Samsung Galaxy S25 FE : శాంసంగ్ ఫ్యాన్స్ ఎగిరిగంతేసే ఆఫర్.. ఈ ప్రీమియం S25 FE ఫోన్ చాలా చీప్ గురూ.. జస్ట్ ఎంతంటే?
Samsung Galaxy S25 FE : శాంసంగ్ గెలాక్సీ S25 సిరీస్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 FE ప్రీమియం ఫోన్ అత్యంత సరసమైన ధరకే లభిస్తోంది. కెమెరా సిస్టమ్, పవర్ఫుల్ ప్రాసెసర్ ఉన్నాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Samsung Galaxy S25 FE : శాంసంగ్ అభిమానులకు అదిరిపోయే ఆఫర్.. కొత్త శాంసంగ్ గెలాక్సీ ఫోన్ కొంటున్నారా? మీకోసం అద్భుతమైన డిస్కౌంట్.. గెలాక్సీ S25 లైనప్‌లో అతి చౌకైన ధరకే శాంసంగ్ కొనేసుకోవచ్చు. ఈ ప్రీమియం ఫోన్ మంచి కెమెరా సిస్టమ్, పవర్ఫుల్ ప్రాసెసర్ వంటి మరెన్నో ఫీచర్లు ఉన్నాయి.

ఈ శాంసంగ్ ఫోన్‌ను కొనాలని చూస్తుంటే ఇదే బెస్ట్ టైమ్. అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకే ఈ శాంసంగ్ ఫోన్ సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్ 25 ఎఫ్ఈ ఫోన్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లను ఓసారి పరిశీలిద్దాం..

అమెజాన్‌లో శాంసంగ్ గెలాక్సీ S25 FEపై తగ్గింపు : 128GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో 8GB ర్యామ్ వేరియంట్ అసలు ప్రారంభ ధర రూ. 59,999 నుంచి తగ్గి అమెజాన్ ఇండియాలో రూ. 50,749కి కొనుగోలు చేయవచ్చు.

మరోవైపు, అమెజాన్ పే ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్ యూజర్లందరూ రూ. 1,522 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. రూ. 50వేల లోపు ధరకే వస్తుంది. నేవీ, జెట్‌బ్లాక్ అనే 2 వంటి కలర్ ఆప్షన్లలో లభిస్తుంది.

శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు : శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, 1900 నిట్స్ టాప్ బ్రైట్ నెస్‌తో 6.7-అంగుళాల డైనమిక్ ఎల్టీపీఓ అమోల్డ్ 2x డిస్ప్లేతో వస్తుంది. ఈ ప్యానెల్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్లస్ ద్వారా ప్రొటెక్షన్ అందిస్తుంది.

ఈ స్మార్ట్‌ఫోన్, శాంసంగ్ సొంత ఎక్సినోస్ 2400 ప్రాసెసర్‌పై రన్ అవుతుంది. ఎక్లిప్స్ 940 గ్రాఫిక్స్ ప్రాసెసింగ్ యూనిట్ (GPU)తో వస్తుంది.

ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. శాంసంగ్ 7 మెయిన్ ఆండ్రాయిడ్ అప్గ్రేడ్లతో వస్తుంది. శాంసంగ్ గెలాక్సీ S25 ఎఫ్ఈ ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో వస్తుంది.

ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో 50MP ప్రైమరీ సెన్సార్, 123 డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 12MP అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్, 8MP టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి.

సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12MP ఫ్రంట్ స్నాపర్ కూడా వస్తుంది. ఈ శాంసంగ్ ఫోన్ 4900mAh బ్యాటరీతో పాటు 45W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తుంది.
