2025 Yamaha Aerox 155
2025 Yamaha Aerox 155 : కొత్త బైక్ కొనేవారికి గుడ్ న్యూస్.. ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం యమహా భారత మార్కెట్లో 2025 ఏరోక్స్ 155ను ఆవిష్కరించింది. రెండు అద్భుతమైన కొత్త కలర్ ఆప్షన్లను ప్రవేశపెట్టింది.
రేసింగ్ బ్లూ, ఐస్ ఫ్లూ వెర్మిలియన్, రిఫ్రెష్డ్ బాడీ గ్రాఫిక్స్‌తో పాటు అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉంది. ఈ పవర్‌ఫుల్ షేడ్స్ సిటీ రైడర్‌లకు అనుకూలంగా ఉంటుందని బ్రాండ్ పేర్కొంది.
Read Also : Vivo V50 Lite 5G : అమెజాన్ బంపర్ డిస్కౌంట్.. అతి తక్కువ ధరకే వివో V50 లైట్ 5జీ ఫోన్.. ఇప్పుడే కొనేసుకోండి!
ఇప్పటికే ఉన్న మెటాలిక్ బ్లాక్ వేరియంట్‌లో చేరింది. అదనంగా, మొత్తం ఏరోక్స్ 155 లైనప్ ఇప్పుడు లేటెస్ట్ OBD-2B ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది.
డిజైన్, స్టైలింగ్ అప్‌డేట్స్ :
2025 ఏరోక్స్ 155 సైడ్ ఫెయిరింగ్స్, బాడీ ప్యానెల్‌లపై అప్‌డేట్ చేసిన గ్రాఫిక్‌లతో స్పోర్టి, రేస్ ఆప్షన్లతో వస్తుంది. సిగ్నేచర్ ఎక్స్ సెంటర్ మోటిఫ్ స్టైలింగ్‌ను అప్‌గ్రేడ్ చేస్తుంది. మ్యాక్సీ-స్కూటర్ విభాగంలో ప్రత్యేకంగా నిలుస్తుంది.
పర్ఫార్మెన్స్, ఫీచర్లు :
ఈ స్కూటర్ 155cc, లిక్విడ్-కూల్డ్, సింగిల్-సిలిండర్, ఫ్యూయల్-ఇంజెక్టెడ్ ఇంజిన్‌తో పనిచేస్తుంది. యమహా R15, యమహా MT-15 మోటార్‌సైకిళ్ల మాదిరిగా ఉంటుంది.
8,000 rpm వద్ద 15 PS
6,500 rpm వద్ద 13.9 Nm టార్క్
వివిధ RPM రేంజ్‌లలో పవర్ సప్లయ్ కోసం ఇంజిన్ వేరియబుల్ వాల్వ్ యాక్చుయేషన్ (VVA)తో అమర్చి ఉంటుంది. ట్రాక్షన్ కంట్రోల్ సిస్టమ్ (TCS), యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ABS) ద్వారా సేఫ్టీని అందిస్తోంది.
కీలక అప్‌గ్రేడ్‌లు, ధర ఎంతంటే? :
యమహా ఏరోక్స్ వెర్షన్ S వేరియంట్ ఇప్పుడు యమహా స్మార్ట్ కీ సిస్టమ్‌ను కలిగి ఉంది. అదనపు సౌలభ్యం కోసం కీలెస్ ఇగ్నిషన్‌ను అనుమతిస్తుంది. కొత్త కలర్ ఆప్షన్లలో ధరలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ఈ కింది విధంగా ఉన్నాయి.
రేసింగ్ బ్లూ, ఐస్ ఫ్లూ వెర్మిలియన్ : రూ. 1,53,430
మెటాలిక్ బ్లాక్: రూ. 1,50,130
ఏరోక్స్ 155 దేశవ్యాప్తంగా యమహా బ్లూ స్క్వేర్ డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంది.
ఇటీవలే, యమహా భారత్‌లో FZ-S Fi హైబ్రిడ్‌ను కూడా ప్రవేశపెట్టింది. యమహా ధర రూ. 1.44 లక్షలు (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది.
ఇందులో మోటార్-జనరేటర్ హైబ్రిడ్ సిస్టమ్ , యమహా Y-కనెక్ట్ యాప్ ఇంటిగ్రేషన్‌తో 4.2-అంగుళాల TFT డిస్‌ప్లే , టర్న్-బై-టర్న్ నావిగేషన్, ఇతర ప్రీమియం అప్‌డేట్‌లు ఉన్నాయి.