పడతాయి. ధనుస్సు రాశివారికి ఊరట లభిస్తుంది.

Aries

Aries

మేషం: ఇంట్లో అనుకూల వాతావరణం ఉంటుంది. ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం కలిసి వస్తుంది. సుబ్రహ్మణ్యస్వామి స్తోత్రాలు పఠించండి.

Taurus

Taurus

వృషభం: వ్యాపారులకు అదృష్టం ఊరిస్తుంది. ఉద్యోగులకు ఒత్తిళ్లు ఎదురవుతాయి. బంధుమిత్రులతో విభేదాలు రావొచ్చు. కొత్త నిర్ణయాలు తీసుకోకపోవడం ఉత్తమం. సాయంత్రానికి పరిస్థితి పూర్తిగా అనుకూలంగా మారిపోతుంది. శివాలయాన్ని సందర్శించండి.

Gemini

Gemini

మిథునం: ఆత్మీయుల సహకారం లభిస్తుంది. శుభకార్యాలకు హాజరవుతారు. వాహనం, భూమి కొనుగోలు చేస్తారు. ఆత్మవిశ్వాసంతో పనులు చేస్తారు. కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది. నలుగురిలో గుర్తింపు పొందుతారు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.

Cancer

Cancer

కర్కాటకం: రుణదాతల నుంచి ఒత్తిళ్లు తప్పవు. వృత్తిపరంగా చికాకులు ఉంటాయి. అన్నదమ్ములతో అభిప్రాయ భేదాలు రావచ్చు. అనవసరమైన చర్చల్లో తలదూర్చకండి. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలి. శివారాధన మేలు చేస్తుంది.

Leo

Leo

సింహం: భూ వ్యవహారంలో లాభం పొందుతారు. ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వ్యాపార భాగస్వాములతో సయోధ్య కుదురుతుంది. సమయపాలన అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Virgo

Virgo

కన్య: తలపెట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. మానసికంగా సంఘర్షణకు గురవుతారు. స్టాక్‌మార్కెట్‌ విషయంలో అత్యుత్సాహం తగదు. ఆస్తి తగాదాలు తలెత్తుతాయి. రోజు చివరిలో ఊరట పొందుతారు. లక్ష్మీదేవి ఆరాధన శుభప్రదం.

Libra

Libra

తుల: ఆర్థికంగా లబ్ధి పొందుతారు. కొత్త పనులు ప్రారంభిస్తారు. బంధువర్గంతో కార్యసాఫల్యం ఉంది. విద్యార్థులకు అనుకూలం. మంచి సంస్థలలో చేరే అవకాశం ఉంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. ఉద్యోగులు అధికారుల ప్రశంసలు అందుకుంటారు. శివాలయాన్ని సందర్శించండి.

Scorpio

Scorpio

వృశ్చికం: ప్రారంభించిన పనులు అనుకున్న సమయంలో పూర్తవుతాయి. భూ వ్యవహారం లాభిస్తుంది. ప్రయాణాల వల్ల పనులు నెరవేరుతాయి. ఆత్మీయుల సహకారాన్ని పొందుతారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. నరసింహస్వామి ఆలయాన్ని దర్శించండి.

Sagittarius

Sagittarius

ధనుస్సు: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. సంయమనంతో పనులు చేయడం అవసరం. ఉద్యోగులకు అనుకూల వాతావరణం. సవాళ్లను ధైర్యంగా స్వీకరిస్తారు. ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. కోర్టు పనుల్లో విజయం సాధిస్తారు. శివారాధన శుభప్రదం.

Capricorn

Capricorn

మకరం: రాజకీయంగా ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపార లావాదేవీల్లో చికాకులు తలెత్తుతాయి. మంచికి పోతే చెడు ఎదురవుతుంది. నిందలు పడాల్సి వస్తుంది. విలువైన వస్తువుల విషయంలో ఏమరుపాటు తగదు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Aquarius

Aquarius

కుంభం: విద్యార్థులకు అనుకూలం. ఉద్యోగులకు మంచి సమయం. అన్నదమ్ములు, బంధువులతో కార్యసాఫల్యం ఉంటుంది. ఆత్మీయుల తోడ్పాటు లభిస్తుంది. భూతగాదాలు పరిష్కారం అవుతాయి. కుటుంబ పెద్ద ఆరోగ్యం కలవరపెడుతుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.

Pisces

Pisces

మీనం: వాహనం కొనుగోలు చేస్తారు. నలుగురికి సాయపడతారు. సేవాభావంతో ఉంటారు. ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. వ్యాపారం సంతృప్తికరంగా కొనసాగుతుంది. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఆరోగ్యంగా ఉంటారు. గణపతి గుడిని సందర్శించండి.

(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008

Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్‌ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.