ఈపీఎస్‌ 650 శాతం పెరిగే అవకాశం? పెన్షన్‌ పెంపుపై కేంద్ర సర్కారు ఏమందంటే?

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రూ.1000 కనీస పెన్షన్‌ సరిపోదని పెన్షన్‌దారులు అంటున్నారు. పెన్షన్ పెంపుపై అనుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి.

ఈపీఎస్‌ 650 శాతం పెరిగే అవకాశం? పెన్షన్‌ పెంపుపై కేంద్ర సర్కారు ఏమందంటే?

EPF

Updated On : July 29, 2025 / 5:44 PM IST

ఉద్యోగుల పెన్షన్ పథకం (EPS)-1995 కింద ఇస్తున్న నెలవారీ కనీస పెన్షన్‌ను పెంచాలని అనేక అభ్యర్థనలు వచ్చినట్లు 2025 జూలై 24న కార్మిక శాఖ తెలిపింది. ప్రస్తుతం ఈ పెన్షన్‌ రూ.1000గా ఉంది. రాజ్యసభలో దీనికి సంబంధించి వచ్చిన ప్రశ్నలకు కేంద్ర కార్మిక శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే రాజ్యసభలో లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు.

EPS-95ను సామాజిక భద్రతా పథకంగా స్పష్టం చేశారు. ఉద్యోగి పనిచేస్తున్న సంస్థ అతడి జీతంపై 8.33 శాతం ఇస్తుంది. నెలకు రూ.15,000 వరకు మాత్రమే జీతం ఉన్నవారికి కేంద్ర సర్కారు కూడా ఉద్యోగి జీతంపై 1.16 శాతం ఇస్తుంది.

అయితే, 2019 మార్చి 31 నాటికి చేసిన గణాంకాల అంచనాల్లో ఈ నిధిలో లోటు ఉన్నట్లు తేలింది. ఇది పెన్షన్ పెంపులో ప్రధాన అడ్డంకిగా మారవచ్చని కేంద్రం స్పష్టం చేసింది. ఈ లోటు ఉన్నా కూడా ప్రభుత్వం రూ.1000 నెలవారీ కనీస పెన్షన్‌ను కొనసాగిస్తోంది.

అనేక కార్మిక సంఘాలు, సంబంధిత వర్గాలు నెలవారీ పెన్షన్‌ను రూ.7,500 (650 శాతం) పెంచాలని కోరుతున్నాయి. ఇది ద్రవ్యోల్బణం, వైద్య ఖర్చులు, జీవన వ్యయానికి సరిపోతుందని చెబుతున్నారు.

Also Read: చదువుకున్న వాళ్లకు రూ.4 వేలు ఇస్తూ వీర్యాన్ని సేకరించిన “సృష్టి” టెస్ట్ ట్యూబ్ సెంటర్‌.. దంపతుల ఆర్థిక స్తోమతను బట్టి వసూళ్లు

రాజ్యసభలో మంత్రి నాలుగు ముఖ్య ప్రశ్నలకు స్పందించారు. ఈ ప్రశ్నలు 1.పెన్షన్ పెంపు డిమాండ్‌పై ప్రభుత్వం చాలాకాలంగా దృష్టి పెట్టిందా? 2.కార్మిక సంఘాలు, కోర్టుల నుంచి ఒత్తిడి వస్తోంది. ప్రభుత్వం ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది? 3.ఈ పథకం కింద క్లెయిమ్ చేయని నిధులు ఉన్నప్పటికీ ఈపీఎఫ్‌ పెన్షన్ పెంచడానికి అడ్డు వస్తున్న సమస్యలేంటి? 4.రానున్న పండుగల కాలాన్ని దృష్టిలో పెట్టుకుని నిర్ణయాన్ని త్వరితగతిన తీసుకుంటారా?

ఈ ప్రశ్నలకు కరంద్లాజే సమాధానం ఇస్తూ.. అభ్యర్థనలు వచ్చాయని, ఈపీఎఫ్ నిధిలో లోటు, బడ్జెట్ పరిమితులు ప్రధానమైన అడ్డంకులుగా ఉన్నట్లు చెప్పారు. అయినా, భవిష్యత్తులో పెంచే అవకాశం లేకపోలేదని తెలిపారు. రూ.1000 కనీస పెన్షన్‌ను 2014 సెప్టెంబర్ 1న నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో అమలు చేశారు. అప్పటి నుంచి పెన్షన్ పెంపు జరగలేదు.

ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో రూ.1000 కనీస పెన్షన్‌ సరిపోదని పెన్షన్‌దారులు అంటున్నారు. పెన్షన్ పెంపుపై అనుకూల ప్రకటన వచ్చే అవకాశం ఉందని ఊహాగానాలు వస్తున్నాయి.