×
Ad

Vastu Tips: ఇంట్లో వాస్తు దోషాలు ఉన్నాయా? డబ్బు నిలవడం లేదా? ఈ సింపుల్ రెమిడీస్‌తో వాటిని చాలా ఈజీగా తొలగించుకోండి..!

వాస్తులో వేదా దోషాలు ఎక్కువగా ఉంటాయి. ఏ ఇంట్లో అయినా ఎక్కువ సమస్యలు వస్తున్నాయంటే ఆ ఇంటికి వేదా దోషాల ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం. వేదా దోషాలు పలు రకాలు.

Vastu Doshas Representative Image (Image Credit To Original Source)

 

Vastu Tips: ఒక ఇంట్లో వారందరికీ అదృష్టం కలిసి రావాలంటే ఆ ఇంట్లో వాస్తు బాగుండాలి. అయితే, ఏ ఇంటికి కూడా 100 శాతం వాస్తు ఉండదు. ఎక్కడో ఒక చోట వాస్తు దోషాలు ఉండనే ఉంటాయి. మరి వాస్తు దోషాలు పోగొట్టుకోవడం ఎలా? సులభమైన పరిహారాలు ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు తెలుసుకుందాం.

సహజంగా వాస్తు దోషాలు పోవాలంటే ఇంటి గుమ్మంపైన బయటి వైపు వాస్తు హనుమాన్ ఫోటోని ఏర్పాటు చేసుకోవాలి. ఆంజనేయస్వామి వాస్తు పురుషుడిని కాలితో తొక్కి పట్టినట్లుగా ఉండే ఫోటోని వాస్తు హనుమాన్ ఫోటో అంటారు. ఈ ఫోటో పెట్టుకుంటే చాలావరకు వాస్తు దోషాల తీవ్రత తగ్గిపోతుంది. అయితే ఈ ఫోటో చాలా అరుదుగా లభిస్తుంది. అటువంటి సమయంలో ఇంటి గుమ్మానికి కలబందను తలకిందులుగా వేలాడదీసుకోవాలి. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగింపజేసుకోవచ్చు.

వాస్తులో వేదా దోషాలు ఎక్కువగా ఉంటాయి. ఏ ఇంట్లో అయినా ఎక్కువ సమస్యలు వస్తున్నాయంటే ఆ ఇంటికి వేదా దోషాల ప్రభావం ఎక్కువగా ఉందని అర్థం. వేదా దోషాలు పలు రకాలు.

వేదా దోషాల్లో మొట్టమొదటి అందక వేద. అంటే గుడ్డి ఇల్లు. ఏ ఇంటికి అయినా.. గుమ్మానికి రెండు వైపుల కిటీకిలు ఉండాలి. అదే సరైన ఇల్లు. గుమ్మానికి ఒక వైపే కిటికీ ఉంటే దాన్ని అంధక వేద అంటారు. అలా ఉండకుండా చూసుకోవాలి.

రెండో వేదా దోషం బదిర వేద. అంటే మూగ ఇల్లు అని అర్థం. ఇంటికి గుమ్మం పెట్టినప్పుడు ఆ గుమ్మం దగ్గర గడప లేదంటే దాన్ని మూగ ఇల్లు అంటారు. అంటే ఆ ఇంట్లో పాజిటివ్ సౌండ్స్ ఉండవు. ఇంటికి ద్వారం పెట్టేటప్పుడు కచ్చితంగా సింహ ద్వారం దగ్గర గడప ఉండాలి. ఈ రోజుల్లో చాలా మంది ఫ్యాషన్ కోసం మెయిన్ ఎంట్రన్స్ దగ్గర గడప లేకుండా ఎంట్రన్స్ పెడుతున్నారు. దాన్ని మూగ ఇల్లు అంటారు. ఆ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఒక ఇల్లు గుడ్డి ఇల్లు, మూగ ఇల్లు కాకుండా చూసుకోవాలంటే.. ఇంటి గుమ్మానికి రెండు వైపుల కిటికీలు ఉండాలి, మెయిన్ ఎంట్రన్స్ గుమ్మం దగ్గర గడప ఉండాలి.

వాస్తు వేద, ద్వార వేదా దోషాలు..

ఇంటి మెయిన్ ఎంట్రన్స్ కి ఎదురుగా విద్యుత్ స్థంభం వచ్చిందంటే దాన్ని ద్వార వేద అంటారు. ఇంట్లోకి సూర్యరశ్మి వస్తే ఆ ఇంటికి 90శాతం వాస్తు దోషాలు ఉండవు. ఇంటి మెయిన్ ఎంట్రన్స్ కి ఎదురుగా కరెంట్ పోల్ వచ్చినా, చెట్టు వచ్చినా అది సూర్యరశ్మిని ఆపుతుంది. దాని ద్వార వేద అని పిలుస్తారు. అలాంటప్పుడు కలబందను ఇంటికి తలకిందులుగా వేలాడ దీసుకోవాలి.

శబ్ద వేదా దోషం..

కొంతమంది ఇళ్లల్లో తలుపులు మూసినా పెద్ద శబ్దం వస్తుంది, కిటికీలు మూసినా తెరిచినా పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి. అలా రాకూడదు. అలా వస్తే స్వర వేదా దోషం అని పిలుస్తారు. ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక అశాంతి ఉంటుంది. కాబట్టి తలుపులు, కిటికీలు తెరిచేటప్పుడు, మూసే టప్పుడు శబ్దాలు రాకుండా చూసుకోవాలి.

కూప వేద..

చాలామంది తెలియక మెయిన్ ఎంట్రన్స్ కిందే సంప్ ఏర్పాటు చేసుకుంటారు. కూపం అంటే నీళ్లు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ వాటర్ స్టోరేజీ కానీ మెయిన్ ఎంట్రన్స్ కి ముందు ఉండకూడుద. సంప్ కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ మెయిన్ ఎంట్రన్స్ కి ముందు ఉండకూడదు, కొంచెం పక్కకు ఉండాలి. అలా ఉంటే డబ్బులు నిలబడవు. వచ్చిన డబ్బులు వచ్చినట్లు ఖర్చు అయిపోతూ ఉంటాయి. ఇక పక్కింటి వాళ్లు ఇల్లు కడిగినప్పుడు ఆ ఇంటి ఇళ్లు వచ్చి మన ఇంటి ముందు నిలిస్తే అది కూడా దోషమే. అలాంటివి లేకుండా చూసుకోవాలి. ఆ నీటిని మనమే శుభ్రం చేసుకోవాలి.

వాస్తు వేద..

చాలా మంది ఇల్లు కట్టుకుంటారు. వాచ్ మెన్ రూమ్ పెట్టుకుంటారు. వాచ్ మెన్ రూమ్ కరెక్ట్ గా మెయిన్ ఎంట్రన్స్ కి ఎదురుగా పెట్టుకుంటారు. దాన్నే వాస్తు వేద అంటారు. ఎప్పుడూ కూడా వాచ్ మెన్ రూమ్ కానీ స్టోర్ రూమ్ కానీ మెయిన్ ఎంట్రన్స్ (సింహ ద్వారం) ఎదురుగా రాకూడదు. ఆ ఇంట్లో యజమానికి మనశ్శాంతి ఉంగదు. డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది.

ఇక, ఆలయానికి దగ్గరలో ఇల్లు ఉండకూడదు. ఆలయానికి కనీసం 30 అడుగుల దూరంలో ఉండాలి. ఆలయం నీడ మన ఇంటి మీద పడ్డా కొన్ని నెగిటివ్ టెన్షన్స్ ఉంటాయి.

కోన దోషాలు..

ఇంటి మెయిన్ ఎంట్రన్స్ కి ఎగ్జాట్ గా ఎదురింటి వాళ్ల మూలలు వస్తే దాన్ని కోన దోషం అంటారు. అలాంటప్పుడు కూడా కలిసి రాదు. అవన్నీ పోగొట్టుకోవడానికి చాలా సింపుల్ రెమిడీ ఉంది. మెయిన్ ఎంట్రన్స్ కి రెండు వైలపు పూల కుండీలు ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే కోన దోషాలు తొలగిపోతాయి.

ఇక, ఇంట్లో కూడా ఒక్కోవైపు ఒక్కో దోషం ఉంటుంది.

* ఈశాన్యంలో దోషం ఉంటే డబ్బు నిలబడదు
* ఆగ్నేయంలో దోషం ఉంటే ఇంట్లో ఆడవాళ్లకు ఆరోగ్యం బాగోదు
* నైరుతి యజమాని స్థానం. నైరుతిలో తగ్గినా పెరిగినా దోషాలు ఉంటే యజమానికి కలిసిరాదు.
* వాయువ్యం పిల్లల స్థానం. వాయువ్యంలో దోషాలు ఉంటే పిల్లలకు కలిసి రాదు. అప్పులు ఎక్కువ అవుతాయి.

నైరుతిలో దోషం ఉంటే యజమానికి ప్రాబ్లమ్, ఆగ్నేయంలో దోషం ఉంటే యజమానురాలికి సమస్య, వాయువ్యంలో దోషం ఉంటే పిల్లలకు ప్రాబ్లమ్, ఈశాన్యంలో దోషం ఉంటే అదరికీ ప్రాబ్లమ్. డబ్బు నిలబడదు. ఒక్కో దిక్కులో దోషం పోవడానికి ఒక్కో సింపుల్ రెమిడీ పరిహార శాస్త్రంలో చెప్పారు. ఈశాన్యంలో ఏ దోషం లేకుండా ఉండాలంటే అక్కడ రాగి చెంబు ఉండాలి. ఇది మంచి రెమిడీ. ఈశాన్యంలో ఒక పీట ఉంచి దాని మీద ముగ్గు వేసి రాగి చెంబు ఉంచి దానిపై గంధంతో స్వస్తిక్ గుర్తు వేసి అందులో నీళ్లు పోసి పుష్పాలు లేదా తులసీ దళాలు వేయాలి. తరుచుగా అందులోని నీళ్లను మారుస్తూ ఉండాలి. ఇలా చేస్తే ఈశాన్యంలో ఉన్న అన్ని దోషాలు తొలగిపోతాయి.

వాయువ్యంలో దోషాలు పోవాలంటే ఒక గాజుపాత్ర ఉంచాలి. అందులో నీళ్లు పోసి పాలరాయి వేసి ఉంచాలి. వాయువ్య దోషాలు తొలగిపోతాయి, పిల్లలు డెవలప్ అవుతారు, అప్పులు తీరిపోతాయి.

ఆగ్నేయంలో సమస్య ఉంటే.. ఇంట్లో ఆడవారికి ఎప్పుడూ ఆరోగ్య సమస్యలే. అలాంటప్పుడు ఆగ్నేయం వైపు ఎర్రటి పూలు పూచే మొక్కలు పెంచుకోవాలి.

నైరుతి లో దోషాలు పోవాలంటే ఇంటి యజమానికి ఎప్పుడూ సమస్యలే. అలాంటప్పుడు నైరుతి వైపు పసుపు రంగు పూలు పూసే మొక్కలు ఉంచాలి. ఈ సింపుల్ రెమిడీస్ చేసుకుంటే ఇంట్లో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయి. ఒకవేళ వేదా దోషాలు ఉంటే అప్పుడు కలబంద వేలాడదీయాలి, వాస్తు హనుమాన్ ఫోటో పెట్టుకోవాలి.

Also Read: జనవరి 25 రథసప్తమి.. చాలా మంచి రోజు..! ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు, దరిద్రాలు తొలగిపోతాయి..!

NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.