ఇట్స్ రైట్ టైం: బంగారం తగ్గింది.. మరింత పెరగనుందా!

ఇట్స్ రైట్ టైం: బంగారం తగ్గింది.. మరింత పెరగనుందా!

Updated On : January 19, 2020 / 3:52 AM IST

వారంలో చూస్తే.. బంగారం ధరలు దిగొచ్చినట్లే కనిపిస్తుంది. 24 క్యారెట్ల ధర భారీగా క్షీణిస్తే.. 22 క్యారెట్ల ధర మాత్రం స్వల్పంగా తగ్గిస్తుంది. బంగారం పడిపోతుంటే వెండి మాత్రం వ్యతిరేకంగా పెరుగుతూ వస్తుంది. హైదరాబాద్ మార్కెట్‌లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర ఈ వారాంతంలో దిగొచ్చింది. సోమవారం రూ.42వేల 50గా ఉన్న బంగారం ధర శనివారం నాటికి రూ.41వేల 50కు తగ్గింది. అంటే వెయ్యి రూపాయలు తగ్గిపోయినట్లే. 

బంగారం ధర వెలవెలబోతూ ఉంటే కేజీ వెండి ధర మాత్రం ర్యాలీ చేసింది. వారం ఆరంభంలో రూ.49వేల 150గా ఉన్న వెండి ధర శనివారం చివరకు వచ్చేసరికి రూ.49వేల 400కు ఎగసింది. అంటే వెండి ధర రూ.250 పైకి కదిలింది.

అదేసమయంలో 22 క్యారెట్ల బంగారం ధర కూడా తగ్గింది. 24 క్యారెట్ల బంగారం స్థాయిలో ధర పడిపోలేదు. వారం ఆరంభంలో రూ.38వేల 200 వద్ద ఉన్న 10 గ్రాముల బంగారం ధర శనివారం నాటికి రూ.రూ.38వేల 90కు చేరింది. అంటే రూ.110 దిగొచ్చింది.

అమెరికా డాలర్‌తో పోలిస్తే ఇండియన్ రూపాయి పడిపోవడం కూడా బంగారం ధర పెరుగుదలకు దోహదపడింది. అమెరికా-చైనా మధ్య ఫస్ట్ స్టెప్ కమర్షియల్ డీల్, అంతర్జాతీయ భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టడంతో వారం ఆరంభంలోనే బలహీనంగా కనిపించిన పసిడి ధర చివర్లో పుంజుకుంది. పసిడి ధర పెరగడంతో పాటు దేశీ మార్కెట్‌లో జ్యూవెలర్లు, కొనుగోలుదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడంతో బంగారం ధర పైకి కదిలింది.