Gold Loan ATM: నగలు మిషన్‌లో వేస్తే 10 నిమిషాల్లో లోన్ ఇచ్చే గోల్డ్ ఏటీఎం..
ఇక్కడ ఏర్పాటు చేసిన గోల్డ్ లోన్ ఏటీఎం సక్సెస్ అయితే భారత్‌లోని మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు.

గోల్డ్‌లోన్ కావాలంటే ఏం చేస్తాం? బ్యాంకులకో, లేదా ఇతర ఫైనాన్స్ సంస్థల వద్దకో వెళ్తాం. అంతేగానీ, ఏటీఎం వద్దకు వెళ్లం కదా? అయితే, వరంగల్ నగరంలో మాత్రం ఏటీఎం వద్దకు వెళ్తే గోల్డ్ లోన్ తీసుకోవచ్చు.
గోల్డ్ లోన్ రావాలంటే గంటల తరబడి వేచి చూడాల్సిన అవసరం కూడా లేదు. 10 నిమిషాల్లోనే మీ ఆధార్ కార్డు, మొబైల్ నంబరుతో గోల్డ్‌లోన్ ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చు. ఇక్కడ సెంట్రల్ బ్యాంకు ఆఫ్ ఇండియా వరంగల్ బ్రాంచ్ ఈ గోల్డ్‌లోన్ ఏటీఎం ఏర్పాటు చేసింది.
ఈ బ్యాంకు ఎండీ, సీఈవో ఎంవీరావు ఈ గోల్డ్‌లోన్ ఏటీఎం గురించి వివరాలు తెలిపారు. భారత్‌లో మొదటిసారి ప్రయోగాత్మకంగా ఈ గోల్డ్‌లోన్ ఏటీఎంను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కృత్రిమ మేధతో ఈ గోల్డ్‌లోన్ ఏటీఎంను అభివృద్ధి చేసినట్లు తెలిపారు.
పసిడి ఆభరణాలను మిషన్ బాక్సులో వేయాలి. దీంతో దాని నాణ్యత, బరువును కృత్రిమ మేధ గుర్తిస్తుంది. అనంతరం ఆ రోజు మార్కెట్‌లోని గోల్డ్ ధరల ప్రకారం లోన్ ఇస్తుంది. అందులో 10 శాతం డబ్బు ఏటీఎం ద్వారా తీసుకోవచ్చు.
మిగతా నగదు మీ బ్యాంక్ అకౌంట్‌లో జమ అవుతుంది. ఈ గోల్డ్ లోన్ ఏటీఎం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉన్నవారి కోసమే. గోల్డ్ లోన్ తీసుకోవాలనుకునే వారికి ఈ ఏటీఎం వల్ల సమయం ఆదా అవుతుంది.
ఇక్కడ ఏర్పాటు చేసిన గోల్డ్ లోన్ ఏటీఎం సక్సెస్ అయితే భారత్‌లోని మిగతా ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తారు. భలే ఉంది కదా గోల్డ్ లోన్ ఏటీఎం. భవిష్యత్తులో ఇటువంటి ఆవిష్కరణలు ఇంకా ఎన్ని వస్తాయో..