Today Horoscope: నేటి రాశి ఫలాలు… ఈ రాశుల వారు శుభవార్తలు వింటారు..!

ఈ రోజు (సోమవారం , అక్టోబర్ 21, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాల వివరాలు...

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..

శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస బహుళ పంచమి: రాతె 2:29, రోహిణి ఉ 6:56 వరకు తరువాత మృగశిర రాతె 5:51 సోమవారం ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు. 

మేష రాశి: వృధా ప్రయాణములు, వృధా సమస్యలు, ఆవేశం, వ్యాపారంలో లాభములు, ఆకస్మిక ప్రయాణములు, నూతన వస్త్రములు, విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం, పనులలో ఆలస్యము: ఇష్ట దైవ ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితములు కలుగుతాయి.

వృషభ రాశి: ఆకస్మిక ధనలాభము, నూతన ఆలోచనలు, నూతన వ్యాపారాలు, తీర్థయాత్రలు, శుభకార్య నిర్వహణ, ప్రతి దానిలో విజయం, కోర్టులో విజయం, అధికారుల ఒత్తిడి, అనారోగ్యము, విధ్యార్ధులకు అనుకూలము – దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయటం వల్ల శుభం కలుగుతుంది.

మిథున రాశి: కుటుంబములోని వారు ఆరోగ్యంగా ఉంటారు. ధనధాన్య సంపదలు, స్త్రీలతో ప్రియ సంభాషణలు చేయడం, ధార్మిక పద్దతులతో నడుచుకొంటారు, దైవ పుణ్యకార్యములలో చురుకుగా పాల్గోంటారు, పై అధికారులు ఆదరాభిమానములు పొందుతారు: శ్రీ విష్ణు సహస్ర నామస్తోత్ర పారాయణం చేసినచో శుభం ఫలితములు పొందుతారు.

కర్కాటక రాశి: మనో వేదన వలన నిర్ణయానికి రాలేరు, సంతానం ద్వారా శుభవార్తలు, మనః శాంతి లోపించడం, ఉద్యోగ లాభం, విదేశాలకు వెళ్లడం, దూర ప్రయాణములు, అన్నింటా విజయం, నూతన వ్యాపారములు ప్రారంభించవచ్చు, విధ్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహిస్తారు: దక్షిణామూర్తి స్తోత్రపారాయణం చేసిన మేలు కలుగును.

సింహ రాశి: స్వస్దానములో మేలు జరుగును, ధనధాన్య లాభములు, కీర్తి ప్రతిష్టలు పెరుగును, సంఘంలో గౌరవము, అన్యస్త్రీ పరిచయ భాగ్యములు, ప్రతి పనిని సమర్ధవంతముగా నిర్వహిస్తారు. ప్రయాణముల వలన లాభములు కలుగుతాయి: శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన వల్ల మేలు కలగను.

కన్యా రాశి: మంచి విషయాలు తెలుసుకోవడం, క్రీడల యందు ఆసక్తి, ఋణములు లభించడం, మానసిక వేదన, మంచి శుభవార్తలు, శరీరంలో రుగ్మతలు, వస్త్రములు కొనుగోలు, సందిగ్ధ స్థితులు, ప్రత్యేక విషయముల మీద దృష్టి పెట్టాలి: కార్తికేయ స్తోత్ర పారాయణం చేయవలెను.

తులా రాశి: ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి, కుటుంబంలో వివాదం రాకుండా చూసుకోవాలి, పొదుపు పాటించాలి, కసిగా ఉండాలి, నిర్ణయములలో జాగ్రత్త, మోసములకు గురికాకుండా ఉండాలి, వస్తువులు కొనుగోలు, మానసిక భాదలు వెంటాడుతూ ఉంటాయి, స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి: సుందర కాండ పారాయణము చేయడం వల్ల ఉత్తమ ఫలితములు కలుగుతాయి. 

వృశ్చిక రాశి: వృత్తి ఉద్యోగములలో అనుకూలము, ధన లాభం, నూతన వ్యాపారాలు, ఆరోగ్యం కుదుట పడుతుంది, మంచి ఆలోచనలు, శుభవార్తల వినడం, విద్యార్థులకు అనుకూలం: గణపతి పంచరత్న స్తోత్ర పారాయణం చేసినచో శుభం జరుగుతుంది!

ధనస్సు రాశి: ఆకస్మిక ప్రయాణములు వలన లాభములు, విలువైన ఆభరణాలు కొనుగోలు చేయడం, జాయింటుదారులతో అనుకూలత, ధనప్రాప్తి, వస్త్ర లాభము, ఆరోగ్యము, జయము, ఎంతటి పనినైనను ధైర్యసాహసములతో చేసి విజయమును పొందుతారు, అన్నదమ్ములతో వైరము పెరుగును, దూర ప్రాంతపు ప్రయాణములు అనుకూలించును: శ్రీ రామనామ జపం చేయండి శుభ ఫలితములు కలుగుతాయి.

మకర రాశి: కోర్టు వ్యవహారములు వాయిదా పడటం, దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చును, శుభకార్యక్రమములకు ఆటంకములు, విద్యుత్తు పరికరములు, మిషనరీలు వాహన మలు కొనుగోలు, రావలసిన బాకీలు వసూలు చేయుట, నూతన వస్త్రములు, ఆభరణములు కొనుగోలు చేయడం: దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం వల్ల సమస్యలు తొలగుతాయి.

కుంభ రాశి: కుటుంబములోని వారికి ఆరోగ్యం తగ్గుతుంది, చేయు పనులయందు కష్టనష్టాలు ఎదురవుతాయి, పనిలేని ప్రయాణములు, పై అధికారుల ఒత్తిడి పెరుగుతుంది, ఉద్యోగ వ్యాపారముల యందు దిగువ వారి సహయములు ఉండవు: శ్రీ కృష్ణ మంత్ర జపం చేయవలెను మంచి ఫలితములు కలుగుతాయి.

మీనా రాశి: ధననష్టం, ధనం పొదుపు పాటించాలి, మనస్పర్ధలు, స్త్రీలకు గర్భ సంబంధ అనారోగ్యం, నిద్రలేమి, అకారణ వైరము, సంఘంలో గౌరవ మర్యాదలు, ఉష్ణ సంబంద వ్యాధులు, మానసిక ఆందోళనలు: చంద్ర గ్రహ ఆరాధన వలన శుభ ఫలితములు కలుగుతాయి.

— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ  

Contact: 9849280956, 9515900956