8th Pay Commission : 8వ వేతన సంఘంపై బిగ్ అప్డేట్.. కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు పండగే.. భారీగా పెరగనున్న జీతాలు, పెన్షన్లు!
8th Pay Commission Update : 8వ వేతన సంఘానికి సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి కమిటీ వేతన నిర్మాణాన్ని సమీక్షించి నిర్దిష్ట సమయంలోగా నివేదికను సమర్పించనున్నట్టు తెలిపారు.
8th Pay Commission Update
- 8వ వేతన సంఘంపై కీలక అప్డేట్
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీగా ప్రయోజనాలు
- లక్షలాది మందికి 34 శాతం పెరగనున్న జీతాలు, పెన్షన్లు
- 1.10 కోట్లకుపైగా ఉద్యోగులు, పింఛనుదారులకు నేరుగా ప్రయోజనం
8th Pay Commission Update : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు భారీ గుడ్ న్యూస్.. 8వ వేతన సంఘానికి సంబంధించి కీలక అప్డేట్ బయటకు వచ్చింది. ఈ వేతన సంఘం అమల్లోకి వస్తే.. ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు, వేతనాలు భారీగా పెరగనున్నాయి.
నివేదికల ప్రకారం.. మోదీ ప్రభుత్వం త్వరలో 8వ వేతన సంఘాన్ని అమలు చేసే అవకాశం ఉంది. జనవరి 2026 నుంచి లక్షలాది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, అలవెన్సులు భారీగా పెరగనున్నాయి.
30 శాతం నుంచి 34 శాతం పెరిగే అవకాశం :
2025 నవంబర్ 3న ప్రభుత్వం 8వ కేంద్ర వేతన సంఘాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇదే విషయాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ పార్లమెంటులో ధృవీకరించింది. దీనిపై ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి మాట్లాడుతూ.. ఈ కమిటీ వేతన నిర్మాణాన్ని సమీక్షించి నిర్దిష్ట సమయంలోగా నివేదికను సమర్పిస్తుందని అన్నారు. జీతం, భత్యాలు, పెన్షన్ వంటి వివిధ అంశాలపై కమిషన్ ఏర్పాటు జరిగిన 18 నెలల్లోగా సిఫార్సులను సమర్పిస్తుందని చౌదరి తెలిపారు.
8వ వేతన సంఘం అమలుతో ప్రభుత్వ జీతాలు, పెన్షన్లు 30 నుంచి 34 శాతం వరకు పెరగనున్నాయి. 1.10 కోట్లకుపైగా ఉద్యోగులు, పింఛనుదారులు నేరుగా ప్రయోజనం పొందుతారు. ‘ఫిట్మెంట్ ఫ్యాక్టర్’లో మార్పులతో గత పే కమిషన్ల జీతాల పెంపు కన్నా ఎక్కువగా లేదా కనీసం సమానంగా ఉండేలా జీతాల పెంపు ఉండొచ్చునని నిపుణులు భావిస్తున్నారు.
49 లక్షల ఉద్యోగులు, 68 లక్షల పెన్షనర్లు :
నివేదికల ప్రకారం.. ‘ఫిట్మెంట్ ఫ్యాక్టర్’ను 2.57గా నిర్ణయించాలని కమిషన్ భావిస్తోంది. ఇదే జరిగితే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల జీతాలు భారీగా పెరుగుతాయి. ఆమోదం తర్వాత సుమారు 49 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లు ప్రయోజనం పొందుతారు.
‘ఫిట్మెంట్ ఫ్యాక్టర్’ అనేది ఉద్యోగి ప్రాథమిక జీతాన్ని నిర్ణయించే విధానం. ఇది పెరిగితే బేసిక్ పే కూడా భారీగా పెరుగుతుంది. ఫలితంగా, కనీస వేతనం పెరిగి కరువు భత్యం, ఇంటి అద్దె భత్యం వంటి అలవెన్సులు కూడా పెరుగుతాయి. 8వ వేతన సంఘం నవంబర్ 2025లో ఏర్పాటు అయింది. నివేదికను సమర్పించేందుకు ఈ సంఘానికి 18 నెలల గడువు ఉంది. సంఘం సిఫార్సులు జూన్ 2027 నాటికి అందుతాయని భావిస్తున్నారు.
