Ugadi 2025 : ఉగాది రోజు పూజ ఏ టైమ్ లో చేయాలి?.. ఆ రోజు తప్పకుండా చేయాల్సినవి.. అస్సలు చేయకూడనివి..

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఈ ఉగాది పర్వదినాన్ని సంప్రదాయ బద్దంగా జరుపుకుంటారు.

Ugadi 2025 : తెలుగు నెలల్లో మొదటిది చైత్రమాసం. చైత్రమాసం మొదటి రోజున అంటే పాడ్యమి రోజున కృత యుగం ప్రారంభమైందని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఆ రోజున (2025, మార్చి 30) ఉగాది పండగ జరుపుకుంటాం. ఉడాది పండగతో తెలుగు నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది.

ఉగాది అంటే యుగానికి ఆరంభం. యుగం+ఆది=యుగాది. కాల క్రమేణ ఇది ఉగాదిగా మారింది. ఒక్కో ఏడాది వచ్చే ఉగాదిని ఒక్కో పేరుతో పిలుస్తారు. అంటే ఆసంవత్సరం పేరుతో ఉగాది పండగగా మారింది. ఈ ఏడాది అంటే క్రోధినామ సంవత్సరం మార్చి 29న ముగుస్తుంది. మార్చి 30 నుంచి శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ప్రారంభకానుంది.

ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఈ ఉగాది పర్వదినాన్ని సంప్రదాయ బద్దంగా జరుపుకుంటారు. మరి.. ఉగాది రోజున పూజ ఏ టైమ్ లో చేయాలి? ఆ రోజు తప్పకుండా చేయాల్సినవి.. అస్సలు చేయకూడనివి ఏవి? అనే సందేహం అందరిలోనూ ఉంటుంది.

2025 మార్చి 30.. అనగా శ్రీ విశ్వావసు నామ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి ఆదివారం నాడు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది. ఉదయం 5 గంటల నుంచి 7.30 గంటల వరకు పూజ చేసుకోవచ్చు. ఉదయం 9 గంటల నుంచి 11.30 గంటల లోపల నూతన వస్త్రధారణ, నూతన యజ్ఞోపవీత ధారణ చేయడానికి, ఉగాది పచ్చడి తీసుకోవడానికి శుభ సమయం అని పండితులు చెబుతున్నారు.

Also Read : ITR ఫైలింగ్ అయ్యాక రీఫండ్ ఎప్పటి లోపు వస్తుంది? ఎలా చెక్ చేసుకోవాలి? స్టెప్ బై స్టెప్ ప్రాసెస్

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 3 గంటల లోపల పసుపు, బెల్లం, చింతపండు, బంగారం, వెండి మొదలైన శుభకరమైన వస్తువులు కొనడానికి శుభ సమయం అంటున్నారు.

ఉగాది పర్వదినాన చేయాల్సిన, చేయకూడని పనులు..

ఉగాది పర్వదినాన కొన్ని పనులు అస్సలు చేయకూడదు. లేదంటే దురదృష్టం వెంటాడుతుందని పండితులు చెబుతున్నారు..

* ఉగాదికి ముందు రోజు ఇంటిని శుభ్రం చేయడం మంచిది.
* సాయంత్రం చీపురు పట్టి ఊడవకూడదు.
* అలా చేయడం వల్ల ఇంట్లోకి వచ్చే సంపద బయటకు పోతుందని చెబుతారు.
* ఉగాది రోజును శుభప్రదంగా పరిగణిస్తారు.
* గొడవలు, వాగ్వాదాలు చేయడం లాంటివి చేయకూడదు.
* రుణాలు తీసుకోవడం లేదా ఇతరులకు నగదు అప్పు ఇవ్వడం కూడా చేయకూడదు.
* ఈ పని నూతన సంవత్సరంలో ఆర్థిక సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.
* ఇంట్లోని పాత వస్తువులను ఉగాది ముందు రోజు తొలగించడం మంచిది.
* ఆ రోజు ఉదయం వాటిని విసిరేయడం లేదా కాల్చడం వంటివి చేయరాదు.
* ఇది ఇంటి సంపదను నాశనం చేసినట్లు భావిస్తారు.
* మాంసాహారం తినడం లేదా మద్యం సేవించడం చేయకూడదు.
* జుట్టు కత్తిరించడం లేదా గోళ్లు కత్తిరించడం కూడా చేయరాదు.
* ఇది శుభ శక్తిని తగ్గిస్తుందని నమ్ముతారు.

ఉగాది రోజున చేయాల్సిన ముఖ్యమైన పనులు..
* బ్రాహ్మి ముహూర్తంలో నిద్ర లేవాలి
* పళ్లు తోముకోవాలి, స్నానం చేయాలి
* నువ్వుల నూనెతో ఒళ్లంతా నలుగు పెట్టుకుని స్నానం చేయాలి
* నూతన వస్త్రాలు ధరించాలి
* బొట్టు పెట్టుకోవాలి. పాత, చిరిగిన బట్టలు వేసుకోకూడదు
* కొత్త బట్టలు మంగళకరం
* కొత్త సంతవ్సరం ప్రారంభం కావున ఇంటింట ధ్వజారోహణం చేయాలి. కాషాయ జెండాను ఎగురవేయాలి
* వేప చిగురు తినాలి.