Zodiac Signs Representative Image (Image Credit To Original Source)
Evil Eye: 2026 నూతన సంవత్సరంలో ఏయే రాశుల వారికి నరదిష్టి ఎక్కువగా తగులుతుందో, దాన్ని నుంచి బయటపడేందుకు ఎలాంటి విధివిధానాలు పాటించాలో తెలుసుకుందాం. సంఖ్యా శాస్త్రం పరంగా, జ్యోతిష్య శాస్త్రం పరంగా కొన్ని ప్రత్యేకమైన రాశులకు నరదిష్టి ఎక్కువగా తగులుతుందని పండితులు చెబుతున్నారు. ఆయా రాశుల వారు నరదిష్టి నివారణకు ప్రత్యేకమైన విధి విధానాలు పాటించాలని సూచిస్తున్నారు.
ఈ ఏడాదిలో నరదిష్టి ఎక్కువగా తగిలే రాశుల్లో మొట్టమొదటి మిధున రాశి. ఈ రాశి వారు ఎప్పుడూ చురుకుగా ఉంటారు. ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. మిధున రాశిని ద్విస్వభావ రాశి అనే పేరుతో పిలుస్తారు. మల్టిపుల్ టాస్కింగ్ ఎబిలిటీ ఈ రాశి వారికి చాలా ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల చురుగ్గా ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
ఈ కారణంగా మిధున రాశి వారు అద్భుత విజయాలను అందుకుంటారు. దాని వల్ల ఇతరులు ఎక్కువగా అసూయ పడుతుంటారు. కాబట్టి మిధున రాశి వారికి నరదిష్టి ఎక్కువగా తగులుతుందని పండితులు చెబుతున్నారు. నరదిష్టి నుంచి బయట పడాలంటే పసుపు రంగు బ్యాండ్ ని నిత్యం చేతికి ధరించాలని సూచించారు. ఇలా చేస్తే నరదిష్టి నుంచి సులభంగా బయటపడతారని చెబుతున్నారు. లేదా ఎల్లో కలర్ గొలుసు ఎప్పుడూ మెడలో వేసుకున్నా నరదిష్టి సమస్య నుంచి బయటపడతారని తెలిపారు.
నరదిష్టి ప్రభావం ఎక్కువగా ఉన్న రాశి కర్నాటక రాశి. ఈ రాశి వారు సహజ సిద్ధంగా సున్నితమైన స్వభావాన్ని కలిగుంటారు. ఈ స్వభావం వల్ల ప్రతీది శ్రద్ధగా గమనిస్తారు. ప్రతి విషయాన్ని ఒకటికి పదిసార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుని ప్రతి పనిని క్రమశిక్షణతో ఆచరిస్తారు. ఎటువంటి తప్పు లేకుండా బాగా గమనించి ప్రతి పనిని చేయటం వల్ల మిగిలిన వారికి ఈ రాశి వారిపై అసూయ పెరుగుతూ ఉంటుంది. కర్కాటక రాశి వారు నరదిష్టి నుంచి బయటపడాలంటే నీలం రంగు వస్తువులను దగ్గర ఉంచుకోవాలి. బ్లూ కలర్ బ్యాండ్ ఎప్పుడూ ధరించాలి. నీలం రంగుకి సంబంధించిన వస్త్రాలు ధరించాలి. వీటి వల్ల దృష్టి దోషం నుంచి కర్కాటక రాశి వాళ్లు సులభంగా బయటపడొచ్చు.
నరదిష్టి ప్రభావం ఎక్కువగా సోకే మూడో రాశి సింహ రాశి వాళ్లు. ఈ రాశి వాళ్లు సాహస వంతులు, ధైర్యవంతులు. ఆత్మ విశ్వాసంతో అకాశాన్ని అధిరోహించగల సత్తా ఉన్న వాళ్లు. అంతటి ధైర్యం, ఆత్మవిశ్వాసం వీరిలో ఉండటం వల్ల సహజంగానే ఈ లక్షణాలు ఎదుటి వారికి అసూయను కలిగింపజేస్తాయి. 2026లో ఈ లక్షణాలు పెరుగుతాయి. అందువల్ల ఈ రాశి వారికి దృష్టి దోషం ఎక్కువగా ఉంటుంది. దీని నుంచి బయటపడాలంటే సింహ రాశి వాళ్లు ఆరెంజ్(నారింజ) కలర్ బ్యాండ్ కుడి చేతికి నిత్యం ధరించాలి. ఇలా చేయడం వల్ల దృష్టి దోషం వల్ల ఏర్పడే సమస్యల నుంచి బయటపడొచ్చు. నారింజ రంగు చెడు దృష్టి నుంచి మిమ్మల్ని బయటపడేస్తుంది. అలాగే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలను కలిగిస్తుంది. చెడు దృష్టి సోకకుండా ఉండేందుకు, దృష్టి దోషాలు తొలగించుకోవడానికి ఆరెంజ్ బ్యాండ్ బాగా సహకరిస్తుంది.
2026లో దృష్టి దోషం వల్ల ఇబ్బంది పడబోతున్న నాలుగో రాశి తుల రాశి. వీరికి దృష్టి దోషం ఎందుకు తగులుతుందంటే.. తుల రాశి వాళ్లు ఎంతో ప్రశాంతంగా ఉంటారు. మిన్ను విరిగి మీద పడ్డా చెలించని మనస్తత్వం వీరిది. చాలా బ్యాలెన్స్ డ్ గా ఉంటారు. ఆకర్షణీయమైనటువంటి స్వభావం కలిగుంటారు. దీని వల్ల ఈ రాశి వారికి నరదృష్టి ఎక్కువగా సోకే అవకాశాలు ఉన్నాయి. దీనికి రెమెడీ ఏంటంటే.. తుల రాశి వారు నిత్యం పింక్ (గులాబీ) కలర్ బ్యాండ్ ని ధరించాలి. పింక్ కలర్ బ్యాండ్ కుడి చేతికి ధరించినట్లైతే సానుకూల ఫలితాలను ఇస్తుంది. ఎదుటి వాళ్ల నరదృష్టి ప్రభావం నుంచి మిమ్మల్ని బయటకు తెస్తుంది.
2026లో దృష్టి దోషం ఎక్కువగా తగలబోయే 5వ రాశి మీన రాశి. ఈ రాశి వాళ్లు 2026లో జాగ్రత్తగా ఉండాలి. ఈ రాశి వారికి ఆధ్యాత్మిక దృష్టి చాలా ఎక్కువగా ఉంటుంది. వీళ్లకి శాశ్వత శత్రువుల ఉండరు. శత్రువులు ఉన్నా మిత్రులుగా మార్చుకుంటారు. కష్టాల్లో ఉన్న వారికి మీన రాశి వారు సాయం చేస్తారు. ఎప్పుడూ అవిశ్రాంతంగా అందరి కోసం పాటు పడే లక్షణం ఉంటుంది. ఈ ప్రత్యేక లక్షణాలు ఇతరులు వీరిని చూసే అసూయపడేలా కలిగింపజేస్తాయి. ఎదుటి వారికి ఎక్కువగా సాయం చేయట, ఎక్కువ మంచి తనాన్ని ప్రదర్శించటం, అందరి కష్టాల్లో వాళ్లు తోడుగా ఉండటం.. ఇలాంటివి ఎక్కువగా చేయడం వల్ల వీళ్లికి అందరిలో మంచి పేరు ప్రతిష్టలు వస్తాయి. దాని వల్ల దృష్టి ఎక్కవగా తగులుతుంది. ఈ దోషం నుంచి బయటపడాలంటే మీన రాశి వాళ్లు గ్రీన్ కలర్ బ్యాండ్ ను నిత్యం కుడి చేతికి ధరించాలని పండితులు సూచించారు. ఆకు పచ్చ రంగు ఈ రాశి వాళ్లను సులభంగా బయటకు తెస్తుందన్నారు.
Also Read: అర్జంటుగా డబ్బు కావాలా? కొబ్బరికాయతో ఇలా చేసి చూడండి..!
NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.