Gautam Adani: ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానానికి దూసుకెళ్లిన గౌతమ్ అదానీ.. ఆసియా నుంచి మొదటి వ్యక్తి అతనే

గౌతమ్ అదానీ.. ప్రస్తుతం ఈ పేరు భారత్ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. గత కొన్నేళ్లుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్న అదానీ.. కీలక రంగాల్లో తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. ఫలితంగా ప్రపంచ కుబేరుల్లో మూడవ స్థానంలో నిలిచాడు.

Gautam Adani: ప్రపంచ కుబేరుల జాబితాలో 3వ స్థానానికి దూసుకెళ్లిన గౌతమ్ అదానీ.. ఆసియా నుంచి మొదటి వ్యక్తి అతనే

Gautam Adani

Gautam Adani: గౌతమ్ అదానీ.. ప్రస్తుతం ఈ పేరు భారత్ దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా మారుమోగిపోతుంది. గత కొన్నేళ్లుగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ వస్తున్న అదానీ.. కీలక రంగాల్లో తన వ్యాపార కార్యకలాపాలు సాగిస్తున్నారు. దీంతో అదే స్థాయిలో అదానీ సంపాదన పెరుగుతూ వచ్చింది. తాజాగా బ్లూమ్‌బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్‌ విడుదల చేసిన ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ మూడవ స్థానంకు చేరుకున్నాడు. 137 బిలియన్ డాలర్ల సంపాదనతో ప్రాన్స్ కు చెందిన బెర్నార్డ్ ఆర్నాల్ట్ ను అదాని వెనక్కు నెట్టాడు. మొదటి స్థానంలో ఎలన్ మస్క్ 251 బిలియన్ డార్లతో నిలవగా, జెఫ్ బెజోస్ 153 బిలియన్ డాలర్ల సంపాదనతో రెండవ స్థానంలో నిలిచాడు.

Gautam Adani : అన్నింటా ఆదానీయే .. వంటనూనెల నుంచి విద్యుత్‌ వరకూ .. పోర్టుల నుంచి మీడియా రంగం వరకు…

ఇదిలాఉంటే ఇప్పటి వరకు బ్లూమ్ బెర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ లో ఒక ఆసియా వ్యక్తి మొదటి మూడు స్థానాల్లోకి ప్రవేశించడం ఇదే మొదటి సారి. గతంలో ముఖేష్ అంబానీ, చైనాకు చెందిన జాక్ మా కుబేరుల జాబితాలో తొలి ఐదు స్థానాలకు చేరుకున్నప్పటికీ మూడవ స్థానంకు చేరుకోలేక పోయారు. అతితక్కువ కాలంలోనే వేగంగా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్న అదానీ.. రెండవ స్థానంలో నిలిచిన జెప్ బెజోస్ ను మరికొద్ది కాలంలో అధిగమించే అవకాశాలు లేకపోలేదని వ్యాపారవేత్తలు పేర్కొంటున్నారు. కాగా ఈ ఇండెక్స్‌లో ముఖేశ్‌ అంబానీ మొత్తం 91.9 బిలియన్ల డాలర్లతో 11వ స్థానంలో ఉన్నారు. దేశీయంగా అదానీ గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా గ్రూప్ తర్వాత మూడో అతిపెద్ద వ్యాపారసంస్థగా ఉంది.

Adani Group To Buy NDTV : మీడియా రంగంలోకి అదానీ.. NDTV‌ని హస్తగతం చేసుకునే దిశగా అడుగులు

అదానీ గత కొన్నేళ్లుగా బొగ్గు నుంచి పోర్టుల వరకు తన వ్యాపారాన్ని విస్తరింపజేసుకుంటూ వచ్చారు. డేటా సెంటర్ల నుంచి సిమెంట్, అల్యూమినియం వరకు తాజాగా మీడియా రంగంలోకి గౌతమ్ అదానీ ప్రవేశించారు. ఒక్క 2022 లోనే అదానీ సంపద 60.9 బిలియన్ డాలర్లు పెరిగింది. మిగిలిన బిలియనీర్లతో పోలిస్తే ఇది ఐదు రెట్లు ఎక్కువ. ఫలితంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో తొలి ఆసియా కుబేరుడిగా ముఖేశ్‌ అంబానీని దాటేశారు. ఆ తరువాత ఏప్రిల్‌లో సెంట్‌ బిలియనీర్‌ అయ్యారు. గతనెలలో మైక్రోసాఫ్ట్ కార్పోరేషన్ అధినేత బిల్‌గేట్స్‌ను అధిగమించి నాల్గో స్థానంకు చేరాడు. తాజాగా ప్రపంచ కుబేరుల జాబితాలో గౌతమ్ అదానీ మూడవ స్థానంలో నిలిచాడు.