Adani Group: లాభాల పంట పండిస్తున్న అదానీ గ్రూప్ కంపెనీలు.. ఒకే దెబ్బకు రూ.71,000 కోట్ల లాభం
అదానీ విల్మార్ మార్కెట్ క్యాప్ 0.47 శాతం మాత్రమే పెరిగింది. జూన్ 30 నాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.53,280 కోట్లు కాగా, జూలై 31 నాటికి రూ.53,533 కోట్లకు పెరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాప్ జూన్ 30 నాటికి రూ.1,49,833 కోట్ల నుంచి 15.59 శాతం పెరిగి జూలై 31 నాటికి రూ.1,73,182 కోట్లకు చేరుకుంది.

Adani Group: అదానీ గ్రూప్ కంపెనీలకు జూలై నెల బాగా కలిసి వచ్చింది. ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టిన వారికి కాసుల పంటే పండింది. అదానీ గ్రూప్ స్టాక్స్‌కు జూలైలో స్టాక్ మార్కెట్‌లో గ్రూప్‌లోని లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో 7.04 శాతం (రూ.71,032 కోట్ల) పెరుగుదల కనిపించింది. జూన్ 30 నుంచి జూలై 31 మధ్య అదానీ గ్రూప్ మార్కెట్ క్యాప్ రూ.10,09,075 కోట్ల నుంచి రూ.10,80,107 కోట్లకు పెరిగింది.
Ola Electric : జూలైలోనూ ఓలాదే ఆధిపత్యం.. ఈవీ మార్కెట్లో 40శాతం వాటాతో జోరుగా అమ్మకాలు..!
అదానీ పవర్ మార్కెట్ క్యాప్ ఒక నెలలో 9.39 శాతం పెరిగింది. జూన్ 30 నాటికి అదానీ పవర్ మార్కెట్ క్యాప్ రూ.96,365 కోట్లు కాగా, జూలై 31 నాటికి రూ.1,05,410 కోట్లకు పెరిగింది. అదానీ గ్రూప్‌కు చెందిన ఫ్లాగ్‌షిప్ కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ క్యాప్ 4.36 శాతం పెరిగింది. అదానీ ఎంటర్‌ప్రైజెస్ మార్కెట్ క్యాప్ రూ.2,72,238 కోట్ల నుంచి రూ.2,84,111 కోట్లకు పెరిగింది. ఇంతకుముందు అదానీ ట్రాన్స్‌మిషన్‌గా ఉన్న అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ మార్కెట్ క్యాప్‌లో 6.97 శాతం పెరిగింది. జూన్ 30 నాటికి అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ మార్కెట్ క్యాప్ రూ.85,586 కోట్లు కాగా, జూలై 31 నాటికి రూ.91,548 కోట్లకు పెరిగింది.
Monu Manesar: ఎవరు ఈ మోను మానేసర్..? గురుగ్రామ్ హింసకు సూత్రధారి అయిన ఇతడి గత చరిత్ర తెలుసా?
అదానీ విల్మార్ మార్కెట్ క్యాప్ 0.47 శాతం మాత్రమే పెరిగింది. జూన్ 30 నాటికి కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.53,280 కోట్లు కాగా, జూలై 31 నాటికి రూ.53,533 కోట్లకు పెరిగింది. అదానీ గ్రీన్ ఎనర్జీ మార్కెట్ క్యాప్ జూన్ 30 నాటికి రూ.1,49,833 కోట్ల నుంచి 15.59 శాతం పెరిగి జూలై 31 నాటికి రూ.1,73,182 కోట్లకు చేరుకుంది.
Pawan Kalyan Fans : త్రివిక్రమ్ పై పవన్ ఫ్యాన్స్ ఆగ్రహం.. గురూజీ కోసం రంగంలోకి దిగిన థమన్..
అదానీ పోర్ట్స్ మార్కెట్ క్యాప్ 5.22 శాతం పెరిగింది. అదే సమయంలో కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1,59,688 కోట్ల నుంచి రూ.1,68,026 కోట్లకు పెరిగింది. అంబుజా సిమెంట్ మార్కెట్ క్యాప్ 8.71 శాతం పెరిగింది. జూన్ 30న మార్కెట్ క్యాప్ రూ.84,568 కోట్లు కాగా, జూలై 31 నాటికి రూ.91,935 కోట్లకు పెరిగింది. ఏసీసీ మార్కెట్ క్యాప్ 11.26 శాతం పెరిగింది. జూన్ 30 నాటికి మార్కెట్ క్యాప్ రూ.34,058 కోట్ల నుంచి జూలై 31 నాటికి రూ.37,893 కోట్లకు పెరిగింది. ఇక మీడియా సంస్థ అయిన ఎన్డీటీవీ మార్కెట్ క్యాప్‌లో స్వల్పంగా 0.61 శాతం పెరిగింది.