Horoscope Today : ధనప్రాప్తి, విలువైన వస్తువులు కొంటారు..! ఈ రాశుల వారికి లాభమే లాభం..!

అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి.

Today Horoscope

Horoscope Today : చంద్రుడు ఉచ్ఛస్థితిలో గజకేసరి యోగంతో ఉన్నాడు. ఫలితంగా వృషభం, సింహం, వృశ్చిక రాశుల వారికి మేలు జరుగుతుంది. గురు అనుగ్రహంతో కర్కాటకం, మకర రాశుల వారికి లబ్ధి చేకూరుతుంది. శని ప్రభావంతో మేషం, కుంభ, మీన రాశులకు మిశ్రమ ఫలితాలు ఉంటాయి.

Aries

మేషం: ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. ప్రయాణాల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఆలోచనలు స్థిమితంగా ఉండవు. చిన్నచిన్న విషయాలకే హైరానా పడుతుంటారు. బంధువులతో మాటపట్టింపులు తలెత్తవచ్చు. వ్యాపారులకు కార్యసిద్ధి. దుర్గాదేవిని ఆరాధించండి.

Taurus

వృషభం: ధనప్రాప్తి ఉంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. స్నేహితులను కలుసుకుంటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తారు. శివారాధన మేలు చేస్తుంది.

Gemini

మిథునం: తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. కొత్త పనులు చేపట్టకుండా చేతిలో ఉన్నవాటిని పూర్తి చేయడంపై దృష్టి సారించడం అవసరం. ఆగ్రహావేశాల వల్ల కొన్ని అవకాశాలను కోల్పోవచ్చు. వైష్ణవాలయ దర్శనం మేలు చేస్తుంది.

Cancer

కర్కాటకం: ఈ రోజు శుభప్రదంగా ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా కాలం గడుపుతారు. శత్రువుల ద్వారా లాభం కలుగుతుంది. సుబ్రహ్మణ్యస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Leo

సింహం: ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. నిబద్ధతతో వ్యవహరిస్తే విజయం వరిస్తుంది. ఉద్యోగులకు విజయం చేకూరుతుంది. వాగ్వివాదాలకు దూరంగా ఉండటం అవసరం. దీర్ఘకాలిక ప్రయోజనాలు పొందుతారు. సూర్యారాధన వల్ల మేలు కలుగుతుంది.

Virgo

కన్య: ఉద్యోగంలో విజయం సాధిస్తారు. పదోన్నతి, అనుకూల స్థానచలనానికి అవకాశం. ధైర్యంతో పనులు చేస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు సాధిస్తారు. బంధువులతో సఖ్యత నెలకొంటుంది. దక్షిణామూర్తిని ఆరాధించండి.

Libra

తుల: అనుకున్న పనులు సకాలంలో పూర్తవుతాయి. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్య ప్రయత్నాలు సఫలమవుతాయి. విద్యార్థులు పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు. హనుమాన్‌ చాలీసా పఠించండి.

Scorpio

వృశ్చికం: ప్రణాళికా బద్ధంగా ముందుకు వెళ్తే అనుకున్నది సాధిస్తారు. పాత బాకీలు వసూలు అవుతాయి. అధికారుల ఆదరణ పొందుతారు. ఆత్మీయుల సూచనలు అమలుచేయడం ద్వారా మేలు కలుగుతుంది. శివారాధన శుభప్రదం.

Sagittarius

ధనుస్సు: తాత్కాలిక ప్రయోజనాలు పొందుతారు. వ్యాపారులకు అనుకూల సమయం. వ్యాపార భాగస్వాములతో సఖ్యత పెరుగుతుంది. ఖర్చుల నియంత్రణ అవసరం. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. ఆంజనేయస్వామి ఆరాధన మేలు చేస్తుంది.

Capricorn

మకరం: మంచివారి సాహచర్యం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు కలిసివస్తాయి. వ్యాపారులకు న్యాయపరమైన చిక్కులు తొలగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారికి తాత్కాలిక ఊరట లభిస్తుంది. నరసింహస్వామి ఆలయాన్ని సందర్శించండి.

Aquarius

కుంభం: ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది. సహోద్యోగులతో సమస్యలు రావచ్చు. వ్యాపారంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. భూ లావాదేవీల్లో జాగ్రత్త అవసరం. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. సూర్య ఆరాధన మేలు చేస్తుంది.

Pisces

మీనం: ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. రకరకాల ఆలోచనలు స్ఫురిస్తాయి. పనులు ముందుకుసాగవు. అయినవారిని దూరం చేసుకోకండి. సంయమనం పాటించడం అవసరం. ప్రయాణాలు వాయిదా వేసుకుంటే మంచిది. దత్తాత్రేయస్వామి ఆరాధన శుభప్రదం.

(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008

Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్‌ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.