Gautam Adani Assets Doubled : ఏడాది కాలంలోనే రెట్టింపైన అదానీ ఆస్తులు..ప్రపంచ అత్యంత సంపన్నుల్లో మూడో స్థానం

అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ ఆస్తులు ఏడాది కాలంలోనే రెట్టింపు స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా గత రెండేళ్ళలో ఆయన సంపద ఏడున్నర రెట్లకు పైగా వృద్ధి చెందింది. ఇదే సమయంలో అంబానీ ఆస్తులు మాత్రం కేవలం 10శాతం పెరిగాయి. గత పదేళ్ళ డేటా చూస్తే 2020 వరకు ఓ మోస్తారుగా పెరిగిన అదానీ లాభాలు గత రెండేళ్ళలో ఊహించని స్థాయిలో ఆకాశమే హద్దుగా ఎగబాకాయి.

Adani Briefly Becomes World’s Second Richest Person, As Per Forbes’ Real Time Billionaires List

Gautam Adani Assets Doubled : అదానీ గ్రూప్‌ అధినేత గౌతమ్‌ అదానీ ఆస్తులు ఏడాది కాలంలోనే రెట్టింపు స్థాయిలో పెరిగాయి. ముఖ్యంగా గత రెండేళ్ళలో ఆయన సంపద ఏడున్నర రెట్లకు పైగా వృద్ధి చెందింది. ఇదే సమయంలో అంబానీ ఆస్తులు మాత్రం కేవలం 10శాతం పెరిగాయి. గత పదేళ్ళ డేటా చూస్తే 2020 వరకు ఓ మోస్తారుగా పెరిగిన అదానీ లాభాలు గత రెండేళ్ళలో ఊహించని స్థాయిలో ఆకాశమే హద్దుగా ఎగబాకాయి. దీంతో వరల్డ్‌ టాప్‌-3 రిచెస్ట్‌ పర్సన్స్‌లో ఒకరిగా నిలిచారు గౌతమ్‌ అదానీ. ఆసియా ఖండం తరపున ఈ స్థాయికి చేరుకున్న మొట్టమొదటి వ్యక్తి కూడా ఆయనే. భారత కుబేరుడు ముకేశ్‌ అంబానీకి, చైనా సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌మెన్‌ జాక్‌మాకు కూడా సాధ్యం కాని రికార్డును కేవలం అదానీ రెండేళ్ళలోనే సాధించడం విశేషం.

2012లో అదాని సంపద కేవలం 3.1 బిలియన్‌ డాలర్లు మాత్రమే. ఇదే సమయంలో ముకేశ్‌ అంబానీ ఆస్తులు అదానీ కంటే ఆరు రెట్లు అధికంగా ఉన్నాయి. 2012లో ముకేశ్‌ అంబానీ సంపద 18.7 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2013లో అదానీ ఆస్తుల విలువ తగ్గినప్పటికీ ముకేశ్‌ అంబానీ వెల్త్‌లో మాత్రం జోరు కొనసాగింది. 2013లో అదానీకి కంటే ముకేశ్‌ ఆస్తులు ఏడు రెట్లకు పైగా నమోదయ్యాయి. 2013లో అంబానీ ఆస్తులు 19.1 బిలియన్‌ డాలర్లు కాగా అదానీ ఆస్తులు 2.7 బిలియన్‌ డాలర్లుగా ఉన్నాయి. ఈక్విటీ మార్కెట్లో బుల్‌ రంకెలు వేయడంతో ఎన్నికల సంవత్సరం 2014లో ఆస్తులు దాదాపు రెండున్నర రెట్లు పెరగడం అదాని గ్రూప్‌ను ఉత్సాహపరించింది.

Gautam Adani: ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానానికి దూసుకెళ్లిన గౌతమ్ అదానీ.. ఆసియా నుంచి మొదటి వ్యక్తి అతనే

అదానీ ఆస్తులు 7.3 బిలియన్‌ డాలర్లకు ఎగబాకాయి. ఇక ముకేశ్‌ అంబానీ ఆస్తులు కూడా దాదాపు 43 శాతం పెరిగాయి. అదానీ వెల్త్‌ భారీగా పెరగడంతో ఈ ఇద్దరి వ్యాపార దిగ్గజాల వెల్త్‌ తారతమ్యం భారీగా తగ్గింది. అయినా అంబానీదే పైచేయి. అదానీతో పోలిస్తే అంబానీ ఆస్తులు మూడున్నర రెట్లు అధికంగా ఉన్నాయి. 2015లో అదానీ ఆస్తులు స్వల్పంగా పెరిగి 7.9 బిలియన్‌ డాలర్లకు చేరాయి. ముకేశ్‌ అంబానీ సంపద మాత్రం 27.3 బిలియన్‌ డాలర్ల నుంచి 25.1 బిలియన్ డాలర్లకు తగ్గింది.

ప్రపంచ రాజకీయ అనిశ్చితితో 2016 సంవత్సరంలో ఈ ఇద్దరు దిగ్గజాల వెల్త్‌ కొంతమేర తగ్గింది. అదానీ సంపద 6.4 బిలియన్‌ డాలర్లకు, ముకేశ్‌ వెల్త్‌ 24.5 బిలియన్‌ డాలర్లకు పడిపోయింది. అదానీతో పోలిస్తే అంబానీ సంపద మధ్య తారతమ్యం మరింత పెరిగింది. 2017లో యూఎస్‌ ప్రెసిడెంట్‌గా డొనాల్డ్‌ ట్రంప్‌ ఎన్నిక కావడం.. ఆయనపై మన ఇన్వెస్టర్లలో ఉన్న భయాలు తొలగడంతో ఈక్విటీ మార్కెట్లు ఆ ఏడాది మళ్ళీ దౌడు తీశాయి. దీంతో అంబానీ, అదానీల సంపద 60 నుంచి 75 శాతం పెరిగింది. 2017లో అదానీ సంపద 11 బిలియన్‌ డాలర్లు కాగా, అంబానీ వెల్త్‌ 40.2 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది. అంతకుముందు ఏడాదితో పోలిస్తే ఇద్దరి మధ్య ఆస్తుల తారతమ్యంలో పెద్దగా మార్పు లేదు.

Adani Group: అంబుజా, ఏసీసీ కంపెనీలకు అదానీ రూ.31,000 కోట్ల ఓపెన్ ఆఫర్

2018లో మాత్రం గౌతమ్‌ అదానీకి షాక్‌ తగిలింది. అంబానీ మాత్రం జోరును కొనసాగించాడు. అదాని ఆస్తులు 10.4 బిలియన్‌ డాలర్లకు పడిపోగా… అంబానీ వెల్త్‌ 54.2 బిలియన్‌ డాలర్లకు ఎగబాకింది. 2019 ప్రారంభం నుంచి గౌతమ్‌ అదానీ సంపద అంతకంతకూ పెరుగుతుండగా… ముకేశ్‌ వెల్త్‌ మాత్రం ఓ మోస్తారుగా వృద్ధిని నమోదు చేస్తోంది. 2019లో గౌతమ్‌ అదానీ వెల్త్‌ 13.7 బిలియన్‌ డాలర్లు కాగా అంబానీ సంపద 55.2 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2020లో అదానీ సంపద 18.7 బిలియన్‌ డాలర్లు, ముకేశ్‌ వెల్త్‌ 87.9 బిలియన్‌ డాలర్లుగా నమోదైంది.

గత రెండేళ్ళ నుంచి చూస్తే అదానీ సంపద ఏడున్నర రెట్లు పెరగ్గా.. ముకేశ్‌ అంబానీ ఆస్తులు మాత్రం కేవలం 10శాతం పైగా పెరిగాయి. అప్పటి వరకు టఫ్‌ ఫైట్‌గా ఉన్న ఇద్దరి మధ్య వార్… ఆ తర్వాత వన్‌సైడ్‌గా మారిపోయింది. 2021లో అదానీ ఆస్తులు 68 బిలియన్‌ డాలర్లు, అంబానీ సంపద 96.5 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. ఈ ఏడాది మొదటల్లోనే అంబానీని అధిగమించి దేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఎదిగారు గౌతమ్‌ అదానీ. తన ఆస్తులను అంతకంతా పెంచుకుంటూ ముకేశ్‌కు అందనంత ఎత్తుకు ఎదిగారు. మూడు రోజుల క్రితం అదానీ ఆస్తులు 136.1 బిలియన్‌ డాలర్లు కాగా.. ముకేశ్‌ అంబానీ సంపద 98 బిలియన్‌ డాలర్లుగా ఉంది. బ్లూమ్‌బర్గ్‌ బిలియనీర్స్‌ ఇండెక్స్‌ ప్రకారం చూస్తే ఇవాళ గౌతమ్‌ అదానీ సంపద 141 బిలియన్‌ డాలర్లకు చేరింది. అంటే ఇద్దరి మధ్య తేడా 40 శాతం పైగానే ఉంది.

Adani Group To Buy NDTV : మీడియా రంగంలోకి అదానీ.. NDTV‌ని హస్తగతం చేసుకునే దిశగా అడుగులు

ప్రస్తుతం ప్రపంచంలో టాప్-ట్రిలో ఉన్నప్పటికీ… ఈ ఏడాది చివరినాటికి జెప్‌ బెజోస్‌ను అధిగమించే అవకాశాలున్నాయి. ఇదే జోరు కొనసాగితే వచ్చే ఏడాది, ఏడాదిన్నర కాలంలో ప్రపంచ సంపన్నుల జాబితాలో టాప్ పొజిషన్‌లోకి వచ్చే ఛాన్స్‌ వుందని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మరోవైపు ఈ ఏడాది రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌తో పాటు రిలయన్స్‌ గ్రూప్‌ షేర్స్‌ కూడా జోరును కొనసాగిస్తుండటం, అలాగే 5జీ రాకతో ముకేశ్‌ ఆస్తులు కూడా ఈ ఏడాది భారీగా పెరిగే అవకాశముంది.