Jeep Meridian Bookings : 5-సీటర్ 2025 జీప్ మెరిడియన్ వస్తోంది.. వచ్చేవారమే లాంచ్.. బుకింగ్స్ ఓపెన్..!
Jeep Meridian Bookings : టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్-పోటీదారు అప్‌డేటెడ్ వెర్షన్ 2025 జీప్ మెరిడియన్ వచ్చే వారమే భారత మార్కెట్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు.

2025 Jeep Meridian bookings open, launch next week ( Image Source : Google )
Jeep Meridian Bookings : ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం జీప్ ఇండియా నుంచి సరికొత్త మోడల్ 2025 జీప్ మెరిడియన్ వచ్చేస్తోంది. భారత మార్కెట్లోకి వచ్చే వారమే ఈ కొత్త జీప్ లాంచ్ కానుంది. అంతకంటే ముందుగానే జీప్ మెరిడియన్ బుకింగ్స్ మొదలయ్యాయి. టయోటా ఫార్చ్యూనర్, ఎంజీ గ్లోస్టర్-పోటీదారు అప్‌డేటెడ్ వెర్షన్ 2025 జీప్ మెరిడియన్ వచ్చే వారమే భారత మార్కెట్లో లాంచ్ కానుందని భావిస్తున్నారు. 2025 మోడల్ 2.0-లీటర్, 4-సిలిండర్, టర్బో-డీజిల్ ఇంజిన్‌ను ఉపయోగిస్తోంది. 168పీహెచ్‌పీ 350ఎన్ఎమ్ ఉత్పత్తి చేస్తుంది.
ఈ ఇంజన్ 9-స్పీడ్ ఆటోమేటిక్ లేదా 6-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో వస్తుంది. ఎస్‌యూవీ 4X2, 4X4 ఆప్షన్లను కలిగి ఉంటుంది. ఎస్‌యూవీ 4×4 సిస్టమ్ సెలెక్-టెర్రైన్‌ను కలిగి ఉంది. ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డంపింగ్ (FSD) సస్పెన్షన్ సిస్టమ్‌ను పొందుతుంది.
ఎస్‌యూవీ ఆకట్టుకునే 203ఎమ్ఎమ్ గ్రౌండ్ క్లియరెన్స్, 406ఎమ్ఎమ్ వాటర్-వేడింగ్ సామర్థ్యాన్ని కలిగి ఉంది. 2025 జీప్ మెరిడియన్ 5-సీటర్, 7-సీటర్ కాన్ఫిగరేషన్‌లను కలిగి ఉంది. 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్, 10.2-అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, 9-స్పీకర్ ఆల్పైన్ సిస్టమ్, వైర్‌లెస్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంది.
ఎస్‌యూవీ యూకనెక్ట్ సర్వీసులను కలిగి ఉంది. అలెక్సా హోమ్-టు-ఎస్‌యూవీ కంట్రోల్, ఏసీ ప్రీ-కండిషన్‌తో రిమోట్ ఇంజిన్, ఆటో ఎస్ఓఎస్, జియో-ఫెన్సింగ్, రిమోట్ వెహికల్ మానిటరింగ్‌తో సహా 30కి పైగా కనెక్ట్ చేసిన రిమోట్ ఫీచర్‌లను అందిస్తోంది. జీప్ మెరిడియన్‌లో అడాస్‌ను అందిస్తోంది.
అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, రిలీఫ్ బ్రేకింగ్‌తో సహా 70కి పైగా భద్రతా ఫీచర్లను అందిస్తోంది. అవుట్‌గోయింగ్ జీప్ మీడియన్ ధర రూ. 31.23 లక్షల నుంచి రూ. 39.83 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉండగా, రాబోయే మోడల్ కొంచెం ప్రీమియంతో వస్తుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు.