Horoscope Today : అనవసరమైన వివాదాలు..! ఈ మూడు రాశుల వారు జాగ్రత్త..!
ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. రుణ బాధలు పెరుగుతాయి. పెద్దల సలహా పాటించడం చాలా అవసరం. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది.

Today Horoscope
Horoscope Today : ఇవాళ్టి సూర్యోదయానికి ఉన్న గ్రహస్థితి కాస్త విభిన్నంగా కనిపిస్తున్నది. అంశలో సప్తగ్రహ కూటమి కారణంగా కొన్ని రాశుల వారికి ఆకస్మిక ప్రయోజనాలు చేకూరనున్నాయి. అదే సమయంలో మరికొన్ని రాశులకు అనవసరమైన వివాదాలు తెచ్చిపెడుతుంది. వృషభం, వృశ్చికం, మకర రాశులవారు అయాచిత లబ్ధి పొందుతారు. మేషం, కర్కాటకం, సింహ రాశుల వారు దారిన పోయే కంపను నెత్తిన తగిలించుకుంటారు.

Aries
మేషం: ఆరోగ్యంలో తేడాలు ఉంటాయి. అధికారులతో వివాదాలు తలెత్తుతాయి. బంధుమిత్రుల రాకతో ఖర్చు పెరుగుతుంది. వ్యాపారం మందకొడిగా సాగుతుంది. దగ్గరివారిని దూరం చేసుకోకండి. సాయంత్రానికి ఒక శుభవార్త వింటారు. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Taurus
వృషభం: వ్యాపారం లాభసాటిగా కొనసాగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. కొత్త వస్తువులు కొనుగోలు చేస్తారు. కోర్టు కేసులలో అనుకూల ఫలితాలు ఉంటాయి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Gemini
మిథునం: ప్రయాణాలు కలిసివస్తాయి. ఉత్సాహంగా పనులు చేస్తారు. ఉద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. సమయోచితమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఆస్తి తగాదాలు ఓ కొలిక్కి వస్తాయి. ఆరోగ్యంగా ఉంటారు. లక్ష్మీదేవి ఆలయాన్ని సందర్శించండి.

Cancer
కర్కాటకం: ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. రుణ బాధలు పెరుగుతాయి. పెద్దల సలహా పాటించడం చాలా అవసరం. ఉద్యోగులకు ఒత్తిడి పెరుగుతుంది. శ్రమకు తగ్గ గుర్తింపు ఉండదు. పట్టుదల కోల్పోవద్దు. శివారాధన శుభప్రదం.

Leo
సింహం: కుటుంబసభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. ఆహార నియమాలు పాటించడం అవసరం. ఉద్యోగులకు మిశ్రమ వాతావరణం. వ్యాపారంలో అత్తెసరు లాభాలు ఉంటాయి. నూతన ఒప్పందాలకు ఈ రోజు అనుకూలం కాదు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

Virgo
కన్య: ఆర్థిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ఆస్తి తగాదాలు పరిష్కారం అవుతాయి. వ్యాపార భాగస్వాములతో చర్చించి, అనుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు పొందుతారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. ఆంజనేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Libra
తుల: పిల్లల చదువు, శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. విదేశీ ప్రయాణాలు అనుకూలిస్తాయి. ఆదాయం స్థిరంగా ఉంటుంది. వ్యాపార విస్తరణపై మనసు నిలుపుతారు. కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. ఉద్యోగులకు పదోన్నతి అవకాశం. సూర్యారాధన శుభప్రదం.

Scorpio
వృశ్చికం: వృత్తి, వ్యాపారాలు లాభదాయకంగా కొనసాగుతాయి. న్యాయపరమైన సమస్యలు పరిష్కారం అవుతాయి. బంధుమిత్రులను కలుసుకుంటారు. భూములు, వాహనాల కొనుగోలులో జాగ్రత్త వహించాలి. సాయంత్రానికి ఒక శుభవార్త వింటారు. రామాలయాన్ని సందర్శించండి.

Sagittarius
ధనుస్సు: విద్యార్థులకు శ్రమ పెరుగుతుంది. ఉద్యోగులకు అధికారుల నుంచి విమర్శలు ఎదరవుతాయి. ఖర్చుల నియంత్రణ అవసరం. ఆన్‌లైన్ లావాదేవీల్లో ఏమరుపాటు తగదు. అతిగా ఆలోచించి అవకాశాలను చేజార్చుకుంటారు. దుర్గాదేవి స్తోత్రాలు పఠించండి.

Capricorn
మకరం: రావలసిన డబ్బు చేతికి అందుతుంది. ఓపికగా బాధ్యతలు నిర్వర్తిస్తారు. బంధుమిత్రుల సహకారంతో కొన్ని కార్యాలు సిద్ధిస్తాయి. భూ లావాదేవీలు అనుకూలిస్తాయి. వ్యాపార ఒప్పందాలు లాభసాటిగా ఉంటాయి. ఒక శుభవార్త వింటారు. నరసింహస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Aquarius
కుంభం: ప్రారంభించిన పనులు సకాలంలో పూర్తవుతాయి. పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్థిర, చరాస్తుల మూలంగా ఆదాయం కలుగుతుంది. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి అనుకూల ఫలితాలున్నాయి. షేర్ మార్కెట్‌లో ఆచితూచి ఇన్వెస్ట్ చేయండి. సుబ్రహ్మణ్యస్వామి ఆరాధన శుభప్రదం.

Pisces
మీనం: అయినవారితో నిదానంగా మాట్లాడటం అవసరం. శుభకార్య ప్రయత్నాలు విజయవంతం అవుతాయి. ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. వివాదాలకు దూరంగా ఉండాలి. ఉద్యోగులు పట్టుదలతో బాధ్యతలు నిర్వర్తిస్తారు. వినాయకుడి ఆలయాన్ని సందర్శించండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.