Site icon 10TV Telugu

TTD: తిరుమల భక్తులకు బిగ్ అలర్ట్.. ఆరోజు ఆలయం మూసివేత.. సిఫార్సు లేఖలు రద్దు..

Tirumala Ttd

TTD: తిరుమల శ్రీవారి దర్శనానికి సంబంధించి భక్తులకు బిగ్ అలర్ట్. టీటీడీ కీలక ప్రకటన చేసింది. చంద్ర గ్రహణం కారణంగా ఈ నెల 7న వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసింది టీటీడీ. 7న చంద్రగ్రహణం కారణంగా సాయంత్రం 3.30 గంటల నుండి 8వ తేదీ ఉదయం 3 గంటల వరకు శ్రీవారి ఆలయం మూసివేసి ఉంచుతారు.

ఈ కారణంగా 8వ తేదీ దర్శనం కోసం 7వ తేదీ వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ తెలిపింది. 8వ తేదీ నేరుగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు మాత్రమే వీఐపీ బ్రేక్ దర్శనాలకు అనుమతి ఇస్తారు. ఇక, 7వ తేదీ శ్రీవాణి ఆఫ్ లైన్ దర్శనాల సమయాన్ని మధ్యాహ్నం 1 గంటకు మార్పు చేశారు.

ఈ నెల 16వ తేదీ శ్రీవారి ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఉంటుంది. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నేపథ్యంలో 15వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలకు సిఫార్సు లేఖలు స్వీకరించబడవని టీటీడీ ప్రకటించింది.

Also Read: వారికి పెన్షన్లు ఎందుకు? తీసేయండని చెప్పే ధైర్యం ప్రజలకు రావాలి.. సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

Exit mobile version