Amavasya 2025: డిసెంబర్ 19.. శుక్రవారం.. అమావాస్య.. ఇలా చేస్తే సమస్యలన్నీ దూరం..!
ఇలవేల్పునకు ఎప్పుడైనా పూజలు చేయకపోయినా, లేదా వంశంలో ఏవైనా దోషాలు చేసినా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి.
Amavasya 2025: డిసెంబర్ 19.. శుక్రవారం.. అమావాస్య.. బహుళ అమావాస్య.. ఈ సందర్భంగా ఎటువంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు కలుగుతాయో తెలుసుకుందాం. మార్గశిర మాసంలో బహుళ పక్షంలో వచ్చే అమావాస్య తిథిని బహుళ అమావాస్య అంటారు. డిసెంబర్ 19 శుక్రవారం బహుళ అమావాస్య వచ్చింది. దీనికున్న ప్రత్యేకత ఏంటంటే.. ప్రతీ ఒక్కరు తమ ఇంటి దైవానికి నైవేద్యం పెట్టడం ద్వారా ఇంటి దైవం సంపూర్ణమైన అనుగ్రహం పొందే అమావాస్య.. బహుళ అమావాస్య.
ఇలవేల్పునకు ఎప్పుడైనా పూజలు చేయకపోయినా, లేదా వంశంలో ఏవైనా దోషాలు చేసినా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి. అవన్నీ పోగొట్టుకునేటువంటి శక్తిమంతమైన అమావాస్య.. బహుళ అమావాస్య. కాబట్టి డిసెంబర్ 19 శుక్రవారం అందరూ కూడా ఇంటి దైవానికి పాలతో చేసినటువంటి పాయసం నైవేద్యంగా సమర్పించాలి. ఆ తర్వాత ఆ నైవేద్యాన్ని కుటుంబసభ్యులంతా ప్రసాదంగా తీసుకోవాలి. దీని వల్ల ఇంటి దైవం సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది.
