2025 Ather 450 Launch : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? 2025 ఏథర్ 450 రేంజ్ స్కూటర్ వచ్చేసింది.. ఫీచర్లు, ధర ఎంతో తెలుసా?
2025 Ather 450 Launch : కొత్త అవతార్‌లో 450 లైనప్ భద్రతా పరికరాలతో సహా అనేక కొత్త అప్‌డేట్‌లను పొందుతుంది. వేరియంట్ వారీగా 2025 ఏథర్ 450 ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.

2025 Ather 450 Launch
2025 Ather 450 Launch : కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారత మార్కెట్లోకి సరికొత్త ఏథర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేసింది. ప్రముఖ ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ 2025 ఏథర్ 450ని లాంచ్ చేసింది. ఈ ఏథర్ స్కూటర్ రూ. 1,29,999 (ఎక్స్-షోరూమ్) ప్రారంభ ధర వద్ద అందబాటులో ఉంది.
450 రేంజ్-టాపింగ్ వేరియంట్, ఏథర్ 450 అపెక్స్, ఇప్పుడు రూ. 1,99,999 (ఎక్స్-షోరూమ్, ప్రో ప్యాక్‌తో సహా) వద్ద కొనుగోలు చేయొచ్చు. కొత్త అవతార్‌లో 450 లైనప్ భద్రతా పరికరాలతో సహా అనేక కొత్త అప్‌డేట్‌లను పొందుతుంది. వేరియంట్ వారీగా 2025 ఏథర్ 450 ధరలు (ఎక్స్-షోరూమ్) ఈ కింది విధంగా ఉన్నాయి.
Read Also : Apple iPhone 17 Launch : భారీ అప్‌గ్రేడ్‌లతో ఆపిల్ ఐఫోన్ 17 వచ్చేస్తోంది.. మునుపెన్నడూ చూడని ఫీచర్లు..!
- 2025 ఏథర్ 450S : ధర రూ. 1,29,999
- 2025 ఏథర్ 450X 2.9kWh : ధర రూ 1,46,999
- 2025 ఏథర్ 450X 3.7kWh : ధర రూ 1,56,999
- 2025 450 అపెక్స్ : ధర రూ 1,99,999 (ప్రో ప్యాక్)
2025 ఏథర్ 450ఎక్స్, ఏథర్ 450 అపెక్స్ మోడల్‌లు మల్టీ-మోడ్ ట్రాక్షన్ కంట్రోల్‌ను కలిగి ఉన్నాయి. తక్కువ-ఘర్షణ ఉపరితలాలపై స్కూటర్ జారిపోకుండా నిరోధించేలా రైడర్ భద్రతకు ఈ ఫీచర్ ప్రయోజనకరంగా ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ బ్యాక్ టైర్ల వేగాన్ని ఫ్రంట్‌తో సింకరైజ్ చేసి జారకుండా నివారిస్తుంది. అయితే, రైడర్లు 3 విభిన్న మోడ్‌ల నుంచి ఎంచుకోవచ్చు. రెయిన్ మోడ్, రోడ్ మోడ్, ర్యాలీ మోడ్ ఉన్నాయి.
రెయిన్ మోడ్ గరిష్ట భద్రతకు, తడి, జారే ఉపరితలాలపై గట్టి పట్టు కోసం స్లిప్‌ను తగ్గిస్తుంది. రహదారి మోడ్ భద్రత పర్ఫార్మెన్స్ మధ్య సమతుల్యతను అందిస్తుంది. రోజువారీ రైడింగ్‌కు అనువైనది. ర్యాలీ మోడ్ ఆఫ్-రోడ్ ఔత్సాహికుల కోసం రూపొందించారు. నియంత్రిత స్లిప్‌ను అందిస్తోంది. ఈ ఫీచర్ రైడర్ భద్రతను మెరుగుపరుస్తుంది. పర్ఫార్మెన్స్ సామర్థ్యాన్ని అన్‌లాక్ చేస్తుంది. ఏ పరిస్థితిలోనైనా స్కూటర్ వినియోగంపై కంట్రోలింగ్ అందిస్తుంది.
ఏథర్ పరిధిని పెంచడంపై కూడా దృష్టి సారించింది. 2025 ఏథర్ 450లో ఎంఆర్ఎఫ్‌తో అభివృద్ధి చేసిన మల్టీ-గ్రూపు టైర్‌లను ప్రవేశపెట్టింది. అదనంగా, మ్యాజిక్ ట్విస్ట్ వంటి ఫీచర్ల ద్వారా పవర్ వినియోగాన్ని ఆప్టిమైజేషన్ చేసింది. బ్రేకింగ్ మొత్తం పరిధిని పెంచుతుంది. దాంతో పవర్ నష్టాన్ని తగ్గిస్తుంది.

2025 Ather 450 Launch
ఏథర్ 450X 3.7kWh (ఐడీసీ పరిధి 161కి.మీ) 450 అపెక్స్ (ఐడీసీ పరిధి 157కి.మీ)లో ట్రూరేంజ్‌లలో 130కి.మీ వరకు అప్‌గ్రేడ్ ఉందని కంపెనీ పేర్కొంది. 450ఎక్స్ 2.9kWh (ఐడీసీ పరిధి 126కి.మీ) ఏథర్ 450ఎస్ (ఐడీసీ పరిధి 122కి.మీ) కూడా ఇప్పుడు 105కి.మీ వరకు మెరుగైన ట్రూరేంజ్ అందిస్తాయి.
ఏథర్ 450ఎక్స్ మ్యాజిక్‌ట్విస్ట్ ఫీచర్లు :
మ్యాజిక్‌ట్విస్ట్.. గతంలో 450 అపెక్స్, రిజ్టా జెడ్‌తో ప్రారంభమైన ఫీచర్ ఇప్పుడు 2025 450Xలో కూడా అందుబాటులో ఉంటుంది. మ్యాజిక్‌ట్విస్ట్ రైడర్ సౌలభ్యం, కంట్రోలింగ్ ఫీచర్ కలిగి ఉంది. రైడర్‌ను థొరెటల్ ద్వారా మాత్రమే వాహన వేగాన్ని మాడ్యులేట్ చేసేందుకు అనుమతిస్తుంది. మ్యాజిక్‌ట్విస్ట్ థొరెటల్ రైడర్‌ను వేగవంతం చేసేందుకు అన్ని ఛార్జ్ స్థాయిలలో క్షీణతను మాడ్యులేట్ కోసం రివర్స్ డైరెక్షన్‌లో ట్విస్ట్ చేసేందుకు అనుమతిస్తుంది.
2025 ఏథర్ 450 ఏథర్‌స్టాక్ 6 ద్వారా అందిస్తుంది. ఏథర్ సాఫ్ట్‌వేర్ ఇంజిన్ లేటెస్ట్ వెర్షన్, గూగుల్ మ్యాప్స్, అలెక్సా, డ్యాష్‌బోర్డ్‌లో వాట్సాప్ నోటిఫికేషన్, లొకేషన్ కోసం ‘పింగ్ మై స్కూటర్’, లైవ్ లొకేషన్ షేరింగ్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది.
ఏథర్ ప్రస్తుతం రెండు ప్రొడక్టులను కలిగి ఉంది. ఏథర్ 450 (450ఎస్, 450ఎక్స్, 450 అపెక్స్), రిజ్టా (రిజ్టా జెడ్, రిజ్టా ఎస్) మోడల్స్ ఉన్నాయి. 2025 450 రేంజ్ కొత్త ఎయిట్70 వారంటీ కింద కవర్ అవుతుంది. 8 ఏళ్ల వరకు లేదా 80వేల కి.మీ వరకు కవరేజీని అందిస్తుంది. ఏది మొదట వచ్చినా, 8 ఏళ్ల వరకు 70శాతం బ్యాటరీ హెల్త్ హామీని అందిస్తుంది.
ఇతర అదనపు ప్రయోజనాలతో పాటు 2025 450ఎక్స్ స్కూటర్ 2.9kWh ఇప్పుడు ఏథర్ డ్యూయోతో వస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఛార్జింగ్ సమయం సున్నా శాతం నుంచి 80శాతంతో 3 గంటలకు పూర్తి అవుతుంది. ఏథర్ స్మార్ట్ హెల్మెట్ హాలో కూడా ఇప్పుడు 450 అపెక్స్‌తో వస్తుంది.