అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి విశాలాక్షి ఆలయం.. అమ్మవారికి ఆ పేరు ఎలా వచ్చింది?
ఈ ఆలయం కాశీ విశ్వనాథ ఆలయానికి అతి సమీపంలో ఉండటం వల్ల భక్తులు రెండు దర్శనాలు చేసుకున్న భాగ్యం కలుగుతుంది.

Vishalakshi Devi Temple
Vishalakshi Devi Temple: దక్షయజ్ఞం తర్వాత సతీదేవి చెవి కమ్మ పడిన ప్రాంతం కాశీలో అమ్మవారు విశాలాక్షిగా వెలిసింది. ఆ సమయంలో శివుడిని ఆశ్చర్యంతో కళ్లు పెద్దవిగా చేసి చూడడంతో విశాలాక్షి అనే పేరు వచ్చిందని అంటారు. “విశాలాక్షి” అంటే విశాలమైన నేత్రాలు కలిగిన తల్లి అని అర్థం.
అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటైన ఈ ఆలయం గంగానది తీరంలో కాశీ విశ్వనాథ ఆలయానికి సమీపంలో ఉంది. ప్రతి సంవత్సరం నవరాత్రి పర్వదినాల్లో ఇక్కడ ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు. కాశీ ఖండ పురాణంలో ఈ విశాలాక్షి ప్రాముఖ్యత గురించి విస్తృతంగా వర్ణించారు. విశాలాక్షి దేవిని దర్శించకుండా వారణాసి యాత్ర సంపూర్ణం కాదని భక్తులు నమ్ముతారు. (Vishalakshi Devi Temple)
Also Read: తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల.. ఫుల్ డీటెయిల్స్ చూసేయండి..
ఈ ఆలయం కాశీ విశ్వనాథ ఆలయానికి అతి సమీపంలో ఉండటం వల్ల భక్తులు రెండు దర్శనాలు చేసుకున్న భాగ్యం కలుగుతుంది. ఇక్కడ అమ్మవారికి పట్టు వస్త్రాలు, ఎర్రని పూలు సమర్పించడం శుభప్రదమని భావిస్తారు. ఈ దేవిని ఆరాధించడం వల్ల దీర్ఘాయువు, ఆరోగ్యం, సౌభాగ్యం కలుగుతాయని విశ్వాసం. విశాలాక్షి దేవి ఆలయంలో ప్రాతఃకాలం నుంచి రాత్రి వరకు ప్రత్యేక పూజలు జరుగుతాయి.
ఇక్కడికి భక్తులు ముఖ్యంగా నవరాత్రి, శివరాత్రి రోజుల్లో అధికంగా వస్తారు. విశాలాక్షి అమ్మవారిని త్రిపుర సుందరీ స్వరూపంగా భావిస్తారు. విశాలాక్షి ఆలయానికి దక్షిణ భారత భక్తులు విశేష ప్రాధాన్యం ఇస్తారు. కేరళ, తమిళనాడు నుంచి వచ్చే భక్తులు తప్పనిసరిగా ఈ దేవిని దర్శించుకుంటారు.