ఇక Whatsappలోనూ Ads కనిపిస్తాయి!

  • Published By: sreehari ,Published On : January 6, 2020 / 03:50 PM IST
ఇక Whatsappలోనూ Ads కనిపిస్తాయి!

Updated On : January 6, 2020 / 3:50 PM IST

ప్రముఖ మెసేంజర్ యాప్ వాట్సాప్ 2018లో యూజర్ల కోసం ఎన్నో సరికొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. ఈ ఏడాది 2020లోనూ మరిన్ని కొత్త ఫీచర్లను రిలీజ్ చేయనుంది. ఇప్పటివరకూ ఆకర్షణీయమైన ఫీచర్లు, అప్ డేట్స్ తీసుకొచ్చిన వాట్సాప్.. యూజర్ ఎక్స్ పీరియన్స్ మరింత విస్తరించనుంది.

ఈ ఏడాదిలో రిలీజ్ చేసే కీలక ఫీచర్లలో ఒకటైన Status Ads ఫీచర్ ప్రేక్షకుల అందబాటులోకి తీసుకురానుంది. ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ మాదిరిగానే వాట్సాప్ లో కూడా యూజర్లకు యాడ్స్ కనిపించనున్నాయి. ఇటీవలే నెదార్లాండ్స్ లో జరిగిన ఫేస్ బుక్ మార్కెటింగ్ సమ్మిట్ (FMC) 2019లో కంపెనీ ఈ విషయాన్ని రివీల్ చేసింది.

ఈ సందర్భంగా Ads గురించి ఫేస్ బుక్ మాట్లాడుతూ.. స్టేటస్‌లో యాడ్స్ డిస్‌ప్లే అవుతాయని, అడ్వర్టైజర్ పేరును యూజర్లు చూడొచ్చునని తెలిపింది. అయితే, అడ్వర్టైజర్ కాంటాక్ట్ ప్రొఫైల్ పిక్ ను మాత్రం యూజర్లు చూడలేరని కంపెనీ స్పష్టం చేసింది. కానీ, అడ్వర్టైజ్ మెంట్ పై స్వైపింగ్ చేసి యాడ్ ఏంటో చూడొచ్చు.

ఇన్ స్టాగ్రామ్ స్టోరీస్ మాదిరిగానే వాట్సాప్ స్టేటస్ యాడ్స్ డిస్‌ప్లే అవుతాయి. ఈ స్టేటస్ యాడ్స్ ఫీచర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేదానిపై కంపెనీ అధికారికంగా రివీల్ చేయలేదు. ప్రస్తుతం యాడ్ ఫీచర్ పై వాట్సాప్ వర్క్ చేస్తుంది.. అతి త్వరలో అధికారిక లాంచింగ్ ఉండే అవకాశం ఉంది. స్టేటస్ యాడ్ ఫీచర్ ఒకసారి అందుబాటులోకి వచ్చాక ఆండ్రాయిడ్, ఐఓఎస్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.

Whatapp Ads ఎలా వర్క్ అవుతాయంటే :
వాట్సాప్ స్టేటస్ లో మాత్రమే ఈ యాడ్స్ కనిపిస్తాయి. ప్రస్తుతం.. వాట్సాప్ స్టేటస్ లో ఫొటోలు, వీడియోలు, టెక్స్ట్, ఇతర మల్టీమీడియా ఫైల్స్ మాత్రమే కనిపిస్తున్నాయి. ఇదే తరహాలో వాట్సాప్ స్టేటస్ యాడ్స్ కూడా డిస్ ప్లే అవుతాయి. యూజర్ల ఆసక్తి, వారి ప్రవర్తన శైలి ఆధారంగా యాడ్స్ డిస్ ప్లే అవుతాయి.

వాట్సాప్ స్టేటస్ లో కనిపించే యాడ్స్ ను యూజర్లు చూడవచ్చు. యాడ్ చివరిభాగంలో అడ్వర్టైజర్ పేరు కూడా కనిపిస్తుంది. యాడ్ మొత్తం చూడాలంటే.. యూజర్లు దానిపై స్వైప్ చేయాల్సి ఉంటుంది. ఇన్ స్టాగ్రామ్ మాదిరిగానే వాట్సాప్ యాడ్స్ ఫీచర్ పనిచేయనుంది.

కొన్ని నెలల క్రితమే WABetaInfo ట్విట్టర్ వేదికగా Whatsapp Status Adsపై పోల్ నిర్వహించింది. ఈ సందర్భంగా యూజర్ల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంది. స్టేటస్ యాడ్ ఫీచర్ యాక్టివేషన్ పై ప్రస్తావించింది. కానీ, ఆ పోల్ ఫలితాల్లో.. స్టేటస్ యాడ్ ఫీచర్ పట్ల వాట్సాప్ యూజర్లు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు వెల్లడైంది. ఒకవేళ వాట్సాప్..తమ ప్లాట్ ఫాంపై స్టేటస్ యాడ్స్ డిస్ ప్లే చేస్తే మాత్రం వెంటనే వాట్సాప్ అకౌంట్ డిలీట్ చేసేస్తామని కొందరు యూజర్లు స్పష్టం చేసినట్టు తెలిపింది.