Coconut Remedy: అర్జంటుగా డబ్బు కావాలా? కొబ్బరికాయతో ఇలా చేసి చూడండి..!
కొబ్బరికాయ, కుంకుమ, ఆవు నెయ్యి తీసుకోవాలి. ఆవు నెయ్యిని కుంకుమలో కలపాలి. ఆ కుంకుమ తీసుకుని కొబ్బరికాయపై..
Money Remedy Representative Image (Image Credit To Original Source)
- కొబ్బరికాయ పరమేశ్వరుడి తలకు సంకేతం
- అర్జంట్ గా డబ్బు అందాలంటే కొబ్బరికాయకి సంబంధించిన చిట్కా పాటించాలి
- ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో కొబ్బరికాయను వేయాలి
Coconut Remedy: ఈరోజుల్లో ప్రతీ పనికి డబ్బు అవసరమే. డబ్బు లేనిదే ఒక్క పనీ జరగదు. మనీ చుట్టూనే ఈ లోకం తిరుగుతోంది. అందుకే, డబ్బు అవసరం అందరికీ ఉంటుంది.
అవసరానికి చేతిలో డబ్బు లేకపోతే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మరి అవసరానికి చేతికి డబ్బు అందాలంటే ఏం చేయాలి? అర్జంట్ గా మనీ కావాలంటే ఏం చేయాలి? కొబ్బరికాయకు సంబంధించిన ఒక చిన్న చిట్కా పాటించాలని పండితులు చెబుతున్నారు.
కొబ్బరికాయ పరమేశ్వరుడి తలకు సంకేతం అని పురాణాల్లో చెప్పారని పండితులు తెలిపారు. ఒక సమయంలో వినాయకుడి కోపానికి శివుడు గురవగా, ఆయన కోపాన్ని తగ్గించేందుకు ఏం చేయాలో చెప్పాలని శివుడు అడుగుతాడు. మీకు ఏం నైవేద్యం సమర్పించాలి అని అడిగితే.. మీ శిరస్సునే నాకు నైవేద్యంగా సమర్పించాలని శివుడిని వినాయకుడు అడుగుతాడు. అప్పుడు శివుడు బాగా ఆలోచించి తన శిరస్సుతో సమానమైన కొబ్బరికాయను సృష్టిస్తాడు.
శివుడి శిరస్సు నుంచి బయటపడిన ఒక తేజస్సు..
అంటే పరమేశ్వరుడి శిరస్సు నుంచి ఒక తేజస్సు బయటకు వచ్చి కొబ్బరికాయ అవతరించిందని పురాణాల్లో చెప్పారు. కాబట్టి కొబ్బరి కాయ అంటే అది సాక్ష్యాత్తు పరమేశ్వరుడి తలకు సంకేతం. మీకు అర్జంట్ గా డబ్బులు కావాలన్నా, చేతిలో డబ్బులు లేకపోయినా, ఏదో ఒక విధంగా మీ చేతికి డబ్బులు అందాలంటే కొబ్బరికాయకి సంబంధించిన చిట్కా పాటించాలని పండితులు చెబుతున్నారు.
కొబ్బరికాయను తీసుకెళ్లి ప్రవహిస్తున్న నీళ్లలో వదలాలి…
కొబ్బరికాయ, కుంకుమ, ఆవు నెయ్యి తీసుకోవాలి. ఆవు నెయ్యిని కుంకుమలో కలపాలి. ఆ కుంకుమ తీసుకుని కొబ్బరికాయపై స్వస్తిక్ గుర్తు వేయాలి. తర్వాత ఎరుపు రంగు దారం లేదా ఎర్రటి వస్త్రం తీసుకుని ఆ కొబ్బరికాయకు చుట్టి పూజా మందిరంలో పెట్టాలి. ఆ కొబ్బరికాయకు హారతి ఇచ్చి నాకు అర్జంట్ గా డబ్బు కావాలి, ఏదో ఒక విధంగా డబ్బు చేతికి వచ్చేలా చూడాలని పరమేశ్వరుడిని ప్రార్థించాలి. సాయంత్రం ఆ కొబ్బరికాయను తీసుకెళ్లి ప్రవహిస్తున్న నీళ్లలో వదలాలి.
మాకు దగ్గరలో ప్రవాహం లేదని చెప్పే వాళ్లు.. ఎవరూ తొక్కని చోట చెట్టు మొదట్లో కొబ్బరికాయను వేయాలి. అలా చేసి ఇంటికి వచ్చాక గుప్పుడె ఆవాలు తీసుకుని, ఆ ఆవాలను ఇంటి చుట్టు చల్లాలి. ఇలా చేస్తే చాలా తొందరగా మీ చేతికి డబ్బు అందుతుందని పండితులు చెబుతున్నారు. అర్జంట్ గా డబ్బులు కావాల్సి వచ్చినప్పుడు, ఏదో ఒక విధంగా చేతికి ధనం అందాలంటే.. ఈ కొబ్బరికాయ పరిహారం చేసి చూడాలని, త్వరలోనే డబ్బు చేతికి అంది తీరుతుందని పండితులు విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: సంక్రాంతి ఎప్పుడు? తేదీ, పూజా ముహూర్తం, పూజా విధానం తెలుసుకోండి..
NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్య్రం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.
