Ratha Sapthami 2026: జనవరి 25 రథసప్తమి.. చాలా మంచి రోజు..! ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు, దరిద్రాలు తొలగిపోతాయి..!

రథసప్తమి సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు వచ్చింది ఈ సంవత్సరం రథసప్తమికి ఇంకా ప్రాధాన్యత ఉంది.

Ratha Sapthami 2026: జనవరి 25 రథసప్తమి.. చాలా మంచి రోజు..! ఇలా స్నానం చేస్తే ఏడు జన్మల పాపాలు, దరిద్రాలు తొలగిపోతాయి..!

Ratha Sapthami 2026 Representative Image (Image Credit To Original Source)

Updated On : January 24, 2026 / 1:24 AM IST

 

  • మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అంటారు
  • రథసప్తమి రోజున ప్రత్యేకమైన స్నానం
  • 7 జన్మల పాపాలు, 7 జన్మల దారిద్ర్యాలు అన్నీ పోగొడుతుంది
  • 7 జిల్లేడు ఆకులు, 7 రేగి పండ్లతో తలస్నానం చేయాలి

Ratha Sapthami 2026: రథసప్తమి పర్వదినం సందర్భంగా స్నానం ఎలా చేస్తే ఏడు జన్మల పాపాలు, ఏడు జన్మల దరిద్రాలు తొలగిపోతాయో.. రథసప్తమి రోజు పూజ ఎలా చేయాలో, రథసప్తమి రోజు ఎటువంటి దానాలు ఇవ్వాలో, రథ సప్తమికున్న ప్రాధాన్యత ఏంటో తెలుసుకుందాం.

ఈ నెల 25న రథసప్తమి. మాఘ మాసంలో శుక్ల పక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమి అనే పేరుతో పిలుస్తారని పండితులు తెలిపారు. ఇది సూర్యుడికి చాలా ఇష్టమైన రోజు. రథ సప్తమి రోజు తెల్లవారుజామున ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు అన్నీ కూడా ఒక రథం ఆకారంలో ఉంటాయి. అందుకే దీన్ని రథసప్తమి అంటారు. రథసప్తమి నుంచి సూర్యుడి రథం దిక్కును మార్చుకుంటుంది. ఉత్తరం దిక్కు వైపు తిరిగి ప్రయాణం చేస్తుంటుంది. అంటే సూర్యుడి గమనంలో కొంత మార్పు జరిగే రోజు. రథసప్తమి నుంచి భూమి మీద ఎండలు బాగా పెరుగుతాయి అన్నది ఇందులోని అంతరార్ధం. ఈ జనవరి 25న ఆదివారంతో కలిసి రథసప్తమి వచ్చింది. రథసప్తమి సూర్యుడికి ఇష్టమైన ఆదివారం నాడు వచ్చింది ఈ సంవత్సరం రథసప్తమికి ఇంకా ప్రాధాన్యత ఉంది.

రథసప్తమి రోజున స్నానం చేయాలి..

రథసప్తమి అంటేనే స్నానానికి ప్రాధాన్యత ఉన్న రోజు. రథసప్తమి రోజున చేసే ప్రత్యేకమైన స్నానం ఏడు జన్మల పాపాలు, ఏడు జన్మల దారిద్ర్యాలు అన్నీ పోగొడుతుందని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి.

రథసప్తమి రోజున అందరూ కూడా తలంటు స్నానం చేయాలి. ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రేగి పండ్లు శిరస్సు మీద ఉంచుకుని తలంటు స్నానం చేయాలి. కొంత మంది ఏడు చిక్కుడు ఆకులు, ఏడు రావి చెట్టు ఆకులు తల మీద ఉంచుకుని స్నానం చేస్తారు. అలా చేసినా మంచిదే. కానీ, ప్రధానంగా జిల్లేడు ఆకులు, రేగి పండ్డు శిరస్సు మీద ఉంచుకుని రథసప్తమి రోజున తల స్నానం చేయాలి. ఏడు ఆకులు, ఏడు పండ్లు ఎందుకు ఉంచుకోవాలంటే ఏడు రకాలైన పాపాలను పోగొట్టే శక్తి రథసప్తమి స్నానానికి ఉంటుంది.

ఆ ఏడు రకాలైన పాపాలు ఏంటంటే.. ఈ జన్మలో చేసిన పాపాలు, జన్మ జన్మాంతరాల్లో చేసిన పాపాలు, తెలిసి చేసిన పాపాలు, తెలియక చేసిన పాపాలు, మనసుతో చేసిన పాపాలు, మాటతో చేసిన పాపాలు, శరీరంతో చేసిన పాపాలు. 7 రకాలైన పాపాలు, వాటి వల్ల వచ్చే దరిద్రాలు అన్నీ పోగొట్టేందుకు ఏడు జిల్లేడు ఆకులు, ఏడు రేగి పండ్లు ఉంచుకుని తల స్నానం చేయాలి. జిల్లేడు ఆకులు, రేగిపండ్లు సూర్యుడికి ఇష్టమైనవి కాబట్టి అలా చేయాలి.

ఆకులు, పండ్లతో ప్రత్యేక స్నానం వెనుక సైన్స్..

ఇందులో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. రథసప్తమి నుంచి సూర్య కిరణ శక్తి వాతావరణంలో ఎక్కువగా ఉంటుంది. జిల్లేడు ఆకుల్లో, రేగి పండ్లలో సూర్య కిరణ శక్తి ఎక్కువగా ఉంటుంది. వాటి తల మీద ఉంచుకుని స్నానం చేస్తే సైంటిఫిక్ గా మనం ఆరోగ్య ప్రాప్తిని కూడా పొందవచ్చు. రథసప్తమి స్నానంలో ఉన్న వైజ్ఞానిక రహస్యం ఇదే.

రథసప్తమి రోజున స్నానం చేసేటప్పుడు కొన్ని శ్లోకాలు చదువుకుని స్నానం చేస్తే అద్భుత ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ప్రధానంగా మూడు శ్లోకాలు చదువుకుంటా రథసప్తమి రోజు స్నానం చేయాలి.

Ratha Saptami 2026

Ratha Saptami 2026 Representative Image (Image Credit To Original Source)

ఆ మూడు శ్లోకాల్లో మొట్టమొదటిది..

యద్ యద్ జన్మ కృతం పాపం మయా జన్మసు సప్తసు తన్మే రోగంచ శోకంచ మాకరీ హంతు సప్తమీ.. (ఈ జన్మలో చేసిన పాపాలు, దాంతో పాటుగా ఏడు జన్మల్లో చేసిన పాపాలు.. వాటి ద్వారా వచ్చిన రోగాలు, శోకాలు పోగొట్టుకోవడానికి నేను ఈ స్నానం చేస్తున్నాను అని చెప్పడం ఈ శ్లోకం అర్థం)

రెండో శ్లోకం..
ఏతజ్జన్మ కృతం పాపం యజ్జన్మాంత రార్జితమ్! మనో వాక్కాయజం యచ్చ జ్ఞాతాజ్ఞాతే చ యే పునః!! (ఈ జన్మలో, జన్మజన్మాంతరాల్లో చేసిన పాపాలతో పాటుగా మనసుతో మాటతో శరీరంతో చేసిన పాపాలు, తెలసీ తెలియక చేసిన పాపాలు..వీటన్నింటిని పోగొట్టుకోవడానికి నేను స్నానం చేస్తున్నా అని చెప్పడమే ఈ రెండో శ్లోకంలోని అర్థం).

మూడో శ్లోకం..
ఇతి సప్త విధం పాపం స్నానాన్మే సప్త సప్తికే!
సప్త వ్యాధి సమాయుక్తం మాకరి హంతు సప్తమీ!!

(ఏడు రకాలైన పాపాలో పోవడానికి రథసప్తమి రోజు స్నానం చేస్తున్నాను. ఈ ఏడు రకాల పాపాల వల్ల, ఏ ఏడు జన్మల్లో పాపాల వల్ల వచ్చే అనారోగ్యాలన్నీ పోగొట్టే శక్తి కలిగున్న సప్తమి తిథి నీకు నమస్కారం స్నానం చేస్తున్నా అని చెప్పడమే ఈ శ్లోకం అర్థం).

స్నానం చేశాక ఏం చేయాలి.. నైవేద్యంగా ఏం పెట్టాలి..

స్నానం చేశాక చిక్కుడు పువ్వులు, చిక్కుడు ఆకులు, చిక్కుడు కాయలు, రకరకాల పుష్పాలు వీటన్నింటి కలిపి ఒక మండపంలాగా సూర్యకిరణాలు పడే ప్రాంతంలో కానీ ఇంట్లో కానీ ఏర్పాటు చేసి అందులో సూర్యుడి ఫోటో ఉంచి పూజ చేయాలి. సూర్యుడి ఫోటో లేదంటే తమలపాకు మీద తడి గంధంతో గుండ్రంగా ఒక రూపు గాసి దాన్ని సూర్యుడిగా భావిస్తూ ఎర్ర పూలు, అకితలు వేస్తూ ఓం సవిత్రే నమ: అని 21సార్లు చదువుకోవాలి. ఇవేమీ చేయలేని వారు సూర్యుడి ప్రీతి కోసం ఆవు పాలతో చేసిన పొంగలి నైవేద్యంగా పెట్టాలి.

రథ సప్తమి రోజు మీరు సూర్యుడికి ఏ పూజలూ చేసుకోలేకపోయినా పర్లేదు. సూర్య కిరణాలు పడే ప్రాంతంలో ఆవు పిడకలు ఉంచి వాటి మీద ఆవు పాలతో చేసిన పొంగలిని తయారు చేసుకుని ఆవు పాలతో చేసిన పొంగలిని చిక్కుడు ఆకుల్లో ఉంచి సూర్యుడికి నైవేద్యం పెట్టాలి. ఇలా ఆవు పిడకల మీద పొంగలి తయారు చేసుకోవడం వీలు కాకపోయినా మామూలుగా అయినా ఆవు పాలతో పొంగలి చేయండి. ఆ పొంగలిని ఒక చిక్కుడు ఆకుల్లో ఉంచి సూర్యుడికి నైవేద్యంగా పెట్టండి. దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తే ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనం కలుగుతుంది.

రథసప్తమి రోజున తప్పకుండా చేయాల్సిన రెండు దానాలు..
రథసప్తమి రోజు అందరూ తప్పకుండా రెండు దానాలు ఇవ్వాలి. మొదటిది గొడుగు, రెండోది చెప్పులు. రథసప్తమి రోజున గొడుగు, చెప్పులు దానం ఇస్తే జన్మజన్మల పాపాలు, దారిద్ర్య బాధల నుంచి సులభంగా బయటపడొచ్చు.

 

NOTE: ఈ విషయాలలో పేర్కొన్న అభిప్రాయాలు, ఆచారాలు పూర్తిగా హిందూ సంప్రదాయాలు, విశ్వాసాలు, సాంస్కృతిక భావనల ఆధారంగా మాత్రమే ఇచ్చాం. కేవలం సమాచారం, సాంస్కృతిక అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. సంపద, దారిద్ర్యం లేదా వ్యక్తిగత ఫలితాల విషయంలో వీటిని సలహాలుగా లేదా హామీగా పరిగణించకూడదు.

 

Also Read: రాహువు రెమెడీస్.. ఇలా చేయండి చాలు.. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది!