Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశివారు చేపట్టిన పనుల్లో అపజయములు..!
ఈ రోజు (శుక్రవారం, నవంబర్ 15, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశులa ఫలితాల వివరాలు...

జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోది నామ సంవత్సర కార్తీకమాస శుద్ధ చతుర్దశి ఉ.6:19, పూర్ణిమ: రాతె 2:58 శుక్రవారము
మేష రాశి: సన్నిహితులతో విందువినోదాలలో పాల్గొంటారు. మిశ్రమ ఫలితములు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితములు. ముఖ్యమైన వ్యవహారములో అప్రమత్తంగా ఉండాలి. ఎవరితోనూ వాదనలకు దిగవద్దు. వృథా ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యం సహకరిస్తుంది. ఏకాగ్రతతతో చిత్తశుద్ధితో పని చేస్తే అన్ని పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఇష్టాదేవతారాధన వల్ల శుభఫలితములు కలుగుతాయి.
వృషభ రాశి: ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. చేపట్టిన పనుల్లో అపజయములు రావడం వల్ల విచారంగా ఉంటారు. వృత్తి ఉద్యోగములలో కష్టపడి పనిచేయడం వల్ల విజయం సాధించవచ్చు. అనారోగ్యం కారణంగా ఈ రోజు మొదలు పెట్టిన పనులు అసంపూర్ణంగా మిగులుతాయి. వృథా ఖర్చులు, వాహన ప్రమాదములు విషయంలో జాగ్రత్త. అభయ ఆంజనేయ స్వామి ఆలయ సందర్శనతో గండాలు తొలగి పోతాయి.
మిధున రాశి: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా, వ్యక్తి గతంగా మీ సన్నిహితులతో సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు ప్రయత్నిస్తారు, మీ ప్రయత్నములు ఫలిస్తాయి. మీలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఆరోగ్యం మెరుగు అవుతుంది. పొదుపు పాటించుతారు, సరియైన ప్రణాళికలతో ముందుకు వెళ్తారు. లాభదాయకమైన సంస్థలలో పెట్టుబడులు పెట్టడం వలన అధిక లాభములు కలుగుతాయి. శివారాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితములు పొందుతారు.
కర్కాటక రాశి: ఈ రోజు ఫలవంతంగా ఉంటుంది, ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి ఆదాయం వృద్ధి చెందుతుంది. అదృష్టం వరించి అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు. మిత్రులతో విహారయాత్ర, తీర్థయాత్రకు ప్రణాళిక వేస్తారు. పిత్రార్జితం కలసివస్తుంది. శ్రేయోభిలాషుల మద్దతు మీ వైపు ఉంటుంది. కుటుంబ సభ్యులతో మంచి సమయాన్ని గడుపుతారు. శ్రీలక్ష్మీ ధ్యానం వలన శుభ ఫలితములు కలుగుతాయి.
సింహ రాశి: ఈ రోజు సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి. వృత్తి వ్యాపారములలో ఆశించిన ఫలితములు లేకపోవడం చికాకు కలిగిస్తుంది. మిత్రులతో, బంధువులతో గొడవలు పెరుగుతాయి. ప్రతికూల ఆలోచనల కారణంగా కుటుంబ సభ్యులతో వివాదములు పెరుగుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాల కారణంగా మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. ఆదిత్యహృదయం పారాయణ చేయటం వలన ఉత్తమ ఫలితములు కలుగుతాయి
కన్యా రాశి: ప్రయణములో అపశ్రుతులు, రుణబాధలు, ఆరోగ్యము కుదుటపడుతుంది. వివాహ ప్రయత్నములు సఫలీకృతము కావడం, మానసిక ప్రశాంతత కలగడం, విద్యార్థులకు అధికలాభము, శుభకార్యక్రమముల నిర్వాహణ, ఉద్యోగంలో చిక్కులు, కోర్టు సమస్యలు, వ్యాపారములలో లాభములు కలగడం.. మిత్రులతో బంధువులతో సన్నిహితంగా ఉండటం. గణపతి, గాయత్రీ మంత్రములు చదవడం వలన శుభ ఫలితములు కలుగుతాయి.
తులా రాశి: ఆనందం, ధనము చేతికి అందడం, ఉద్యోగంలో ప్రమోషన్లు, వ్యాపార విస్తరణ విలువైన ఆభరణములు కొనుగోలు చేయడం, బంధు మిత్రులతో వినోదములు, విందులు, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశములు, సూర్యనమస్కారములు చేయడం ఉత్తమం
వృశ్చిక రాశి: అధికారుల ఆగ్రహం, అవరోదములు, ప్రయూణములలో ఆటంకములు, గొడవలు బంధు మిత్రులతో సహనం పాటించాలి. శుభకార్యక్రమమలలో పాల్గొనటం, సోమరితనం, అపాయములు. రుద్రజపం చేసినచో మంచిది.
ధనస్సు రాశి: నూతన వ్యాపారము, నూతన ఉద్యోగములు, శుభవార్తలు, ధనధాన్య లాభములు ఇష్టమైన వ్యక్తుల కలయిక, వృత్తి ఉద్యోగములయందు లాభములు కలుగుతాయి, ప్రయూణములో అలసట. సుబ్రహ్మణ్య స్వామిపూజ చేయటం ఉత్తమం.
మకర రాశి: నూతన వ్యక్తుల పరిచయం, విద్యార్థులకు అనుకూలము, ఫ్యాన్సీ, వెండి బంగారు, నగల విలువైన దుస్తులు కొనుగోలు చేయడం, చేయు వృత్తి, ఉద్యోగ వ్యాపారము అభివృద్ధి రాణింపు ఉండును. శివసహస్రనామార్చన ఉత్తమము.
కుంభ రాశి: స్థానభ్రంశము, అన్యస్థల నివాసము, కోర్టు సమస్యలు, మోసపోవడం, కుటుంబ కలహములు, మానసిక ఆందోళనలు, పుత్రుమిత్ర విరోధములు కలుగును, సరియైన నిర్ణయములు తీసుకోలేకపోవడం. అమ్మవారి ఆరాధన వలన మేలు కలుగును.
మీన రాశి: వ్యాపారాల్లో లాభములు, తీర్థయాత్రలు, పుణ్యక్షేత్రములు, నదీస్నానం, నూతన వ్యాపారములు, రుణబాధలు తగ్గడం, విరోధములు, మోకాళ్ల నొప్పులు, ఉద్యోగంలో అనుకూలత, అనారోగ్యము. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం మంచిది.
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956