Vasanta Navaratrulu : చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) నుంచి తెలుగు వారికి నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. అలాగే రుతువులలో తొలి రుతువైన వసంతరుతువు మొదలవుతుంది. ఈ వసంతఋతువుకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ వసంత రుతువులోనే శ్రీమహావిష్ణువు పరిపూర్ణ మానవునిగా అవనిపై అవతరించాడని పురాణాలు చెబుతున్నాయి. అదే శ్రీరామావతారం. సంవత్సరంలో తొలి పండగ అయిన ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు ‘వసంత నవరాత్రులు’ సంబరంగా జరుపుకోవడం ఆచారమైంది. వసంత నవరాత్రులు జరుపుకోవడానికి భక్తులు సిద్ధమయ్యారు.
మరి ఏదైనా కారణాల వల్ల వసంత నవరాత్రులు చేయలేని వారు ఏం చేయాలి? దైవాన్ని ఎలా ప్రార్థించాలి? ఎలాంటి నామస్మరణ చేయాలి? ఏ నామాలు పఠిస్తే పుణ్యం వస్తుంది? ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దివ్యశ్రీ రమణ చక్రవర్తుల మాటల్లో తెలుసుకుందాం..
Also Read : ఈ ఏడాది ఏ రాశి వారి అదృష్ట సంఖ్య ఏది? కలిసొచ్చే వారం.. కలిసొచ్చే రంగులు.. అదృష్ట దైవం.. పూర్తి వివరాలు..
”వసంత నవరాత్రులు చేయలేని వారు చక్కగా దైవ నామస్మరణ చేసుకుంటే చాలు. ఈ కలియుగంలో నామస్మరణ విశేషమైనది. బయట ఎక్కడైనా ప్రయాణం చేస్తూ ఉండొచ్చు, లేక ఎవరైనా ఆసుపత్రి పాలై ఉండొచ్చు, ఎవరైనా చనిపోయే స్థితిలో ఉండి కూడా చేయకపోవచ్చు. అలాంటి సమయంలోనూ వారందరికీ మంచి జరగాలని ఆరోగ్య లక్ష్మిని ఆరాధన చేయాలి. లక్ష్మీ నారాయణులను తలుచుకోవాలి.
లక్ష్మీ నారాయణులు అని ఎందుకు అంటున్నాను అంటే.. శ్రీరామ చంద్రుడు పరిపూర్ణ మానవ అవతారం ఎత్తిన వసంత నవరాత్రులు ఇవి. అందుకని ఆయనను స్మరణ చేసుకుంటే చాలు. ఆయనను చూస్తే చాలు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. అందుకనే ఆయనను చంద్రుడితో పోలుస్తారు. చంద్రుడిని చూస్తే మనకు ఎంత సౌమ్యంగా, ఆనందంగా కనిపిస్తుందో అలానే ఆయనను చూస్తే ఆనందంగా ఉంటుంది. అందుకే ఆయన స్మరణ చేసుకుని, వీలైతే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాణనే అని ఆ రామచంద్రుడిని సహస్ర నామాలతో తలుచుకుంటే చాలు.
ఇది పఠిస్తే చాలు సహస్ర నామ పఠనం చేసిన ఫలితం వస్తుంది. ఇది నా వల్ల కాదు నాకు గుర్తు లేదు అనుకునే వారు హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే యుగ పురుషుడైన కృష్ణ పరమాత్ముడిని అలాగే పరమాత్ముడైన రామచంద్రుడిని ఇద్దరినీ కనుక తలుచుకున్నా వీరికి కష్టాలు దరిచేరవు. వారికున్న సమస్యలన్నీ పోతాయి. ఆఖరికి మరణశయ్యపై ఉన్న వారికి ముక్తి కలుగుతుంది. అందుకని ఇది పఠనం చేసి వారి అనారోగ్యం నుంచి కూడా వారిని బయటకు తీసుకురావొచ్చు. ఇది ఉత్తమమైన మార్గం.
Also Read : ఉగాది నుంచే వసంత నవరాత్రులు.. కలశ స్థాపన అందరూ చేయొచ్చా.. ఏ రోజు ఏ అమ్మవారిని పూజించాలి?
లేదు ఇది కూడా మేము చేయలేము అంటే.. ఇది కూడా మాకు పెద్దదే.. అని అనుకునే వారు.. అచ్యుత అనంత గోవింద .. ఈ మూడే నామాలు అనుకుంటే చాలు. అచ్యుత అనంత గోవింద అంటే దీర్ఘకాలిక రోగాలన్న వాడు, నిత్యం కంటిన్యూగా ఇదే చదివినా కూడా వారి రోగాలన్నీ పటాపంచలైపోతాయి. అలా ఉగాది నాడు మనం ఒక సంకల్పం చేసుకున్నా.. అనారోగ్యంతో ఉన్నా, ఈతి బాధలతో ఉన్న వారికి కూడా ఇది మంచి జీవితాన్ని ప్రసాదిస్తుంది” అని ఆధ్యాత్మికవేత్త దివ్యశ్రీ రమణ చక్రవర్తుల తెలిపారు.