కేతువు ఆరాధనలో గణపతి ప్రాశస్త్యము.. ఇలా పూజిస్తే మీ సమస్యలన్నీ పారిపోతాయ్.. ఐశ్వర్యం అంతా మీదే….
ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన వివరాలు..
కేతువుకు అదిష్టానదేవత శ్రీ మహాగణాధిపతి. సమస్యలను దూరం చేసుకోవడానికి గణపతిని ఎందుకు పూజించాలి? ముందుగా శ్రీ మహాగణాధిపతిని గురించి తెలుసుకుందాం. వేదాలు, పురాణాలలో గణపతి ప్రాముఖ్యతను వివరించారు. మనకు వేదాలు ముఖ్యము..
అలాగే పురాణాలు కూడా అన్ని యుగాలలో అంటే..
1) కృతయుగము 2) త్రేతాయుగము 3) ద్వాపర యుగము 4) కలియుగములలో గణపతి ప్రాముఖ్యత తెలుసు.
అలాగే వేదాలు.. 1) ఋగ్వేదము 2) యజుర్వేదము 3) సామవేదము 4) అధర్వణవేదము ఈ వేదములను ఋగ్వేదాన్ని పైలుడుకీ, యజుర్వేదాన్ని జైమినికీ, సామవేదాన్ని వైశంపాయనుడికీ, అధర్వణవేదాన్ని సుమంతుడికీ బోధపరిచాడు. ఈ వేదాలలో గణపతి గురించి వివరించారు.
అలాగే పురాణాలలో కూడా వివరించారు. మన భారతీయ విజ్ఞానం సరస్వమూ ఈ పురాణాల్లోనే నిక్షిప్తం అయి ఉంది.
వ్యాసుడు రచించిన మనకు వారసత్వ సంపదగా అందించిన మహా పురాణాలు 18 అవి..
1) బ్రహ్మపురాణము2) పద్మపురాణము 3) విష్ణుపురాణము 4) వాయుపురాణము 5) భాగవతపురాణము 6) నారదపురాణము 7) మార్కండేయ పురాణము 8) అగ్నిపురాణము 9) భవిష్య పురాణము 10) బ్రహ్మవైవర్త పురాణము11) లింగపురా ణము 12) వరాహ పురాణము 13) స్కాందపురాణము 14) వామన పురాణము 15) కూర్మపురాణము 16) మత్స్య పురాణము 17) గరుడ పురాణము 18) బ్రహ్మాండ పురాణము.
ఈ 18 పురాణాలకు మరో 18 ఉపపురాణాలు కూడా ఉన్నాయి. అవి..
1) ఆదిపురాణము 2) నరసింహ పురాణము 3) స్కాంద పురాణము 4) శివపురాణము 5) దూర్వాస పురాణము 6) నారద పురాణము 7) కపిల పురాణము 8) వామన పురాణము 9) జాశన పురాణము 10) బ్రహ్మాండ పురాణము 11) వరుణ పురాణము 12) కౌశిక పురాణము 13) మహేశ్వర పురాణము 14) శాంబపురాణము 15) సౌతపూరాణము 16) పరాశర పురాణము 17) మారీచ పురాణము 18) భాస్కర పురాణము.
ఈ 18 ఉపపురాణాలకు మరో 18 జాషపురాణాలు కూడా ఉన్నాయి.. అవి..
1) సనత్కుమార పురాణము 2) ఆదిత్య పురాణము 3) బృహన్నాందీయ పురాణము 4) సూర్య పురాణము. 5) నందికేశ్వర పురాణము 6) కార్మపురాణము 7) భాగవత పురాణము 8) వశిష్ఠ పురాణము 9) భార్గవ పురాణము 10) ముద్గల పురాణము 11) కల్కిపురాణము 12) దేవీ పురాణము 13) మహాభాగవత పురాణము 14) బృహద్ధర్మ పురాణము 15) పరానంద పురాణము 16) వహ్నిపురాణము 17) పశుపత్ని పురాణము 18) హరివంశ పురాణము.
వీటిలో లేని విషయమంటూ ఏదీ లేదు.. మనకు అవసరమయినవీ, ఉపయోగపడేవి అన్నీ శాస్త్రాలనూ సకలధర్మాలనూ వీటిలో పొందుపరిచారు.
మహాగణపతి దేవగణాలందరికీ అధిపతి అనేది అలా ఉంచితే.. ‘గ’ అనేది జ్ఞానానికి సూచిక ‘ణ’ అనేది నిర్వాణవాచకం. మోక్షాన్ని సూచిస్తుంది. జ్ఞానమోక్షమార్గాలు రెండింటికి కూడా అధిపతి అయినవాడు గణపతి.
ఓమ్ నమస్తే గణపతయే
త్వమేవ ప్రత్యక్షం
తత్వమసి త్వమేవం కేవలం కర్తాసి
త్వమేవ కేవలం హర్తాసి
త్వమేవ సర్వం ఖల్విదం
బ్రహ్మా సాక్షాత్మాసి నిత్యమ్ ఋతం
వచ్మిసత్యం వచ్చి
పై మంత్రము గణపత్యథర్వరోపనిషత్‌లోనిది.. కుండలిలలోని మూలాధారం.. శక్తి జాగృతం అవుతుంది. మనము గణపతిని ఉపాసన చేస్తే మంచిది. సిద్ధి, బుద్ధి, బలం, దగ్గరగా ఉండేవాడు గణపతి. ఆ గణపతిని ఉపాసిస్తే బుద్ధిరూపమైన మూలాధారం ఐశ్వర్యం అన్నీ సిద్ధిస్తాయి.
పురాణాలలో కూడా శ్రీమహాగణపతి విశ్వరూపాన్ని వివరించారు.
భూతాధిపం భూతగణాధిసేవితం
కపిత్థ జంభూ ఫలాది సారభక్షితం ఉమాసుతం శోకవినాశకారకం
నమామి విఘ్నేశ్వర పాదపంకజం
గణపతి మోక్ష జ్ఞాన మార్గానికి అధిపతి ఈ కేతువు కూడా జ్ఞానానికి అధిపతి అందువల్లే కేతువుకు అధిష్ఠానదేవత గణపతి ఋగ్వేదంలోనూ యజుర్వేదములోనూ అధర్వణవేదంలోను శ్రీమహాగణాధిపతి మంత్రములు కూడా ఇచ్చారు.
శ్లో॥ ఓం గణానాంత్వా గణపతిగ్ హవామహే కవింకవీనా ముపమశ్రవస్తమమ్ |
జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత అనశ్శృణ్వ న్నూతిభి స్సీదసాదనమ్||
పైమంత్రము యజుర్వేదంలో ఉన్న గణపతి మంత్రం సర్వవిఘ్నాలను శాంతింపజేయగల శక్తిమంతుడు వినాయకుడు ఈ మంత్రార్ధము ఏమిటి అంటే దేవగణాలకు అధిపతి గణపతి ఆదికాలము నుంచీ గణపతిని పూజించడం ఉ ౦ది గణాలకు అధిపతి గణపతి గణాలంటేనే విద్య విద్యను పరబ్రహ్మ స్వరూపంగా పేర్కొన్నాయి.
“స్వామి నువ్వు మేధావులలో మేధావి, ప్రధానులైన వారందరిలో ప్రధానుడవు, వేదాలకు నాయకుడు శ్రేష్టులయిన వారిలో అందరి కంటే శ్రేష్ఠుడవు, సాటిలేని ఈశాన్య రాష్ట్రంలోని నాగజాతి వారు పూజించే గణపతికి పదితలలున్న ఖ్యాతి గడించిన వాడివి, మమ్ములను రక్షించవయ్యా గణనాథా” అని కీర్తించడము . ఆదిశేషుడు పడగనీడనిస్తుంటాడు.

పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Ph: 9849280956, 9515900956
