Today Horoscope: నేటి రాశి ఫలాలు.. ఈ రాశుల వారికి ఉద్యోగంలో తిప్పలు తప్పవు.!
ఈ రోజు (గురువారం, అక్టోబర్ 10, 2024) ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో.. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ అందించిన నేటి 12 రాశుల ఫలితాలు వివరాలు...

Astrological Prediction
Daily Horoscope: జోతిష్యం అంటే మీ భవిష్యత్తు గురించిన సూచన. చాలామంది వ్యక్తులు భవిష్యత్తును దైవికంగా చెప్పడానికి జాతకం నిజమైన మార్గమని నమ్ముతారు. మీ రాశి ఫలాలు ఇవాళ ఈ కింది విధంగా ఉన్నాయి. ప్రముఖ జ్యోతిష్య, వాస్తు శాస్త్ర పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ వీటిని అందించారు. ఇవాళ ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుందో, మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూడండి..
శ్రీ క్రోధి నామ సంవత్సర ఆశ్వీజ మాస శుద్ధ సప్తమి మ 12:31, పూర్వాషాఢ రాతె 5:41 గురువారము ఈ రోజు ద్వాదశ రాశుల ఫలితములు
మేష రాశి: ఉద్యోగలాభం, ఉద్యోగాలలో ప్రమోషన్స్, స్థానచలనము, కార్యరంగంలో ప్రతికూలత, శతృవృద్ధి, కుటుంబంలో సమస్యలు రాకుండా చూసుకోవాలి, అనారోగ్యము కొరకు ధనాన్ని ఖర్చు పెడుతారు, ప్రేమసంబంధమైన విషయములు మీకు సంతోషాన్ని కలిగిస్తాయి: శివ పూజ చేసినచో మంచి ఫలితములు వస్తాయి.
వృషభ రాశి: అనవసరమైన విషయాల్లో కలుగజేసుకోకూడదు, కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి, చికాకులు, ఉద్యోగ, వ్యాపారంలో ధన లాభములు కలుగుతాయి, వాదనలు, తగువులు, విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి పెరగడం, శారీరక సుఖం, శుభకార్యక్రమములు జరుగుతాయి: గణపతి ఆరాధన వలన శుభ ఫలితములు వస్తాయి.
మిథున రాశి: వ్యాపారములు లాభములు, ప్రయాణముల వలన ఆదాయం పెరగడం, ఆరోగ్యం కుదుటపడటం, సంతోషము, నమ్మిన వారి వలన మోసము, నూతన వస్త్ర లాభాము, మనోధైర్యము కుటుంబంలోను, చేయువృత్తుల యందు సుఖ శాంతులు పొందుతారు. ఇష్టదైవ ఆరాధన చేయడం వల్ల అనుకున్న పనులు నెరవేరుతాయి
కర్కాటక రాశి: కుటుంబ సభ్యులతో సమయాన్ని గడపడం, ఈ రోజు శుభ ఫలితములు జరగడం, ఆరోగ్యం, ప్రయాణములు, తీర్దయాత్రలు, వ్యాపారంలో పెట్టుబడులు పెట్టడం, దూర ప్రయాణములు, చిరు వ్యాపారులకు లాభములు, విద్యార్థులు పోటీ పరీక్షలలో ఉత్తీర్ధత సాధిస్తారు: నారాయణ ‘అష్టాక్షరి మంత్రం చదవడం వలన ఉత్తమ ఫలితములు వస్తాయి.
సింహ రాశి: ధన విషయంలో ఇబ్బందులు, అనారోగ్యం, మానసిక ఒత్తిడి, డ్రైవింగ్ చేసేటప్పుడు అదనంగా జాగ్రత్తలు తీసుకొండి, అన్న దమ్ముల మధ్య వివాదము, విలువైన ఆభరణములు కొనడం, బంధుమిత్రులతో విందు వినోదములు: రాజ రాజేశ్వరి ఆరాధన వలన శుభ ఫలితములు కలుగుతాయి.
కన్యా రాశి: సంచార యోగం, వేళ తప్పిన భోజనం, బంధుమిత్ర వైరములు, వృధా భ్రమణము, విద్యలో వైఫల్యము, కులాచార ప్రకారం వృత్తి రాణింపు, ధనకనక వస్తులాభము, కీర్తి ఆకారణ కలహములు, గృహనిర్మాణ అవకాశము, శత్రు పరాభము: గాయత్రీ దేవి ఆరాధన వలన శుభ ఫలితములు కలుగుతాయి
తులా రాశి: కార్యసాఫల్యం, భోజన సౌఖ్యం, వస్తు ప్రాప్తి, ఉష్ణ సంబంధ వ్యాదులు, అనవసర ప్రయాణములు, ఆభరణ లాభం, అధికారులనుండి సమస్యలు, బంధు జన సంతోషము, అసౌఖ్యము, గృహసమస్య, వస్తు ప్రాప్తి, తీర్థ యాత్రలు: శివపంచాక్షరి జపము చేసిన ఉత్తమమైన ఫలితములు వస్తాయి.
వృశ్చిక రాశి: వ్యాపార వృద్ధి, స్థిరాస్తులలో లాభం, మానసిక బాధ, అగౌరవము, శ్వాసకోశ సమస్యలు, ధన కనక వస్తు ప్రాప్తి, అధికార సందర్శనం, కార్యసిద్ధి, శారీరక సౌఖ్యం, కార్య విఘ్నములు, బందు మిత్ర పీడ, విజయప్రాప్తి, రోగవృద్ది: శ్రీ శివాలయ ప్రదక్షిణలు చేసినచో మంచి ఫలితములు వస్తాయి.
ధనస్సు రాశి: మహనీయుల కలయిక, కార్య సిద్ధి, కుటుంబంలో శుభములు, సమాజంలో గౌరవము, సుఖనిద్ర, నూతన వస్త్ర ఆభరణ ప్రాప్తి, వస్తునాశనము, ఉదర, నేత్ర సంబంధ వ్యాదులు, భోజన హాని, అసౌఖ్యం, అపకీర్తి, ఉద్యోగ మార్పిడి, చోర భయం, శ్రమకు గుర్తింపు, ప్రయాణ లాభం: గణపతి ఆరాధన చేయడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయి.
మకర రాశి: వ్యవహార సాఫల్యము, బంధు వృద్ధి, దైవానుగ్రహము, కార్యానుకూలత, ప్రేమకలపం, దూషణలు, ఉద్యోగ భద్రత అవసరం, జ్ఞాతుల కలహములు, శారీరక శ్రమ, పాపకార్యసక్తి: విష్ణువును ఆరాధన చేయడం వల్ల శుభ ఫలితాలు వస్తాయి.
కుంభ రాశి: ప్రయాణంలో జాగ్రత్త అవసరం, గర్భ సంబంధ అనారోగ్యం, శుభవార్త శ్రవణం, ధన లాభం, సుఖం, విజయప్రాప్తి, ఆదాయానికి మించిన వ్యయం, స్దాన భ్రంశము, ప్రేమ కలాపాలు, ప్రమాదములు, విదేశాలకు వెళ్లడం, మనో దైర్యం: శ్రీ ఆంజనేయ స్వామి ఆరాధన చేయడం వలన సమస్యలు తగ్గుతాయి.
మీనా రాశి: అనారోగ్యం, పట్టుదల సడలింపు, బంధువిరోధం, శారీరకశ్రమ, గాయాలు, కళత్ర సమస్య, అభిప్రాయ భేదం, సంతాన బాధలు, అకస్మిక ధన లాభము వృత్తి వ్యాపారములలో అనుకూలము, ధన ధాన్యప్రాప్తి, స్థిరాస్తుల లాభము, ఉద్యోగ మార్పిడి, పదోన్నతి, విజయప్రాప్తి: శ్రీ వేంకటేశ్వర స్వామి ఆరాధన చేయడం వల్ల ఉత్తమమైన ఫలితములు కలుగును
— బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ
Contact: 9849280956, 9515900956