ఆది శంకరాచార్యులు దర్శించుకుని, అర్చించిన సరస్వతీదేవి పీఠం.. మీరు దర్శించుకున్నారా? 

సతీదేవి కుడి చేయి పడిన ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో అమ్మవారు సరస్వతీదేవిగా వెలిశారు.

Saraswati Devi Temple

Saraswati Devi Temple: దక్షుడి కుమార్తెగా జన్మించిన ఆదిపరాశక్తి (సతీదేవి) పరమేశ్వరుడిని వరిస్తుంది. దక్షుడు చేస్తున్న యాగానికి తమకు ఆహ్వానం లేకున్నా వెళ్లడంతో పరమేశ్వరుడిని దక్షుడు నిందించాడు. ఆదిపరాశక్తి తట్టుకోలేక అగ్నిప్రవేశం చేయడంతో కాలుతున్న ఆమె శరీరాన్ని పరమేశ్వరుడు భుజాన వేసుకుని ఉగ్రతాండవం చేయడంతో అన్ని లోకాలు వణికిపోయాయి.

లోకాలను కాపాడేందుకు విష్ణువు సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ఛేదించంతో 18 ఖండాలై 18 ప్రదేశాల్లో పడింది. ఆయా ప్రాంతాల్లో అష్టాదశ శక్తి పీఠాలుగా వెలిశాయి.

Also Read: అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి విశాలాక్షి ఆలయం.. అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చింది? 

ఇలా, సతీదేవి కుడి చేయి పడిన ప్రాంతం జమ్మూకశ్మీర్‌లో అమ్మవారు సరస్వతీదేవిగా వెలిశారు. ఆది శంకరాచార్యులు సరస్వతీదేవిని దర్శించుకుని, అర్చించినట్లు శంకర విజయ కావ్యం ద్వారా తెలుస్తోంది.

జ్ఞానం, విద్య, వాక్పటిమలకు ఆరాధ్యమైన ఈ సరస్వతీ దేవి ఆలయాన్ని పండితులు జ్ఞానపీఠంగా వర్ణిస్తారు. దేవి ఇక్కడ వేదాలు, శాస్త్రాల రూపమైన శక్తిగా అమ్మవారిని పూజిస్తారు. ఆలయం చుట్టూ మంచు కొండల వాతావరణం ఉంటుంది. జమ్మూకశ్మీర్ యాత్రలో భక్తులు ఈ ఆలయాన్ని తప్పనిసరిగా దర్శిస్తారు.

నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. జ్ఞానం, మేధస్సు పెరగాలనే ఆకాంక్షతో భక్తులు ఇక్కడికి వస్తారు. జమ్మూకశ్మీర్‌లోని ఈ ఆలయం కాశ్మీరీ హిందువుల ఆధ్యాత్మిక కేంద్రంగా ఉంది.