Horoscope Today: పారాహుషార్‌.. నేడు పంచగ్రహ కూటమి.. ఈ రాశుల వారు జాగ్రత్త..!

కుటుంబంలో కలతలు రేగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా సమస్యలు ఉత్పన్నం అవుతాయి. స్టాక్‌ మార్కెట్‌లో ఆచితూచి వ్యవహరించండి.

Horoscope Today: పారాహుషార్‌.. నేడు పంచగ్రహ కూటమి.. ఈ రాశుల వారు జాగ్రత్త..!

Updated On : April 25, 2025 / 12:11 AM IST

Horoscope Today: మీన రాశిలోకి చంద్రుడు చేరడంతో పంచగ్రహ కూటమి నెలకొంది. శని, రాహువులు ఉన్న నక్షత్రం క్షీణ చంద్రుడు ప్రయాణిస్తుండటంతో కొన్ని రాశులకు తిప్పలు అధికమవుతాయి. ఈ పరిస్థితులు మరికొన్ని రాశులకు విపరీత రాజయోగం తెచ్చిపెడుతుంది. ధనుస్సు, కుంభ రాశులకు ఈ రోజు భారంగా గడుస్తుంది. తుల, వృశ్చిక రాశులకు ప్రశాంతంగా సాగిపోతుంది.

మేషం: రోజువారీ పనులు సజావుగా సాగుతాయి. కొత్త ఒప్పందాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఆర్థికంగా మిశ్రమంగా ఉంటుంది. భరణి నక్షత్ర జాతకులు కొంత సంయమనం పాటించడం అవసరం. ఈశ్వరారాధన మేలు చేస్తుంది.

వృషభం: చుట్టుముట్టిన సమస్యలు దూదిపింజాల్లా తేలిపోతాయి. పనుల్లో వేగం పుంజుకుంటుంది. ఆర్థికంగా విజయం సాధిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది. స్నేహితులను కలుసుకుంటారు. సంతోషంగా ఉంటారు. దత్త స్తోత్రాలు పఠించండి.

మిథునం: పెద్దగా ఇబ్బందులు ఉండవు, అలాగని అద్భుతాలూ జరగవు. ఈ రోజు సాదాసీదాగా గడిచిపోతుంది. ఉద్యోగులకు పని ఒత్తిడి పెరుగుతుంది. శ్రమకు తగ్గ గుర్తింపు పొందుతారు. రహస్య మంతనాల వల్ల నష్టం తప్పదు. దుర్గాదేవి ఆలయాన్ని సందర్శించండి.

కర్కాటకం: ఉచ్చు నుంచి బయటపడతారు. కీలకమైన మార్పులు చోటు చేసుకుంటాయి. అవి మీకు అనుకూలంగా పరిణమిస్తాయి. ఎవరినీ ఎక్కువగా విశ్వసించకండి. మీ ధర్మం మీరి ప్రవర్తించకండి. నరసింహస్వామి స్తోత్రాలు పఠించండి.

సింహం: ఆరోగ్యం విషయంలో కలత చెందుతారు. అనవసరమైన భయాలు చుట్టుముడుతాయి. పుబ్బ నక్షత్ర జాతకులు అప్రమత్తంగా ఉండటం అవసరం. వివాదాలకు దూరంగా ఉండండి. సాయంత్రానికి పరిస్థితులు కుదురుకుంటాయి. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కన్య: అనుకోని అవాంతరాలు ఎదురవుతాయి. కొందరి ప్రవర్తన మనస్తాపం కలిగిస్తుంది. చాలా విషయాల్లో ప్రేక్షక పాత్ర పోషించాల్సి వస్తుంది. కుటుంబంలో కలహ వాతావరణం ఉంటుంది. సంయమనం పాటించడమే మందు. రామాలయాన్ని సందర్శించండి.

తుల: ఉత్సాహంగా పని చేస్తారు. ఉల్లాసంగా ఉంటారు. ఎక్కడలేని శక్తి వచ్చినట్టుగా భావిస్తారు. ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మలుచుకోగలుగుతారు. ఆర్థికంగా ప్రయోజనం పొందుతారు. భోజన సౌఖ్యం ఉంది. శివారాధన చేసుకోండి.

వృశ్చికం: కొన్ని రోజులుగా వెంటాడుతున్న సమస్యలకు చక్కని పరిష్కారం లభిస్తుంది. పట్టుదలతో పనిచేస్తారు. చర్చల ద్వారా లబ్ధి పొందుతారు. సంతానానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంటారు. గణపతి ఆలయాన్ని సందర్శించండి.

ధనుస్సు: కుటుంబసభ్యులతో కలహ సూచన. తల్లితో వాగ్వాదం చోటు చేసుకోవచ్చు. మౌనం పాటించడమే ఉత్తమం. మనసు స్థిమితంగా ఉండదు. సరైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆర్థికంగా ఫర్వాలేదు. కాలభైరవాష్టకం పఠించండి.

మకరం: కొంతకాలంగా ఊరట కలిగించిన శని.. ఈ రోజు పగబట్టినట్టే ఫలితాలు ఇస్తాడు. పనులు మందకొడిగా సాగుతాయి. ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది. సోదరితో వైరం ఏర్పడే అవకాశాలు ఉన్నాయి. సాయంత్రానికి పరిస్థితి కొంత మారుతుంది. హనుమాన్‌ చాలీసా పఠించండి.

కుంభం: కుటుంబంలో కలతలు రేగుతాయి. రుణదాతల ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా సమస్యలు ఉత్పన్నం అవుతాయి. స్టాక్‌ మార్కెట్‌లో ఆచితూచి వ్యవహరించండి. ఆరోగ్యంపై శ్రద్ధ వహించడం అవసరం. శివారాధన మేలు చేస్తుంది.

మీనం: అదృష్టం వెంట నడుస్తుంది. ఆకస్మిక ధనలాభం సూచితం. అన్నదమ్ముల సహకారం లభిస్తుంది. కుటుంబ సౌఖ్యం ఉంది. విందులు, వినోదాలకు హాజరవుతారు. పదిమందితో కులాసాగా ఉంటారు. లక్ష్మీధ్యానం శుభప్రదం.

(వ్యక్తిగత జాతక వివరాల కోసం సంప్రదించగలరు)
టి. భుజంగరామ శర్మ
77022 86008

Disclaimer : జ్యోతిష్యం అనేది పూర్తి వ్యక్తిగత నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. నిరూపితమైన శాస్త్రం కాదు. ఈ వెబ్‌సైట్‌లోని కంటెంట్ సమాచారం కోసం మాత్రమే. ఇందులో కచ్చితత్వానికి హామీ ఇవ్వలేం. ఈ కంటెంట్ ఆధారంగా తీసుకునే ఏవైనా నిర్ణయాలపై మీదే బాధ్యత. వ్యక్తిగత, ఆర్థిక, వైద్య లేదా చట్టపరమైన విషయాల గురించి పూర్తి సమాచారం కోసం అర్హత కలిగిన నిపుణులను సంప్రదించండి. ఈ కంటెంట్‌ ద్వారా వల్ల కలిగే ఎలాంటి ఫలితాలకు మాది బాధ్యత కాదని గమనించాలి.