Horoscope Today: వెంటాడుతున్న కాలసర్పదోషం.. ఈ రాశుల వారికి కొంచెం ఇష్టం కొంచెం కష్టం..!
సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది.

Horoscope Today
Horoscope Today: మేషంలోకి పూర్తి స్థాయిలో అడుగుపెట్టిన బుధుడు.. రవితో కలిసి మేలు చేస్తాడు. నవాంశలో స్వక్షేత్రం పొందిన ఉచ్ఛంగతుడైన శుక్రుడు మరిన్ని శుభ ఫలితాలు ఇస్తాడు. అయితే, కాలసర్పదోషం ప్రభావం వెంటాడుతున్నది. ఫలితంగా దాదాపు అన్ని రాశులకూ ఈరోజు కొంచెం ఇష్టం.. కొంచెం కష్టంగా కొనసాగుతుంది.
మేషం: సాహసించి పనులు చేస్తారు. ఆరోగ్య సమస్యలు తీరుతాయి. ఉత్సాహంతో ఉంటారు. ప్రయాణాలు కలిసివస్తాయి. అన్నదమ్ములతో సఖ్యత నెలకొంటుంది. ప్రయాణాల వల్ల కార్యసిద్ధి ఉంది. శివారాధన మేలుచేస్తుంది.
వృషభం: ఈ రోజు అదృష్టయోగం ఉంది. సంతృప్తిగా కాలం గడుపుతారు. విలువైన ఆభరణాలు, ఇంట్లోకి వస్తువులు కొనుగోలు చేస్తారు. మంచివ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. దత్తాత్రేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
మిథునం: మిశ్రమంగా ఉంటుంది. పెట్టుబడుల విషయంలో ఏమరుపాటు తగదు. పనుల్లో ఆటంకాలు తలెత్తుతాయి. స్థిరాస్తి ద్వారా ఆదాయం సమకూరుతుంది. మానసిక ప్రశాంతత పొందుతారు. సూర్యారాధన మేలుచేస్తుంది.
కర్కాటకం: గతంలో పెట్టిన పెట్టుబడుల మూలకంగా లాభాలు అందుకుంటారు. విందు, వినోదాలలో పాల్గొంటారు. కొత్త వస్తువులు, నగలు కొనుగోలు చేస్తారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయం ఏర్పడుతుంది. ఆంజనేయస్వామి ఆలయాన్ని సందర్శించండి.
సింహం: సహోద్యోగులతో మనస్పర్ధలు తలెత్తవచ్చు. వివాదాలకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోవడం మంచిది. సంయమనంతో వ్యవహరించండి. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
కన్య: సంతోషంగా కాలం గడుపుతారు. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. పాతబాకీలు వసూలు అవుతాయి. ఆరోగ్యం మెరుగవుతుంది. విద్యార్థులు శ్రమకు తగిన ఫలితాలు అందుకుంటారు. దుర్గాదేవి ఆరాధన శుభప్రదం.
తుల: తలపెట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. శుభకార్యాల ప్రయత్నాలు ఫలిస్తాయి. రావలసిన డబ్బు అందుతుంది. అలంకరణ వస్తువులు కొనుగోలు చేస్తారు. ఉద్యోగులకు పనిభారం పెరుగుతుంది. వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించండి.
వృశ్చికం: పనులు తాత్కాలికంగా నెరవేరుతాయి. ఉద్యోగులు అందరి మన్ననలను పొందుతారు. సమయానుకూల నిర్ణయాలు తీసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. నరసింహస్వామి ఆరాధన శుభప్రదం.
ధనుస్సు: ఉద్యోగ ప్రయత్నాలు తాత్కాలికంగా ఫలిస్తాయి. అధికారుల ఆదరణ పొందుతారు. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. సమయపాలన పాటించడం అవసరం. సంయమనంతో వ్యవహరించండి. దుర్గాదేవి ఆరాధన మేలుచేస్తుంది.
మకరం: ప్రయాణాలు కలిసివస్తాయి. అలసట లేకుండా పనులు చేస్తారు. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. శుభకార్య ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. శివారాధన శుభప్రదం.
కుంభం: పెద్దల సహకారం లభిస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది. విహారయాత్రలు చేపడతారు. సభలు, సమావేశాలకు హాజరవుతారు. బంధువులతో అనవసరమైన చర్చలకు దిగకండి. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.
మీనం: మంచివారితో పరిచయాలు ఏర్పడతాయి. నలుగురికి సాయం చేస్తారు. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి ఊరట లభిస్తుంది. అధికారుల అండదండలు లభిస్తాయి. తొందరపాటు నిర్ణయాలు కూడదు. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.
(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008
Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.