అమెజాన్ Diwali స్పెషల్ సేల్ : Top 5 స్మార్ట్ ఫోన్లపై భారీ ఆఫర్లు ఇవే

కొత్త స్మార్ట్ ఫోన్ కొంటున్నారా? ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్ లో లేటెస్ట్ దీపావళి సేల్స్ మొదలైంది. దీపావళి పండగను పురస్కరించుకుని కొత్త స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు, ఆఫర్లను అందిస్తోంది. కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయాలనుకునే వారు డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్ ఆఫర్లతో సొంతం చేసుకోవచ్చు.
యాక్సస్ బ్యాంకు, సిటీ బ్యాంకు, Rupay కార్డుల ద్వారా కొత్త స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేసిన వినియోగదారులకు అదనంగా 10 శాతం వరకు డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అమెజాన్ అందించే ఆఫర్లలో టాప్ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. మీకు నచ్చిన స్మార్ట్ ఫోన్ సెలెక్ట్ చేసుకుని వెంటనే సొంతం చేసుకోండి. అవేంటో ఓసారి చూద్దాం.
1. వన్ ప్లస్ 7 :
వన్ ప్లస్ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లలో ఇదొకటి. ఈ ఫోన్ మార్కెట్లో లాంచ్ అయిన కొన్నిరోజుల్లోనే 4.5 రేటింగ్ తో 16వేలకు పైగా రివ్యూలు వచ్చాయి. మోడల్ ఫోన్ స్నాప్ డ్రాగన్ 855 SoCతో పాటు 6GB +128GB, 8GB + 256GB స్టోరేజీ వేరియంట్లతో అందుబాటులో ఉంది.
కెమెరా విషయానికి వస్తే.. డ్యుయల్ కెమెరా సెటప్, 48మెగాఫిక్సల్ లెన్స్ ఉంది. సెకండరీ కెమెరా 5మెగా ఫిక్సల్ తో పాటు 16MP ఫ్రంట్ కెమెరా ఉంది. 6GB వేరియంట్ ఫోన్ ప్రస్తుతం అందుబాటులో లేదు. కానీ, 8GB ర్యామ్ వేరియంట్ ఫోన్ మాత్రం అమెజాన్ నుంచి అదనపు ఆఫర్లతో కలిపి రూ.34వేల 999గా లభ్యం అవుతోంది.
2. వన్ ప్లస్ 7 ప్రో :
వన్ ప్లస్ 7 తర్వాత వన్ ప్లస్ 7 ప్రో మార్కెట్లో రిలీజ్ అయింది. ఈ ఫోన్ కూడా సగటు రేటింగ్ 4.5తో 10వేలకు పైగా కస్టమర్లను ఆకర్షించింది. ఇందులో స్నాప్ డ్రాగన్ 855 SoC సపోర్ట్ తో 8GB +12GB ర్యామ్ వేరియంట్లు ఉన్నాయి. 6.67 90Hz డిస్ ప్లే (1140×3120 ఫిక్సల్స్)తో పాటు కర్వడ్ గ్లాస్, HDR 10 సపోర్ట్ చేస్తుంది.
కెమెరా విషయానికి వస్తే.. ట్రిపుల్ కెమెరాలు (48MP + 8MP+16MP) ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఫ్రంట్ సైడ్ 16MP పాప్ అప్ సెల్ఫీ కెమెరా అదనపు ఆకర్షణగా చెప్పుకోవచ్చు. ఈ మోడల్ బేసిక్ వెర్షన్ ప్రారంభ ధర రూ.48వేల 999తో లభ్యం అవుతోంది.
3. శాంసంగ్ గెలాక్సీ M30 :
అమెజాన్ ఆఫర్ చేసే టాప్ రేటింగ్ స్మార్ట్ ఫోన్లలో శాంసంగ్ నుంచి రిలీజ్ అయిన మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్ గెలాక్సీ M30 ఒకటి. ఈ ఫోన్ కొనుగోలుపై 4.5 స్టార్ రేటింగ్ తో 46వేల మంది కస్టమర్లు సంతృప్తిగా ఉన్నారు. ఫోన్ స్పెషిఫికేషన్ల విషయానికి వస్తే.. గెలాక్సీ M30 ఫోన్ Exynos 9611 ప్రాసెసర్ తో వచ్చింది. 6GBర్యామ్ +64GB స్టోరేజీ, 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ వేరియంట్లు ఉన్నాయి.
ఇందులో ట్రిపుల్ కెమెరా సెటప్ ప్రత్యేక ఆకర్షణగా ఉండగా.. ప్రైమరీ లెన్స్ 48MP అదనపు ఆకర్షణగా చెప్పవచ్చు. అమెజాన్ అందించే అదనపు ఆఫర్లలో ఈ ఫోన్ ప్రస్తుత ప్రారంభ ధర రూ.16వేల 990 నుంచి అందుబాటులో ఉంది.
4. ఒప్పో K3 :
ఒప్పో నుంచి రిలీజ్ అయిన కొత్త స్మార్ట్ ఫోన్లలో ఒప్పో K3 ఒకటి. రూ.20వేల రేంజ్ స్మార్ట్ ఫోన్లలో ఇదొకటిగా చెప్పుకోవచ్చు. దీనిపై 3వేల మంది కస్టమర్లు సగటున 4.5 స్టార్ రేటింగ్ ఇచ్చారు. ఈ రేంజ్ స్మార్ట్ ఫోన్ కొనేవారు దీన్ని సొంతం చేసుకోవచ్చు. ఈ ఫోన్ 710 SoC స్నాప్ డ్రాగన్ తో పాటు 6GB +64GB ర్యామ్, 8GB +128GB ర్యామ్ వేరియంట్లతో లభ్యం అవుతోంది.
ఇందులో డ్యుయల్ కెమెరా (16MP +2MP) ఉండగా, 16MP పాప్ సెల్ఫీ కెమెరా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంది. మరోవైపు 6GB వేరియంట్ ఫోన్ అందుబాటలో లేదు. కానీ, 8GB వేరియంట్ ఫోన్ ధర రూ.18వేల 990తో లభ్యం అవుతోంది.
5. ఐఫోన్ XR :
ప్రీమియం రేంజ్ స్మార్ట్ ఫోన్లలో ఆపిల్ కంపెనీ రిలీజ్ చేసిన ఐఫోన్ XR ఒకటి. ఈ ఫోన్ సగటు రేటింగ్ 4.5 స్టారింగ్ ఇచ్చిన స్మార్ట్ ఫోన్ల జాబితాలో ఉంది. ఈ డివైజ్ లో ఆపిల్ A12బయోనిక్ చిప్ స్పెషల్ ఎట్రాక్షన్. సింగిల్ 12MP కెమెరాతో పాటు ఫ్రంట్ కెమెరా 7MP ఉంది. దీని ప్రారంభ ధర రూ.44వేల 900తో అదనంగా ఎక్సేంజ్, బ్యాంకు, కార్డులపై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి.